Breaking News

ఆయనకు 800 మంది పిల్లలు

Published on Thu, 01/14/2016 - 23:41

లండన్: ప్రపంచంలోనే ఇలాంటి వీర్యదాత (స్పెర్మ్ డోనర్) మరొకరు ఉండరేమో! గత 16 ఏళ్లుగా వీర్యాన్ని దానం చేయడం ద్వారా ఇప్పటికే 800 మంది పిల్లలకుపైగా తండ్రయ్యారు. కనీసం వెయ్యి మంది పిల్లలకు తండ్రిని కావాలన్నది ఆయన లక్ష్యం. లక్ష్య సాధనలో ముందుకు సాగాలన్నా తాపత్రయంతో గత మూడేళ్లుగా ప్రణయ గీతాలు పాడుతున్న గర్ల్ ఫ్రెండ్‌ను కూడా ఇటీవలనే వదులుకున్నారు.
 ఆయనే 41 ఏళ్ల సైమన్ వాట్సన్. బెడ్‌ఫోర్డ్‌షైర్‌లోని లూటన్‌లో నివసిస్తున్నారు. ఆయనకు మొదటి పెళ్లి ద్వారా 17, 19 ఏళ్ల ఇద్దరు కొడుకులు ఉన్నారు. రెండో పెళ్లి ద్వారా పదేళ్ల కూతురు కూడా ఉంది. వీర్య విక్రయానికి అధిక ప్రాధాన్యతను ఇవ్వడం వల్ల మూడేళ్ల గర్ల్ ఫ్రెండ్‌కు కోపం వచ్చింది. ఇద్దరి మధ్య పొరపొచ్చాలు వచ్చాయి. ఏదేమైనా తన లక్ష్యాన్ని లేదా వ్యాపారాన్ని వదులుకోనన్నారు. అందుకని గర్ల్ ఫ్రెండ్‌నే వదిలేధారు. తన వీర్యం పిల్లలు పుట్టించే ‘మహత్తు గల పానం’ అని చెప్పుకుంటాడు.

 ఇంత వ్యాపారం చేస్తున్నా వాట్సన్ స్మెర్మ్ బ్యాంకులను ఆశ్రయించరు. సోషల్ వెబ్‌సైట్, ముఖ్యంగా ఫేస్‌బుక్ ద్వారా ప్రచారం చే సుకొని వీర్య స్వీకతులను వెతికి పట్టుకుంటారు. ఒక్క వీర్యం పాట్‌ను ఐదువేల రూపాయలకు అమ్ముతుంటారు. వీర్య దానం పట్ల ఇంత ప్యాషన్ ఉంటే ఉచితంగానే దానం చేయవచ్చుకదా! అని ప్రశ్నించిన ఆడవాళ్లు లేకపోలేదు. వారందరికి ఆయనిచ్చే సమాధానం ఒక్కటే. ఇప్పటికే చాలా చీప్‌గా అమ్ముతున్నానని అంటారు.  తన వీర్యం ద్వారా పురుడు పోసుకున్న పిల్లలను తనకు వీలు చిక్కినప్పుడల్లా చూసొస్తుండాట. తన పుణ్యమా అని పుట్టిన వారిలో కవలలు కూడా ఉన్నారట.
 

#

Tags : 1

Videos

మెడికల్ మాఫియా బాగోతం! ఫేక్ డాక్టర్ల మాయాజాలం

ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ Conflict 2025

Rain Alert: మరో నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు

KTR: నీ కేసులకు భయపడేది లేదు

రేషన్ డోర్ డెలివరీ రద్దుపై వైఎస్ జగన్ రియాక్షన్..

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్

Operation Trashi: టాప్ 6 ఉగ్రవాదులు హతం..

MLAని అని చెప్పుకోవాలంటే సిగ్గుగా ఉంది: Bandaru Satyanarayana

తమిళనాడు లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తుపై సుప్రీంకోర్టు స్టే

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకున్నాం : ప్రధాని మోదీ

Photos

+5

కొడుకు, చెల్లెలితో సానియా మీర్జా క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

Miss World 2025 : శిల్పారామంలో ఆడి పాడుతూ సందడి చేసిన గ్లోబల్‌ బ్యూటీలు (ఫొటోలు)

+5

లిక్కర్‌ స్కాం.. బాబు బేతాళ కథలు.. జగన్‌ ధ్వజం (చిత్రాలు)

+5

అనసూయ ఇంట మరో శుభకార్యం.. పెద్ద కుమారుడితో సంప్రదాయ వేడుక (ఫొటోలు)

+5

HHVM మూవీ ఈవెంట్‌లో మెరిసిన హీరోయిన్ నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

Cannes 2025 : ‘సింధూరం’తో మెరిసిన ఐశ్వర్య (ఫోటోలు)

+5

ప్రసాద్ ఐమ్యాక్స్‌ : ‘రానా నాయుడు సీజన్-2’ టీజర్‌ ఈవెంట్‌ రానా సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం..భారీగా ట్రాఫిక్ జామ్ (ఫొటోలు)

+5

హనుమాన్‌‌ జయంతి .. జనసంద్రంగా కొండగట్టు అంజన్న క్షేత్రం (ఫొటోలు)

+5

విజయ్‌ సేతుపతి 'ఏస్‌' మూవీ ప్రీరిలీజ్‌ వేడుక (ఫొటోలు)