పాక్‌పై మరోసారి అమెరికా ఆగ్రహం

Published on Sat, 12/23/2017 - 01:58

వాషింగ్టన్‌ / ఇస్లామాబాద్‌ / ఐరాస: లష్కరే తోయిబా వంటి ఉగ్రసంస్థలకు స్వర్గధామంగా మారిన పాక్‌పై అమెరికా మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉగ్రమూకలకు సాయం చేయడం ఆపకపోతే పాక్‌ చాలా కోల్పోవాల్సి వస్తుందంటూ అమెరికా ఉపాధ్యక్షుడు మైక్‌ పెన్స్‌ హెచ్చరించారు. ఉగ్రస్థావరాలపై పాక్‌  వైఖరిని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ గమనిస్తున్నారని వ్యాఖ్యానించారు. క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితుల్ని తెలుసుకునేందుకు అకస్మిక పర్యటనలో భాగంగా పెన్స్‌ గురువారం అఫ్గానిస్తాన్‌ చేరుకున్నారు.

అఫ్గాన్‌ అధ్యక్షుడు ఘనీ, ప్రధాని అబ్దుల్లాలతో సమావేశమయ్యారు. తర్వాత బగ్రామ్‌ ఎయిర్‌బేస్‌లో అమెరికా సైనికులతో మాట్లాడారు.‘అధ్యక్షుడు ట్రంప్‌ చెప్పిందే నేనూ చెబుతున్నా. అమెరికాతో భాగస్వామ్యం వల్ల పాక్‌  చాలా లబ్ధి పొందు తోంది. ఉగ్రవాదులు, నేరస్తులకు ఆశ్రయమివ్వడం వల్ల పాక్‌ చాలా కోల్పోవాల్సి వస్తుంది’ అని హెచ్చరించారు. ఉగ్రవాదులు ఎక్కడ దాక్కున్నా వారిని వెతికి హతమార్చేందుకు అమెరికన్‌ బలగాలకు ట్రంప్‌ పూర్తిస్వేచ్ఛ ఇచ్చినట్లు పెన్స్‌ వెల్లడించారు. మరోవైపు పెన్స్‌ వ్యాఖ్యల్ని పాక్‌ ఖండించింది.

Videos

తిరుమలలో వైఎస్ఆర్ సీపీ నేతలు

కొందరు చిల్లర రాజకీయాల కోసం తెలంగాణ ఉద్యమాన్ని వాడుకున్నారు

ఏపీ ఎగ్జిట్ పోల్స్ పై మల్లాది విష్ణు రియాక్షన్

ఏపీ ఎగ్జిట్ పోల్స్ పై ఆర్కే రోజా రియాక్షన్

దేశవ్యాప్తంగా పెరిగిన టోల్ చార్జీలు..

తెలంగాణ భవన్ లో ఘనంగా రాష్ట్ర అవతరణ వేడుకలు

బాహుబలి వర్సెస్ బుజ్జి

హిమాలయాల్లో రజినీకాంత్..

తెలంగాణ ఆత్మగౌరవానికి పదేళ్ల పట్టాభిషేకం

భారీ ఎత్తున సెట్ నిర్మాణం.. సెట్ లో సినిమా మొత్తం..?

Photos

+5

తెలంగాణ రాష్ట్ర గీతం పాడిన సింగర్‌ హారిక నారాయణ్‌ (ఫోటోలు)

+5

సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు (ఫొటోలు)

+5

త్వరలో పెళ్లి.. వెకేషన్‌లో చిల్‌ అవుతున్న సిద్దార్థ్‌- అదితి (ఫోటోలు)

+5

T20WC2024 USA vs Canada Highlights: కెనడా జట్టుపై అమెరికా సంచలన విజయం (ఫొటోలు)

+5

రెండేళ్లలో ఎన్నో ఎత్తుపళ్లాలు చూశాం.. ఇక ముందు: దీపక్‌ చహర్‌ భావోద్వేగం (ఫొటోలు)

+5

T20 WC 2007: ధోని నమ్మకం నిలబెట్టిన వరల్డ్‌కప్‌ విజేత.. ఇప్పుడేం చేస్తున్నారో తెలుసా? (ఫోటోలు)

+5

Kiccha Sudeep Daughter Sanvi: కిచ్చా సుదీప్‌ కూతురు ఇప్పుడెలా ఉందో చూశారా? (ఫోటోలు)

+5

Dimple Hayathi Visits Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టాలీవుడ్‌ హీరోయిన్‌ డింపుల్ హయాతి (ఫొటోలు)

+5

Allari Naresh-Virupa: తొమ్మిదవ పెళ్లి రోజు.. అల్లరి నరేశ్‌ భార్యను చూశారా? (ఫోటోలు)

+5

తిరుమలలో బిగ్‌బాస్‌ సందీప్‌ 10వ పెళ్లి రోజు సెలబ్రేషన్స్‌ (ఫోటోలు)