లేనిపోని పుకార్లు పుట్టించొద్దు

Published on Fri, 01/31/2014 - 23:48

 ఇటీవల కరీనాకపూర్ ఓ ప్రైవేటు ఫంక్షన్‌కి హాజరయ్యారు. ఆమె ధరించిన వస్త్రాల వల్లనో, లేక తిన్న ఫుడ్ కారణంగానో తెలీదు కానీ... ఆమె పొట్ట కాస్త ఎత్తుగా కనిపించిందట. దాన్ని చీర కుచ్చిళ్లలో దాచేయాలని కరీనా ప్రయత్నం చేశారట. ఇంకేముంది బెబో ప్రెగ్నెన్సీపై అక్కడ గుసగుసలు మొదలయ్యాయి. ఈ విషయం మీడియాకు ఎలా పొక్కిందో కానీ... ‘కరీనా గర్భవతా?’ అంటూ కథనాలు మొదలయ్యాయి. గతంలో ‘ఆమిర్‌ఖాన్ రెండో పెళ్లి చేసుకున్నారు. ఇటీవలే హృతిక్ కూడా తన భార్య నుంచి విడాకులు తీసుకున్నారు. కలహాల మధ్య బాలీవుడ్ కపుల్స్ జీవితాలు సాగుతుంటే... కరీనా, సైఫ్‌అలీఖాన్ జంట మాత్రం ఎంతో అన్యోన్యంగా జీవితం సాగిస్తోంది. తన భర్త పేరును తన పేరులో కలుపుకొని ‘సైఫీనా’గా పిలిపించుకుంటున్నారు కరీనా. త్వరలో సైఫీనా తల్లి కాబోతున్నారు’ అని వివిధ చానల్స్‌లో ఆసక్తికర కథనాలు ప్రసారమయ్యాయి. దీంతో ఖంగు తినడం బెబో వంతైంది. అందుకే ప్రత్యేకంగా ఈ విషయం కోసమే మీడియా సమావేశం ఏర్పాటు చేశారు కరీనా.
 
  ‘‘ప్రస్తుతం నా చేతిలో ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులు ఉన్నాయి. కొన్ని వ్యాపార ప్రకటనల్లో కూడా నటిస్తున్నాను. ఇలాంటి సమయంలో ఈ రూమర్లు నా నిర్మాతల్ని భయాందోళనలకు గురి చేసే ప్రమాదం ఉంది. అందుకే వివరణ ఇస్తున్నా. నేను గర్భవతిని కాను. ఇప్పుడే తల్లిని కావాలని నాకు లేదు. ఆల్రెడీ సైఫ్‌కి ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారు నా పిల్లలే. వారి నుంచే తల్లిప్రేమను పొందుతున్నాను. దయచేసి ఇలాంటి లేనిపోని పుకార్లను పుట్టించొద్దు’’ అని మీడియాను బతిమాలారు కరీనా.
 

Videos

తిరుమలలో వైఎస్ఆర్ సీపీ నేతలు

కొందరు చిల్లర రాజకీయాల కోసం తెలంగాణ ఉద్యమాన్ని వాడుకున్నారు

ఏపీ ఎగ్జిట్ పోల్స్ పై మల్లాది విష్ణు రియాక్షన్

ఏపీ ఎగ్జిట్ పోల్స్ పై ఆర్కే రోజా రియాక్షన్

దేశవ్యాప్తంగా పెరిగిన టోల్ చార్జీలు..

తెలంగాణ భవన్ లో ఘనంగా రాష్ట్ర అవతరణ వేడుకలు

బాహుబలి వర్సెస్ బుజ్జి

హిమాలయాల్లో రజినీకాంత్..

తెలంగాణ ఆత్మగౌరవానికి పదేళ్ల పట్టాభిషేకం

భారీ ఎత్తున సెట్ నిర్మాణం.. సెట్ లో సినిమా మొత్తం..?

Photos

+5

తెలంగాణ రాష్ట్ర గీతం పాడిన సింగర్‌ హారిక నారాయణ్‌ (ఫోటోలు)

+5

సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు (ఫొటోలు)

+5

త్వరలో పెళ్లి.. వెకేషన్‌లో చిల్‌ అవుతున్న సిద్దార్థ్‌- అదితి (ఫోటోలు)

+5

T20WC2024 USA vs Canada Highlights: కెనడా జట్టుపై అమెరికా సంచలన విజయం (ఫొటోలు)

+5

రెండేళ్లలో ఎన్నో ఎత్తుపళ్లాలు చూశాం.. ఇక ముందు: దీపక్‌ చహర్‌ భావోద్వేగం (ఫొటోలు)

+5

T20 WC 2007: ధోని నమ్మకం నిలబెట్టిన వరల్డ్‌కప్‌ విజేత.. ఇప్పుడేం చేస్తున్నారో తెలుసా? (ఫోటోలు)

+5

Kiccha Sudeep Daughter Sanvi: కిచ్చా సుదీప్‌ కూతురు ఇప్పుడెలా ఉందో చూశారా? (ఫోటోలు)

+5

Dimple Hayathi Visits Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టాలీవుడ్‌ హీరోయిన్‌ డింపుల్ హయాతి (ఫొటోలు)

+5

Allari Naresh-Virupa: తొమ్మిదవ పెళ్లి రోజు.. అల్లరి నరేశ్‌ భార్యను చూశారా? (ఫోటోలు)

+5

తిరుమలలో బిగ్‌బాస్‌ సందీప్‌ 10వ పెళ్లి రోజు సెలబ్రేషన్స్‌ (ఫోటోలు)