గ్యాస్ తాగుతూ బతుకుతున్న ఓ వింత మనిషి
Breaking News
సాయిరెడ్డి నైతిక విలువలకు కట్టుబడ్డారు: వైఎస్ జగన్
Published on Thu, 05/26/2016 - 11:00
హైదరాబాద్ : రాజకీయాలు అంటే ప్రజా జీవితానికి సంబంధించినవని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. వైఎస్ఆర్ సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన పార్టీ నేతలతో సమావేశం అయ్యారు. సుదీర్ఘ సమావేశం అనంతరం వైఎస్ జగన్ ... రాజ్యసభ అభ్యర్థిగా పార్టీ ప్రధాన కార్యదర్శి విజయ సాయిరెడ్డి పేరును ప్రకటించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ మనుషుల మధ్య సంబంధాలను డబ్బుతో కొనాలని చంద్రబాబు యత్నిస్తున్నారన్నారు. చంద్రబాబు ఇవాళ చేస్తున్న రాజకీయాలు దుర్మార్గమైనవని ఆయన మండిపడ్డారు. ఎమ్మెల్యేలను కొంటున్న చంద్రబాబు అదే ఎమ్మెల్యేలను నట్టేట ముంచుతున్నారని విమర్శించారు.
ఒక్క మాట కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టుకొచ్చిందని వైఎస్ జగన్ అన్నారు. పార్టీ ఎలాంటి సందర్భాల్లో పుట్టుకొచ్చిందో అందరికీ తెలుసన్నారు. సాయిరెడ్డి విలువలకు కట్టుబడ్డారని, అక్రమ కేసుల్లో తనకు వ్యతిరేకంగా చెప్పమని ఆయనపై ఒత్తిడి తెచ్చారని వైఎస్ జగన్ అన్నారు. కానీ సాయిరెడ్డి సత్యాన్ని నమ్ముకున్నారని, వాస్తవాలనే చెప్తానని స్పష్టం చేశారన్నారు. అందుకే తనపై కేసుల సందర్భంగా ఆయనను కూడా నిందితుడిగా చేర్చారని వైఎస్ జగన్ పేర్కొన్నారు. ఎన్ని ఒత్తిడులు ఎదురైనా సాయిరెడ్డి నైతిక విలువలకు కట్టుబడి, అండగా ఉన్నారన్నారు. విశ్వసనీయులకు సరైన స్థానం కల్పిస్తామనే సంకేతం పంపడానికే ఆయన అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదించినట్లు వైఎస్ జగన్ తెలిపారు.
Tags : 1