amp pages | Sakshi

సినీ గీతాల్లో అసభ్య పదజాలమా!

Published on Sun, 09/04/2016 - 19:09

మద్రాసు హైకోర్టు నాయమూర్తి ఖండన
 తమిళసినిమా: సినీ గీతాల్లో అసభ్య పదజాలం హద్దులు మీరుతోందని, ఇది సమాజంపై దుష్ర్పభావం చూపిస్తుందని మద్రాసు హైకోర్టు న్యాయమూర్తితీవ్రవ్యాఖ్యలు చేశారు. వివరాలు.. చెన్నై, మనలి ప్రాంతానికి చెందిన ప్రభుకుమార్‌ను 16 ఏళ్ల అమ్మాయిని అసభ్య పదజాలంతో దూషించిన కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో బెయిలు కోరుతూ ప్రభుకుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు శనివారం విచారణకు వచ్చింది. పిటిషనర్ తరఫు న్యాయవాది తన వాదనను వినిపిస్తూ పోలీసులు పేర్కొన్న సదరు యువతి,  ప్రభుకుమార్ ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారని, ఇది వారిపై పెట్టిన తప్పుడు కేసు అని వాదించారు.
 
  అయితే పోలీసుల తరఫున హాజరైన న్యాయవాది ఆ అమ్మాయి తల్లితో కలిసి రోడ్డుపై వెళుతుండగా పెళ్లి చేసుకుని పారిపోదామా? పారిపోయి పెళ్లి చేసుకుందామా?అంటూ సినిమా పాటను పాడాడని పేర్కొన్నారు. అతని చర్యలను ప్రశ్నించిన వారిపై చెయ్యి చేసుకోవడమే కాకుండా హత్యా బెదిరింపులు చేశాడని కోర్టుకు వివరించారు. ఇరుతరఫు వాదనలు విన్న న్యాయమూర్తి ప్రభుకుమార్‌కు నిబంధనలతో కూడిన బెయిలు మంజూరు చేస్తూ ఇదిబాలల అత్యాచార నేర వ్యతిరేక చట్టం కింద నమోదైన కేసు అని పోలీసులు పూర్తిగా విచారణ చేసి వివరాలను కోర్టుకు సమర్పించాలని ఆదేశించారు.
 
 సినీ పాటల్లో అసభ్య పదజాలంపై ఖండన
 అదే సమయంలో సినీ రంగానికి చెందిన వారి చర్యలను తాను తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. భావితరాల మనసుల్లో మంచి భావాలను, సమాజంలో బాధ్యతాయుతమైన అంశాలను పెంపొందించే విధంగా వారి చర్యలు ఉండాలన్నారు. అశ్లీల పదజాలాలు, హింసాత్మక సంఘటనలతో ఉన్నతమైన మన సంస్కృతి, సంప్రదాయాలకు సినీరంగానికి చెందిన వారు కీడు తలపెడుతున్నారని చురకలు వేస్తూ తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. సినిమాలు, ఆ రంగానికి చెందిన వారు సమాజాభివృద్ధికి తోడ్పడాలని న్యాయమూర్తి హితవు పలికారు.
 

Videos

బెంగుళూరు రేవ్ పార్టీ... టీడీపీ,సోమిరెడ్డికి ఇచ్చిపడేసిన కాకాణి

తప్పుడు ఆరోపణలపై యాంకర్ శ్యామల పరువు నష్టం దావా

TG క్రేజ్ ..రవాణా శాఖకు ఒకే రోజు 40 లక్షల ఆదాయం

కాంగ్రెస్ పై హరీష్ రావు ఫైర్

వంగా గీతకు చేతులెత్తి మొక్కిన యాంకర్ శ్యామల

రేవ్ పార్టీలో యాంకర్ శ్యామల? వంగా గీత రియాక్షన్

ఎల్లో మీడియాపై యాంకర్ శ్యామల పరువు నష్టం దావా

ఈ ఫోటోలో వ్యక్తి కనబడుట లేదు: జోగి రమేష్

ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ భద్రతా చర్యలపై చర్చ

అడ్డదిడ్డంగా మాట్లాడుతున్న ప్రశాంత్ కిషోర్ ? పీకే నోట బాబు పలుకులు

Photos

+5

ఓ వైపు టెన్షన్.. మరోవైపు ఉత్సాహం: స్టేడియంలో తళుక్కుమన్న షారుఖ్ (ఫొటోలు)

+5

Tirupati Gangamma Jatara 2024: తిరుపతిలో ఘనంగా తాతయ్యగుంట గంగమ్మ జాతర (ఫొటోలు)

+5

SRH: అతడి లాగే నన్నూ ఆశీర్వదించండి: అభిషేక్‌ తల్లికి అర్ష్‌దీప్‌ రిక్వెస్ట్‌ (ఫొటోలు)

+5

రజనీకాంత్‌ మనవడి బర్త్‌డే సెలబ్రేషన్స్‌.. క్రికెట్‌ థీమ్‌తో.. (ఫోటోలు)

+5

Hakim Shajahan Marriage: హీరోయిన్‌ను పెళ్లాడిన మలయాళ హీరో.. ఎంతో సింపుల్‌గా! (ఫోటోలు)

+5

Indraja Sankar Birthday Photos: విజిల్‌ నటి బర్త్‌డే సెలబ్రేషన్స్‌.. పెళ్లి తర్వాత భర్తతో తొలిసారి (ఫోటోలు)

+5

SRH Vs PBKS Highlights Photos: సన్ రైజర్స్ vs పంజాబ్..తారలతో నిండిన ఉప్పల్ స్టేడియం (ఫోటోలు)

+5

Shobha Shetty: కొత్తింటి కల సాకారం చేసుకున్న బిగ్‌బాస్‌ బ్యూటీ.. ప్రియుడితో గృహప్రవేశం (ఫోటోలు)

+5

నటుడు చందు కన్నుమూత.. వైరలవుతున్న పెళ్లి ఫోటోలు

+5

Afghanistan Floods: అఫ్ఘాన్‌ కొట్టుకుపోయింది.. మిగిలింది శూన్యమే (ఫొటోలు)