amp pages | Sakshi

హరికేన్‌ ‘ఇర్మా’ బీభత్సం

Published on Fri, 09/08/2017 - 01:02

► కరీబియన్‌ దీవుల్లో కనీవినీ ఎరుగని విధ్వంసం
► ఆరుగురి మృతి, నేలమట్టమైన వేలాది ఇళ్లు


సాన్‌ జువాన్, మయామి: కరీబియన్‌ దీవుల్లో హరికేన్‌ ఇర్మా కనీవిని ఎరుగని విధ్వంసం సృష్టించింది. ఇర్మా ధాటికి ఇంతవరకూ ఆరుగురు మరణించగా, వేలాది ఇళ్లు నేలమట్టమవడంతో లక్షల మంది నిరాశ్రయులయ్యారు. అట్లాంటిక్‌ మహాసముద్రంలో ఏర్పడ్డ హరికేన్లలోకెల్లా అత్యంత శక్తిమంతమైన ఈ తుపాను గత రెండు రోజులుగా కరీబియన్‌ దీవుల్ని అతలాకుతలం చేసి అమెరికాలోని ఫ్లోరిడా తీరం వైపు దూసుకెళ్తోంది. డొమినికన్‌ రిపబ్లిక్, హైతీలను అతలాకుతలం చేసిన హరికేన్‌ క్యూబా, బహమాస్‌ మీదుగా ఆదివారం ఫ్లోరిడా తీరాన్ని తాకవచ్చని, విధ్వంసం ఊహించని స్థాయిలో ఉంటుందని అమెరికా వాతావరణ శాఖ తేల్చింది.

గంటకు 298 కి.మీ. వేగంతో వీచిన పెనుగాలులకు కరీబియన్‌ దీవులైన సెయింట్‌–మార్టిన్, సెయింట్‌–బార్తెలెమి, బార్బుడా, అంగ్విల్లా, వర్జిన్‌ ఐలాండ్స్, ప్యూర్టోరికోలు కోలుకోలేనంతగా దెబ్బతిన్నాయి. సెయింట్‌ మార్టిన్‌లో నలుగురు, అగ్విల్లా, బార్బుడాల్లో ఒక్కొక్కరు చనిపోయారు. ఫ్రాన్స్‌ దీవులైన సెయింట్‌–మార్టిన్, సెయింట్‌–బార్తెలెమిలో ఊహించనంత నష్టం జరిగిందని ఫ్రెంచ్‌ అంతర్గత వ్యవహారాల మంత్రి చెప్పారు.  సెయింట్‌ మార్టిన్‌ 95% దెబ్బతింద ని స్థానిక అధికారి చెప్పారు. బ్రిటిష్‌ దీవులు అంగ్విల్లా, వర్జిన్‌ ఐలాండ్స్‌లో భారీ విధ్వంసం చోటుచేసుకుందని బ్రిటన్‌ విదేశాంగ శాఖ మంత్రి అలాన్‌ డంకన్‌ చెప్పారు.  

ప్యూర్టోరికోలో దారుణ పరిస్థితి  
అమెరికా అధీనంలోని స్వతంత్ర దేశం ప్యూర్టోరికోపై ఇర్మా పెను ప్రభావం చూపింది. దాదాపు 10 లక్షల మంది ప్రజలు చీకట్లో మగ్గుతున్నారు. 50 వేల మందికి తాగునీటి సరఫరా నిలిచిపోయిందని అత్యవసర సహాయ విభాగం తెలిపింది. డొమినికన్‌ రిపబ్లిక్, హైతీల్ని వణికిస్తున్న ఇర్మా.. క్యూబా, బహమాస్‌ మీదుగా ఫ్లోరిడా తీరం వైపు కదులుతోంది. పెను విధ్వంసం వల్ల  సహాయక బృందాలు కరీబియన్‌ దీవులకు చేరడం కష్టంగా మారింది. బార్బుడా దీవిలో దాదాపు 60 శాతం మంది నిరాశ్రయులయ్యారని అంటిగ్వా, బార్బుడా ప్రధాని గాస్టన్‌ బ్రౌన్‌ వెల్లడించారు.   

వణికిస్తున్న మరో రెండు హరికేన్లు
అట్లాంటిక్‌ సముద్రంలో మరో రెండు హరికేన్లు బలపడ్డాయి. హరికేన్‌ జోస్‌ గంటకు 207 కి.మీ వేగంతో ఇర్మా దారిలోనే ప్రయాణించవచ్చని అంచనావేస్తున్నారు. హరికేన్‌ కతియా మెక్సికో వైపు దూసుకుపోతోంది.   

