Breaking News

మీ ప్రేమ జాతకం తెలుసుకోండి!

Published on Fri, 03/20/2020 - 15:05

మేషం: అనుకున్న  ఇష్టులైన వారికి సందేశాలు అందించేందుకు శుక్ర, గురువారాలు అత్యంత అనుకూలమైనవిగా చెప్పవచ్చు. ఈరోజుల్లో మీ ప్రతిపాదనలు అవతలివారు వినమ్రంగా స్వీకరించే వీలుంటుంది. ఇక ఈ సమయంలో మీరు ఆరెంజ్, రెడ్‌ రంగు దుస్తులు ధరిస్తే మంచిది. అలాగే, ఇంటి నుంచి తూర్పుదిశగా బయలుదేరండి. అయితే, సోమ, మంగళవారాలు వీటికి దూరంగా ఉండడం మంచిది.

వృషభం: మీ మనస్సులో ఇంతకాలం దాచుకున్న భావాలను మీరు అత్యంత ఇష్టపడే వారికి తెలిపేందుకు ఆది, సోమవారాలు అనుకూలమైనవి. ఈ సమయంలో మీ ప్రతిపాదనలపై అవతలి వైపు నుంచి సానుకూలత వ్యక్తమయ్యే అవకాశం ఉంది. ఈ రోజుల్లో మీరు వైట్, బ్లూ రంగు దుస్తులు ధరిస్తే మంచిది. అలాగే, ఇంటి నుంచి పశ్చిమ వాయువ్య దిశగా బయలుదేరితే శుభదాయకంగా ఉంటుంది. ఇక, శుక్ర, బుధవారాలు ఇటువంటి ప్రయత్నాలు విరమిస్తే మంచిది.

మిథునం: మీమనస్సులో ఉన్న వారికి ప్రేమసందేశాలు అందించేందుకు సోమ, బుధవారాలు అనుకూలమైనవిగా చెప్పొచ్చు. ఈ రోజుల్లో మీ ప్రతిపాదనలపై అవతలి వైపు నుంచి అనుకూల స్పందనలు రావచ్చు. ఈ సమయంలో మీరు ఎల్లో, పింక్‌ రంగు దుస్తులు ధరించండి. అలాగే, ఇంటి నుంచి దక్షిణదిశగా బయలుదేరండి. అయితే, శని, మంగళవారాలు ఇటువంటి ప్రయత్నాలు విరమించండి.

కర్కాటకం: మీరు అత్యంత ఇష్టపడే వారికి మనస్సులోని భావాలను శుక్ర, బుధవారాలు వెల్లడిస్తే అనుకూలత ఉంటుంది. ఈ సమయంలో మీ ప్రతిపాదనలను అవతలి వారు సైతం అంగీకరించే వీలుంటుంది. ఈ సమయంలో మీరు రెడ్, వైట్‌ రంగు దుస్తులు ధరించాలి. అలాగే, ఇంటి నుంచి ఉత్తరఈశాన్యదిశగా బయలుదేరితే శుభదాయకంగా ఉంటుంది. ఇక, ఆది, మంగళవారాలు ఇటువంటి వాటికి దూరంగా ఉండండి.

సింహం: మీరు కోరుకున్న వ్యక్తులకు మనస్సులోని అభిప్రాయాన్ని తెలియజేసేందుకు ఆది, సోమవారాలు అనువైనవిగా చెప్పవచ్చు. ఈ రోజుల్లో మీ ప్రతిపాదనలపై అవతలి వారు కూడా సానుకూలత వ్యక్తం చేసే వీలుంది. ఇక ఈసమయంలో మీరు ఆరెంజ్, పింక్‌ రంగు దుస్తులు ధరిస్తే మంచిది. అలాగే, ఇంటి నుంచి తూర్పుదిశగా బయలుదేరితే అనుకూలం. ఇక, బుధ, గురువారాలు మీ ప్రయత్నాలకు విరామం ఇవ్వండి.

