ఫ్రీ బస్సుకు మంగళం ? డీకే శివకుమార్ సంచలన కామెంట్స్
Breaking News
రాణి విందుకు ఒబామా
Published on Tue, 04/19/2016 - 18:03
లండన్: పదవి కాలం ముగుస్తున్న వేళ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, ప్రథమ మహిళ మిషెల్లీ చరిత్రలో గుర్తుండిపోయే పర్యటనలు చేస్తున్నారు. మొన్నటికి మొన్న క్యూబా వెళ్లిన ఆ జంట ఇప్పుడు బ్రిటన్లో అడుగుపెడుతున్నారు. విండ్సర్ భవనంలో బ్రిటన్ రాణి ఇచ్చే గౌరవ విందును స్వీకరించనున్నారు. ఆ తర్వాత బ్రిటన్ యువరాజు విలియమ్, యువరాణి కేథరిన్లను కలవనున్నారు. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌజ్ ప్రకటించింది.
ఈ వారంలో బ్రిటన్ పర్యటనకు అధ్యక్షుడు ఒబామా, మిషెల్లీ వెళుతున్నారు. శుక్రవారం జరిగే ఆమె 90వ పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొంటారు. అనంతరం కెన్సింగ్టన్ ప్యాలెస్ లో రాజు, రాణిలను ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ నేపథ్యంలో ఈ ప్యాలెస్ అధికారులు ఒక ప్రకటన విడుదల చేస్తూ వారి రాక కోసం తాము ఎంతో ఎదురుచూస్తున్నామని తెలిపారు. వారు సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యేలా అతిథి సేవలు చేయాలనుకుంటున్నామని ప్రకటించారు.
Tags