285 కి.మీ. వేగంతో గాలులు
గురువారం ఉదయానికి ఇర్మా కొద్దిగా బలహీనపడినా కేటగిరీ 5 స్థాయిలోనే కొనసాగుతోందని గంటకు 285 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీస్తున్నాయని అమెరికా జాతీయ హరికేన్‌ సెంటర్‌ తెలిపింది. ఫ్లోరిడా రాష్ట్ర గవర్నర్‌ అత్యవసర పరిస్థితి విధించారు. సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని స్థానికులకు సూచించారు. ఫ్లోరిడా తీర ప్రాంతంలో ఇర్మా ధాటికి తీవ్ర నష్టం వాటిల్లవచ్చని, ఫ్లోరిడాతో పాటు జార్జియా, దక్షిణ కరోలినా రాష్ట్రాల్లో భారీ విధ్వంసం జరగవచ్చని ఆందోళన చెందుతున్నారు. అయితే ఇర్మా ఫ్లోరిడాలోని ఏ ప్రాంతంలో తీరాన్ని తాకవచ్చో అనేది అంచనా వేయలేకపోతున్నారు. అమెరికా చరిత్రలోనే అత్యంత నష్టాన్ని మిగిల్చే తుపానుగా మిగిలిపోవచ్చని యూనివర్సిటీ ఆఫ్‌ మయామికి చెందిన హరికేన్‌ పరిశోధకుడు బ్రియాన్‌ మెక్‌ నోల్డీ చెప్పారు.

Videos

బెంగుళూరు రేవ్ పార్టీ... టీడీపీ,సోమిరెడ్డికి ఇచ్చిపడేసిన కాకాణి

తప్పుడు ఆరోపణలపై యాంకర్ శ్యామల పరువు నష్టం దావా

TG క్రేజ్ ..రవాణా శాఖకు ఒకే రోజు 40 లక్షల ఆదాయం

కాంగ్రెస్ పై హరీష్ రావు ఫైర్

వంగా గీతకు చేతులెత్తి మొక్కిన యాంకర్ శ్యామల

రేవ్ పార్టీలో యాంకర్ శ్యామల? వంగా గీత రియాక్షన్

ఎల్లో మీడియాపై యాంకర్ శ్యామల పరువు నష్టం దావా

ఈ ఫోటోలో వ్యక్తి కనబడుట లేదు: జోగి రమేష్

ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ భద్రతా చర్యలపై చర్చ

అడ్డదిడ్డంగా మాట్లాడుతున్న ప్రశాంత్ కిషోర్ ? పీకే నోట బాబు పలుకులు

Photos

+5

Tirupati Gangamma Jatara 2024: తిరుపతిలో ఘనంగా తాతయ్యగుంట గంగమ్మ జాతర (ఫొటోలు)

+5

SRH: అతడి లాగే నన్నూ ఆశీర్వదించండి: అభిషేక్‌ తల్లికి అర్ష్‌దీప్‌ రిక్వెస్ట్‌ (ఫొటోలు)

+5

రజనీకాంత్‌ మనవడి బర్త్‌డే సెలబ్రేషన్స్‌.. క్రికెట్‌ థీమ్‌తో.. (ఫోటోలు)

+5

Hakim Shajahan Marriage: హీరోయిన్‌ను పెళ్లాడిన మలయాళ హీరో.. ఎంతో సింపుల్‌గా! (ఫోటోలు)

+5

Indraja Sankar Birthday Photos: విజిల్‌ నటి బర్త్‌డే సెలబ్రేషన్స్‌.. పెళ్లి తర్వాత భర్తతో తొలిసారి (ఫోటోలు)

+5

SRH Vs PBKS Highlights Photos: సన్ రైజర్స్ vs పంజాబ్..తారలతో నిండిన ఉప్పల్ స్టేడియం (ఫోటోలు)

+5

Shobha Shetty: కొత్తింటి కల సాకారం చేసుకున్న బిగ్‌బాస్‌ బ్యూటీ.. ప్రియుడితో గృహప్రవేశం (ఫోటోలు)

+5

నటుడు చందు కన్నుమూత.. వైరలవుతున్న పెళ్లి ఫోటోలు

+5

Afghanistan Floods: అఫ్ఘాన్‌ కొట్టుకుపోయింది.. మిగిలింది శూన్యమే (ఫొటోలు)

+5

ఏపీలో గెలిచేదెవరు? జడ్జ్‌మెంట్‌ డే 4th June (ఫొటోలు)