కన్య: మీ మనస్సులోని భావాలను ఇష్టపడే వారికి తెలిపేందుకు సోమ, మంగళవారాలు అత్యంత అనుకూలత ఉంటుంది. ఈ రోజుల్లో  మీ అభిప్రాయాలను అవతలి వారు మన్నించే అవకాశాలుంటాయి. ఈ సమయంలో మీరు ఎల్లో, వైట్‌ రంగు దుస్తులు ధరిస్తే లాభదాయకంగా ఉంటుంది. అలాగే, ఇంటి నుంచి ఉత్తరదిశగా బయలుదేరితే మంచిది. ఇక, శుక్ర, బుధవారాలు మీ ప్రయత్నాలను విరమించండి.

తుల: మీరు అత్యంత ఇష్టపడే వారికి మీ మదిలో దాచుకున్న అభిప్రాయాలను తెలియజేసేందుకు ఆది, బుధవారాలు అత్యంత అనుకూలమైనవిగా చెప్పవచ్చు. ఈ సమయంలో మీ మనోగతాన్ని అర్థం చేసుకున్న అవతలి వారు కూడా అనుకూలత వ్యక్తం చేసే వీలుంటుంది. ఈ రోజుల్లో మీరు ఆరెంజ్, ఎల్లోరంగు దుస్తులు ధరిస్తే మంచిది. అలాగే, ఇంటి నుంచి తూర్పు ఈశాన్య దిశగా బయలుదేరితే శుభప్రదంగా ఉంటుంది. ఇక, శుక్ర, శుక్రవారాలు వీటికి దూరంగా ఉండండి.

వృశ్చికం: మీరు కోరుకున్న వ్యక్తులకు మీ ప్రేమసందేశాలను అందించేందుకు శని, బుధవారాలు అత్యంత అనువైనవిగా చెప్పవచ్చు. ఈ సమయంలో చేసే ప్రతిపాదనలు అవతలి వారి ఆమోదం పొందే వీలుంది. ఈ సమయంలో మీరు బ్లూ, వైట్‌ రంగు దుస్తులు ధరిస్తే శుభదాయకంగా ఉంటుంది. అలాగే, ఇంటి నుంచి పశ్చిమదిశగా బయలుదేరితే శుభప్రదంగా ఉంటుంది. ఇక, ఇటువంటి వాటికి సోమ, మంగళవారాలు దూరంగా ఉండండి.

ధనుస్సు: మీ మనస్సులోని భావాలను ఇష్టులకు వెల్లడించేందుకు ఆది, సోమవారాలు అత్యంత అనుకూలమైనవిగా చెప్పవచ్చు. ఈ రోజుల్లో చేసే ప్రతిపాదనలు అవతలి వారిని ఆకట్టుకుంటాయి. ఈ రోజుల్లో మీరు ఆరెంజ్, ఎల్లోరంగు దుస్తులు ధరిస్తే లాభదాయకంగా ఉంటుంది. అలాగే, ఇంటి నుంచి తూర్పుదిశగా బయలుదేరండి. ఇక, మీ ప్రయత్నాలకు శుక్ర, బు«దవారాలు స్వస్తి చెప్పడం మంచిది.

మకరం: మీ మనోగతాన్ని ఇష్టులకు తెలిపేందుకు శుక్ర,మంగళవారాలు అత్యంత అనుకూలమైనవిగా చెప్పవచ్చు. ఈ రోజుల్లో అవతలి నుంచి కూడా అనుకూల స్పందనలు వచ్చే వీలుంది. ఈ సమయంలో మీరు వైట్, బ్లూ రంగు దుస్తులు «ధరిస్తే మంచిది. అలాగే, పశ్చిమదిశగా ఇంటి నుంచి బయలుదేరండి. ఇక, ఆది, గురువారాలు వీటికి దూరంగా ఉండడం మంచిది.

