గారడీకాదు.. నిజం.. ముక్కులోంచి నోట్లోకి

Published on Mon, 12/14/2015 - 20:24

ఇస్లామాబాద్: గారడీ కాదు, కనికట్టు అంతకన్నా కాదు... సజీవంగా ఉన్న పామును ముక్కులోంచి పంపించి, నోటి ద్వారా బయటికి తీస్తున్న వైనం ఇపుడు సంచలనం సృష్టిస్తోంది. పాకిస్థాన్ కరాచీకి చెందిన ఇక్బాల్ చేస్తున్న ఈ సాహస ప్రదర్శన ఇపుడు నెటిజన్లను ఆకట్టుకుంటోంది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి నెట్లో హల్ చల్ చేస్తోంది.

పాములతో గారడీ చేయడం వాటిని ఒడుపుగా ఆడించడం మనకు తెలిసిందే. కానీ ఇక్బాల్ ప్రమాదకర ప్రదర్శన మాత్రం ఒళ్లు గగుర్పొడిచేలా ఉంది. ఓ పాము కాటు అతని జీవితాన్ని మార్చి వేసింది.  పాముకాటుతో మూడు రోజుల పాటు మృత్యువు పోరాడిన ఇక్బాల్ సర్పాలతోనే ఈ సాహసం చేస్తున్నాడు. నిరంతరం అపాయకరమైన విద్యను ప్రదర్శిస్తూ, తన వృత్తిగా మలుచుకున్నాడు. బతికున్న పామునే ముక్కులోంచి లోపలికి పంపించి తిరిగి నోటి ద్వారా బయటికి తీస్తున్నాడు.   
 
'భయంకరమైన విష సర్పం నన్ను కాటేసినప్పుడు వెంటనే స్పృహ కోల్పోయా... మూడు రోజుల పాటు మత్యువుతో పోరాడాను. ఆ సమయంలో మా టీచర్ నాకు ఈ విద్య నేర్పారు. అప్పటి నుంచి ఇలా కొత్త జీవితాన్ని ప్రారంభించాను' అంటూ చెప్పుకొచ్చాడు. ముగ్గురు కొడుకులు, అయిదుగురు ఆడపిల్లలు ఉన్న తన కుటుంబాన్ని పోషించుకునేందుకు గత 12 సంవత్సరాలుగా ఈ వృత్తి మీదనే ఆధారపడ్డానని చెప్పాడు. ఇది ప్రమాదకరం అని తెలిసినా.. తనకు వేరే గత్యంతరం లేదంటున్నాడు. ప్రతి ప్రదర్శనకు ముందు తను బతకాలని ఆ దేవుడ్ని కోరుకుంటానని, తన ప్రతిభను గుర్తించి ఆదుకోవాలని కోరుకుంటున్నాడు.

Videos

మా పెన్షన్లు అడ్డుకున్న చంద్రబాబు ఇక రాకూడదు

యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ లో భారీ చోరీ

ప్రజాస్వామ్యానికి తూట్లు.. దొంగ ఓట్లకు కుట్ర

కేసీఆర్ వెళ్తారా.. లేదా..?

కొనసాగుతున్న లోక్ సభ ఎన్నికల చివరి విడత పోలింగ్

పోస్టల్ బ్యాలెట్ పై నేడు కీలక తీర్పు

సీఎం జగన్ కి వైఎస్సార్సీపీ నేతల ఘన స్వాగతం

ప్రారంభమైన ఆఖరి విడత సార్వత్రిక ఎన్నికల పోలింగ్

ఏసీబీ కస్టడీలో ఏసీపీ

ఆనందం ఆవిరి..ఉదయం పోస్టింగ్..సాయంత్రం రిటైర్మెంట్..

Photos

+5

T20 WC 2007: ధోని నమ్మకం నిలబెట్టిన వరల్డ్‌కప్‌ విజేత.. ఇప్పుడేం చేస్తున్నారో తెలుసా? (ఫోటోలు)

+5

Kiccha Sudeep Daughter Sanvi: కిచ్చా సుదీప్‌ కూతురు ఇప్పుడెలా ఉందో చూశారా? (ఫోటోలు)

+5

Dimple Hayathi Visits Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టాలీవుడ్‌ హీరోయిన్‌ డింపుల్ హయాతి (ఫొటోలు)

+5

Allari Naresh-Virupa: తొమ్మిదవ పెళ్లి రోజు.. అల్లరి నరేశ్‌ భార్యను చూశారా? (ఫోటోలు)

+5

తిరుమలలో బిగ్‌బాస్‌ సందీప్‌ 10వ పెళ్లి రోజు సెలబ్రేషన్స్‌ (ఫోటోలు)

+5

భర్తతో కలిసి క్రొయేషియా ట్రిప్‌లో బిజీగా బ్యాడ్మింటన్‌ స్టార్‌.. స్టన్నింగ్‌ లుక్స్‌ (ఫొటోలు)

+5

టీ20 వరల్డ్‌కప్‌-2024: భర్త క్రికెట్‌తో.. భార్య యాంకరింగ్‌తో బిజీ.. క్యూట్‌ కపుల్‌(ఫొటోలు)

+5

పెళ్లికి ముందే ప్రెగ్నెంట్‌ అంటూ కామెంట్స్‌.. నా భర్త అడిగేవాడన్న హీరోయిన్!(ఫొటోలు)

+5

ఈ స్టన్నింగ్‌ బ్యూటీ.. టీమిండియా స్టార్‌ భార్య! గుర్తుపట్టారా? (ఫొటోలు)

+5

ఎమ్మెల్సీ కవితకు మరో బిగ్ షాక్..