Breaking News

ప్రాచీన మానవ జాతి శిలాజం గుర్తింపు

Published on Fri, 05/29/2015 - 06:28

భూమిపై అంతరించిన అనేక మానవ జాతుల్లో ఇంకా చాలా వరకు గుర్తించాల్సి ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇథియోపియాలో పరిశోధకులు ఇటీవల ప్రాచీన  మానవ జాతి శిలాజాన్ని గుర్తించారు. 3.3-3.5 మిలియన్ల సంవత్సరాల కాలం నాటి మానవ శిలాజం ఇథియోపియాలోని అఫర్ ప్రాంతంలో లభించింది. నలుగురు వ్యక్తులకు చెందిన దవడ ఎముకల్ని, దంతాల్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇవి కోతి, మానవ ఆనవాళ్లు రెండింటినీ కలిగి ఉంది. దవడ చాలా బలంగా ఉండగా, దంతాలు చాలా చిన్నగా ఉన్నాయి.

ఈ శిలాజం కూడా హుమానియన్ మానవ జాతులు నివసించినప్పటి కాలం నాటివేనని శాస్త్రవేత్తలు అంటున్నారు. మానవ జాతుల గురించి కనుక్కోవడం ఇప్పటివరకు అనుకున్న దాని కంటే ఇంకా క్లిష్టమైనదని పరిశోధకులు అంటున్నారు. ఇది కూడా హుమానియన్ కాలానికి చెందిన మానవ జాతే అని, ఒక జాతి తర్వాత మరో జాతి జీవించి ఉండవచ్చని పరిశోధకులు అభిప్రాయపడ్డారు. ఇతర జాతులతో పోలిస్తే హుమానియన్ జాతి మానవులు అత్యంత శక్తిమంతమైన వారు. ఈ కొత్త జాతికి వీరు ఆస్ట్రాలోపిథెకస్ డెయిరెమెడా అనే పేరు పెట్టారు. అఫర్ ప్రాంతంలోని స్థానిక భాష మాట్లాడేవారికి దగ్గరివారని దీనర్థం.

Videos

2024-25 బాకీ ఉన్నారు.. ఇచ్చేయాలి ప్రజల తరుపున నిలదీస్తాం: Vanga Geetha

రచ్చబండకెక్కిన రాజేష్

రోజాపై గాలి భాను ప్రకాష్ వ్యాఖ్యలు వరుదు కళ్యాణి స్టాంగ్ కౌంటర్

జూరాల ప్రాజెక్టుకు పోటెత్తిన వరద..12 గేట్లు ఎత్తివేత

ఇండియాలోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన టెస్లా కార్లు

జగన్ ప్రశ్నలు.. నీళ్లు నములుతున్న బాబు

Pushpa Sreevani: రోజా కు క్షమాపణ చెప్పు.. లేదంటే

తెలంగాణలో నురగలు కక్కుతున్న కల్తీ కల్లు

స్కూళ్లకు బాంబు బెదిరింపులు

Nellore: బాబుకు చావుదెబ్బ YSRCPలోకి టీడీపీ కార్పొరేటర్

Photos

+5

ఆషాఢం : ‘నేను నా శివయ్య’ అంటున్న ఈ భక్తురాల్ని చూశారా?

+5

చందమామలా.. చీర సింగారించుకుని క్యూట్‌గా తెలుగు బ్యూటీ!

+5

ఆంధ్రా సరిహద్దులో.. ఉరకలేస్తున్న జలపాతాలు(చిత్రాలు)

+5

కుమారుడితో తొలిసారి తిరుమలలో హీరోయిన్ ప్రణీత (ఫొటోలు)

+5

'పరదా' సినిమా ప్రెస్ మీట్ (ఫొటోలు)

+5

రెడ్‌ శారీలో ‘జూనియర్‌’మూవీ ఈవెంట్‌లో మెరిసిన శ్రీలీల (ఫొటోలు)

+5

ఇండియన్ సూపర్ క్రాస్ రేసింగ్ లీగ్ సీజన్ 2 ట్రోఫీ ఆవిష్కరించిన సల్మాన్ ఖాన్ (ఫొటోలు)

+5

కరీంనగర్ లో సినీనటి అనుపమ పరమేశ్వరన్ సందడి (ఫొటోలు)

+5

‘జూనియర్‌’ మూవీ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

తప్పు సరిదిద్దుకో చంద్రబాబూ.. రేపు టైం మాది గుర్తుంచుకో (ఫొటోలు)