కొత్తగా రెండు భారీ రైలు టెర్మినళ్లు

Published on Fri, 11/21/2014 - 01:21

ఇరుకుగా ఉన్న  సికింద్రాబాద్ స్టేషన్‌కు ప్రత్యామ్నాయంగా..
మౌలాలి, వట్టినాగులపల్లి స్టేషన్లలో నిర్మాణం

 
సాక్షి, హైదరాబాద్:
అటు ఉత్తరాదికి, ఇటు దక్షిణాదికి కీలకంగా మారిన సికింద్రాబాద్ స్టేషన్ ఇరుకుఇరుకుగా మారడం. రైళ్లరద్దీ, ప్రయాణికుల రద్దీ పెరిగిపోవడంతో ప్రత్యామ్నాయంగా రాష్ట్రరాజధానిలో మరో రెండు భారీ టెర్మినళ్లు నిర్మించేందుకు దక్షిణమధ్య రైల్వే సిద్ధమవుతోంది. వచ్చే బడ్జెట్‌లో స్థానం కల్పించాలని కోరుతూ  రైల్వేబోర్డుకు ప్రతిపాదనలను పంపింది. దాదాపు రూ.120 కోట్ల ఖర్చయ్యే ఈ పనులకు డీపీఆర్‌లను సిద్ధం చేస్తోంది. సికింద్రాబాద్ స్టేషన్ మీదుగా నిత్యం దాదాపు 210 వరకు రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి.

కానీ ఈ స్టేషన్‌లో 10 ప్లాట్‌ఫామ్స్ మాత్రమే ఉన్నాయి. నగరంలో కీలకంగా మారిన ఎంఎంటీఎస్ రైళ్లకు కూడా ఇవే శరణ్యం. దీంతో ప్లాట్‌ఫామ్స్ దొరికేవరకు పలు రైళ్లను మౌలాలి సహా ఇతర శివారు స్టేషన్‌లలో నిలిపివేస్తున్నారు. కొన్నింటినైతే సుమారు 40 నిమిషాలవరకు ఆపేస్తున్నారు. అందుకే కొత్త టెర్మినళ్లను నిర్మించాలని నిర్ణయించారు. అవి పూర్తయితే ముఖ్యమైన రైళ్లను మాత్రమే సికింద్రాబాద్ వరకు రప్పిస్తారు. మిగతావాటిని కొత్తస్టేషన్లలోనే నిలిపేస్తారు. దీంతో సికింద్రాబాద్‌పై భారం తగ్గుతుందని భావిస్తున్నారు.  

ఎంఎంటీఎస్ స్టేషన్‌లలో సీసీటీవీలు...
భద్రతదృష్ట్యా నగరంలోని అన్ని ఎంఎంటీఎస్ స్టేషన్‌లలో కేంద్రీకృత పర్యవేక్షణ వ్యవస్థతోకూడిన సీసీకెమెరాలను ఏర్పాటు చేయాలని దక్షిణమధ్య రైల్వే నిర్ణయించింది. ముఖ్యంగా మహిళా ప్రయాణికుల భద్రత కోసం ఈమేరకు నిర్ణయించారు.  అన్ని లెవల్ క్రాసింగ్స్ వద్ద గేట్లు ఏర్పాటు చేయాలని   పేర్కొన్నారు.

ప్రాధాన్యక్రమంలో పనులు : జీఎం శ్రీవాస్తవ
గతంలో మంజూరైన పనులు కూడా చాలావరకు పెం డింగ్‌లో ఉన్నందున ముఖ్యమైన వాటిని ప్రాధాన్యక్రమంలో పూర్తి చేయాలని నిర్ణయించినట్టు దక్షిణ మధ్య రైల్వే జీఎం శ్రీవాస్తవ చెప్పారు. గురువారం ఆయన ప్రధాన విభాగాల అధికారులతో సమావేశమయ్యా రు. రూ.5490 కోట్లతో వివిధ దశల్లో ఉన్న 637 పను పెండింగ్ పనులు, ప్రతిపాదనలను సమీక్షించారు.

Videos

దేశంలోనే ఎక్కడాలేని విధంగా..ఏపీలోనే

మందేసి హీరోయిన్ అంజలిని స్టేజ్ పై తోసేసిన బాలకృష్ణ

బిగ్ క్వశ్చన్: ఏపీ ఎన్నికల ముఖచిత్రం..మళ్లీ అదే స్పీడు

తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలు

మహిళల అశ్లీల వీడియోలు సీక్రెట్ గా రికార్డ్...

ఎమ్మెల్సీ కవిత బెయిల్.. తీర్పు రిజర్వ్

తెలంగాణ అధికారిక చిహ్నంలో కాకతీయ తోరణం ఉండదు..

ప్రజా భవన్ కు బాంబు బెదిరింపు

ఈసీకి చంద్రబాబు వైరస్

విభజనకు పదేళు ఏపీకి ఎవరేం చేశారు ?

Photos

+5

హీరోయిన్‌ మూడో పెళ్లి.. తెలుగులోనూ నటించింది (ఫోటోలు)

+5

11 ఏళ్ల క్రితం విడిపోయిన స్టార్‌ కపుల్‌.. కుమారుడి కోసం (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టాలీవుడ్‌ హీరో ఆశిష్‌ (ఫొటోలు)

+5

ఎలక్షన్ కమిషన్ నిబంధనలపై పేర్ని నాని రియాక్షన్

+5

Anasuya Sengupta: 'కేన్స్‌'లో చరిత్ర సృష్టించిన భారతీయ నటి (ఫోటోలు)

+5

నేను బతికే ఉన్నా.. ఫోటోలతో క్లారిటీ ఇచ్చిన హీరోయిన్‌ (ఫొటోలు)

+5

హార్దిక్‌ పాండ్యాతో విడాకులంటూ వదంతులు.. ట్రెండింగ్‌లో నటాషా(ఫొటోలు)

+5

Kavya Maran: అవధుల్లేని ఆనందం.. యెస్‌.. ఫైనల్లో సన్‌రైజర్స్‌ (ఫొటోలు)

+5

సీరియల్‌ నటి ఇంట సంబరాలు.. మళ్లీ మహాలక్ష్మి పుట్టింది! (ఫోటోలు)

+5

సచిన్ టెండూల్కర్‌‌‌‌‌‌‌‌ని కలిసిన బాక్సింగ్ క్వీన్‌‌‌‌ (ఫొటోలు)