కుంభం: మీరు కోరుకున్న వ్యక్తులకు మనస్సులోని భావాలను తెలిపేందుకు ఆది, సోమవారాలు అత్యంత అనుకూలమైనవిగా చెప్పవచ్చు. ఈ రోజులో మీ ప్రతిపాదనలపై అవతలి వారు కూడా సానుకూలంగా స్పందించే వీలుంది. ఈ సమయంలో మీరు ఎల్లో, వైట్‌ రంగు దుస్తులు ధరిస్తే మంచిది. అలాగే, దక్షిణ ఆగ్నేయదిశగా బయలుదేరితే మంచిది. ఇక, శుక్ర, బుధవారాలు వీటికి దూరంగా ఉండండి.

మీనం: మీ మనస్సులోని అభిప్రాయాలను ఇష్టమైన వారికి తెలియజేసేందుకు మంగళ, బుధవారాలు అత్యంత అనుకూలం. ఈ రోజుల్లో మీ ప్రతిపాదనలను అవతలి వారు ఆమోదించే వీలుంది. ఈ సమయంలో మీరు పింక్, ఎల్లో రంగు దుస్తులు ధరిస్తే మంచిది. అలాగే, ఇంటి నుంచి తూర్పుదిశగా బయలుదేరితే శుభప్రదంగా ఉంటుంది. అయితే, శుక్ర, ఆదివారాలు వీటికి దూరంగా ఉండండి.

Videos

అండర్ గ్రౌండ్ లో అవినీతి తీగ

హైదరాబాద్ శిల్పకళావేదికలో మిస్ వరల్డ్ టాలెంట్ ఫైనల్

Watch Live: వైఎస్ జగన్ కీలక ప్రెస్ మీట్

వాషింగ్టన్ డీసీలో కాల్పుల కలకలం

దీన్నే నమ్ముకొని ఉన్నాం.. మా పొట్టలు కొట్టొద్దు.. ఎండీయూ ఆపరేటర్ల ధర్నా

నా పర్మీషన్ తీసుకోవాల్సిందే!

ఢిల్లీ-శ్రీనగర్ విమానానికి తప్పిన ప్రమాదం

ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు బండారం బయటపడుతుందనే ఉరవకొండకి రాలేదు

జనసేనపై పిఠాపురం టీడీపీ నేతలు సంచలన వ్యాఖ్యలు..

ఏందిరయ్యా ఏంజేతున్నావ్

Photos

+5

HHVM మూవీ ఈవెంట్‌లో మెరిసిన హీరోయిన్ నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

Cannes 2025 : ‘సింధూరం’తో మెరిసిన ఐశ్వర్య (ఫోటోలు)

+5

ప్రసాద్ ఐమ్యాక్స్‌ : ‘రానా నాయుడు సీజన్-2’ టీజర్‌ ఈవెంట్‌ రానా సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం..భారీగా ట్రాఫిక్ జామ్ (ఫొటోలు)

+5

హనుమాన్‌‌ జయంతి .. జనసంద్రంగా కొండగట్టు అంజన్న క్షేత్రం (ఫొటోలు)

+5

విజయ్‌ సేతుపతి 'ఏస్‌' మూవీ ప్రీరిలీజ్‌ వేడుక (ఫొటోలు)

+5

'హరి హర వీరమల్లు' సాంగ్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

కాన్స్‌లో అదితి : ఆరుగజాల చీర, సింధూరంతో ముగ్ధమనోహరంగా (ఫొటోలు)

+5

కుమారుడి టాలెంట్‌ చూసి మురిసిపోతున్నడైరెక్టర్‌ సుకుమార్ భార్య (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ ఫిలిం ఫెస్టివల్‌లో అనామిక ఖన్నా బ్యాక్‌లెస్ గౌనులో జాన్వీ కపూర్‌ (ఫోటోలు)