amp pages | Sakshi

పులులు ఏం చేస్తాయో చూద్దామని...

Published on Mon, 12/21/2015 - 16:32

అలవికాని చోట అధికులమనరాదు అన్న సామెత.. ఆవ్యక్తికి తెలుసో లేదో కాని... ఏకంగా పులులతోనే పెట్టుకునేందుకు చూశాడు. తన జిమ్నాస్టిక్ విన్యాసాలను అక్కడ ప్రదర్శించేందుకు ప్రయత్నించాడు. జూ సందర్శించేందుకు వెళ్ళిన పర్యాటకుల్లోని ఓ కుర్రాడు... అప్పటిదాకా కేబుల్ కార్ లో కూచుని శ్రద్ధగానే తిలకించాడు. తీరా పులులకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఎన్ క్లోజర్ పైకి వచ్చేప్పటికి ఎక్కడలేని ఉత్సాహం వచ్చినట్టుంది. తన ప్రతిభను ప్రదర్శిద్దామని ప్రయత్నించాడు. ఉన్నట్టుండి పులులు ఉండే ఎన్ క్లోజర్ నెట్ పైకి దూకేశాడు. ఇంతకూ బతికాడా లేదా అన్నదేగా మీ సందేహం...?

చైనా జంతు ప్రదర్శన శాలలో పులలకు ప్రత్యేక ఎన్ క్లోజర్ ఉంది. సాధారణంగా ఏ జూలో అయినా అలాగే ఉంటుంది. వన్యప్రాణులను తిలకించాలనుకున్నవారిని ప్రత్యేకంగా పకడ్బందీగా ఉన్న వాహనాల్లో లోపలికి పంపుతుంటారు. అయితే చైనాలో తుంటరిగాళ్ళను నమ్మకూడదనుకున్నారో ఏమో జూ సిబ్బంది... సందర్శకులకు కనిపించే విధంగా.. ఎన్ క్లోజర్ పైభాగాన్ని కూడ వలతో  పూర్తిగా కప్పేశారు.  పులులను చూడాలనుకునేవారు కేబుల్ కార్ ద్వారా (రోప్ వే) వెళ్ళాల్సిందే. ఈ నేపథ్యంలో రోప్ వే ఛైర్ లో నుంచి చూస్తున్నట్టుగా చూస్తూ ఆ కుర్రాడు... ఉన్నట్లుండి వలపైకి దూకేశాడు.

జరిగిన సంఘటనకు తోటి పర్యాటకులు షాకైపోయారు. వెంటనే తేరుకుని పెద్దగా కేకలు వేయడం ప్రారంభించారు. ఈ గందరగోళం గమనించిన పులులు...ఆకతాయిని నోటికి కరచుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేశాయి. ఆ కుర్రాడి అదృష్టం కలసి రావడంతో జూ సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు.  వలపై పడిన వ్యక్తిని సురక్షితంగా బయటకు తీశారు. ప్రాణాలు ఉగ్గబట్టుకుని ఎదురు చూసిన పర్యాటకులంతా ఊపిరి పీల్చుకున్నారు. ఆ వ్యక్తిని పబ్లిక్ న్యూసెన్స్ గా  పోలీసులు అరెస్టు చేశారు. ఇంతా చేస్తే. ఇదంతా థ్రిల్ కోసం చేశానని అతడు చెప్పడం విశేషం.

పులుల ఎన్ క్లోజర్ లో వ్యక్తులు పడటం ఇది మొదటిసారి కాదు. ఇండియాలోని గ్వాలియర్ జూ లో 2014 లో ఓ విద్యార్థి 20 అడుగుల గోడ ఎక్కి మరీ పులులను చూసేందుకు ప్రయత్నించి ఎన్ క్లోజర్ లో పడ్డాడు. షర్టు విప్పేసి డ్యాన్స్ చేస్తూ పెన్ లో నానా హంగామా చేశాడు. పులుల మూడ్ ఎలా ఉందో ఏమో జూ సిబ్బంది వచ్చే వరకూ అవి పట్టించుకోపోవడంతో బతికిపోయాడు. అదే సంవత్సరంలో ఢిల్లీ జూలో రెండు తెల్ల పులులున్న ఎన్ క్లోజర్ లో పడ్డ విద్యార్థి... వాటి నోటికి చిక్కి ప్రాణాలు కోల్పోయాడు. అవును... ఓ సినిమాలో  హీరోగారన్నట్లు.. సింహం పడుకుంటే జూలుతో జడేయాలనుకోవడం, పులితో ఫొటో తీయించుకోవాలనుకోవడం మంచిది కాదు మరి...

Videos

బెంగుళూరు రేవ్ పార్టీ... టీడీపీ,సోమిరెడ్డికి ఇచ్చిపడేసిన కాకాణి

తప్పుడు ఆరోపణలపై యాంకర్ శ్యామల పరువు నష్టం దావా

TG క్రేజ్ ..రవాణా శాఖకు ఒకే రోజు 40 లక్షల ఆదాయం

కాంగ్రెస్ పై హరీష్ రావు ఫైర్

వంగా గీతకు చేతులెత్తి మొక్కిన యాంకర్ శ్యామల

రేవ్ పార్టీలో యాంకర్ శ్యామల? వంగా గీత రియాక్షన్

ఎల్లో మీడియాపై యాంకర్ శ్యామల పరువు నష్టం దావా

ఈ ఫోటోలో వ్యక్తి కనబడుట లేదు: జోగి రమేష్

ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ భద్రతా చర్యలపై చర్చ

అడ్డదిడ్డంగా మాట్లాడుతున్న ప్రశాంత్ కిషోర్ ? పీకే నోట బాబు పలుకులు

Photos

+5

ఓ వైపు టెన్షన్.. మరోవైపు ఉత్సాహం: స్టేడియంలో తళుక్కుమన్న షారుఖ్ (ఫొటోలు)

+5

Tirupati Gangamma Jatara 2024: తిరుపతిలో ఘనంగా తాతయ్యగుంట గంగమ్మ జాతర (ఫొటోలు)

+5

SRH: అతడి లాగే నన్నూ ఆశీర్వదించండి: అభిషేక్‌ తల్లికి అర్ష్‌దీప్‌ రిక్వెస్ట్‌ (ఫొటోలు)

+5

రజనీకాంత్‌ మనవడి బర్త్‌డే సెలబ్రేషన్స్‌.. క్రికెట్‌ థీమ్‌తో.. (ఫోటోలు)

+5

Hakim Shajahan Marriage: హీరోయిన్‌ను పెళ్లాడిన మలయాళ హీరో.. ఎంతో సింపుల్‌గా! (ఫోటోలు)

+5

Indraja Sankar Birthday Photos: విజిల్‌ నటి బర్త్‌డే సెలబ్రేషన్స్‌.. పెళ్లి తర్వాత భర్తతో తొలిసారి (ఫోటోలు)

+5

SRH Vs PBKS Highlights Photos: సన్ రైజర్స్ vs పంజాబ్..తారలతో నిండిన ఉప్పల్ స్టేడియం (ఫోటోలు)

+5

Shobha Shetty: కొత్తింటి కల సాకారం చేసుకున్న బిగ్‌బాస్‌ బ్యూటీ.. ప్రియుడితో గృహప్రవేశం (ఫోటోలు)

+5

నటుడు చందు కన్నుమూత.. వైరలవుతున్న పెళ్లి ఫోటోలు

+5

Afghanistan Floods: అఫ్ఘాన్‌ కొట్టుకుపోయింది.. మిగిలింది శూన్యమే (ఫొటోలు)