'వాళ్లపై కేసులు పెడితే జైళ్లు చాలవు'

Published on Mon, 03/21/2016 - 22:42

సాక్షి, హైదరాబాద్: 'ఇందిరమ్మ ఇళ్ల పథకంలో అక్రమాలకుగాను 250 మంది అధికారులు సస్పెండ్ అయ్యారు..ఇది ఎవరి పాపం..ప్రజాప్రతినిధులపై కేసులు పెట్టితే జైళ్లు సరిపోవు' అని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వ్యాఖ్యానించారు. సర్పంచ్‌లు, ఎంపీటీసీలు నేరుగా భాగస్వాములయ్యారు..ఇండ్లు కట్టకముందే బిల్లులు తీసుకున్నారని మంత్రి పేర్కొన్నారు. బడ్జెట్ పద్దులపై చర్చ సందర్భంగా సోమవారం శాసనసభలో విపక్ష సభ్యుల ప్రశ్నలకు మంత్రి బదులిచ్చారు. లక్షా 70 వేల ఇందిరమ్మ ఇళ్లను సీబీసీఐడీ పరిశీలిస్తే లక్షా 20 వేల ఇళ్లు కట్టినవేనని తేలిందన్నారు. వీటికి సంబంధించి రూ.273..13 కోట్ల పెండింగ్ బిల్లులను చెల్లించామని, మిగిలిన బకాయిలను సైతం చెల్లిస్తామన్నారు.

సీబీసీఐడీ నివేదిక వచ్చిన తర్వాత మిగిలిన ఇళ్లకు చెల్లిస్తామన్నారు. బడ్జెట్లో నిధులు కేటాయించలేదని డబుల్ బడ్రూం ఇళ్ల పథకంపై అనుమానాలు అవసరం లేదన్నారు. రూ.1735 కోట్ల హడ్కో రుణంతో 2016-17లో 2లక్షల ఇళ్లను నిర్మిస్తామన్నారు. ఇప్పటికే టెండర్లను పిలిచామని, అన్ని జిల్లాల్లో పనులు ప్రారంభిస్తామన్నారు. డబుల్ బడ్రూం ఇళ్ల లబ్ధిదారుల నుంచి మీ-సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తులు స్వీకరించాలని నిర్ణయించామన్నారు. హైదరాబాద్ నగరంలో 1.51లక్షల ఇళ్లకు సరిపడ స్థలాలు సిద్ధంగా ఉన్నాయన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 382 ఎకరాలు, జీహెచ్‌ఎంసీ వెలుపల 299 ఎకరాలను గుర్తించామన్నారు. కాగా..ప్రజాప్రతినిధులపై కేసులు పెట్టితే జైళ్లు సరిపోవు అని మంత్రి చేసిన వ్యాఖ్యాలను కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరాలను తెలిపింది.

Videos

రాజసింగ్‌కు బెదిరింపు కాల్స్

12 లక్షల విలువైన వజ్రాలు ఈ నెలలో 20 లభ్యం

ప్రగతి భవన్ కు బాంబు బెదిరింపు నిందితుడు అరెస్ట్

తప్పుడు పనుల కోసమే బీజేపీతో టీడీపీ పొత్తు

పిల్లలను కొన్న వారి పై కేసులు బయటపడ్డ ముఠా ఆడియో

అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ తిరస్కరించిన సుప్రీం

1200 వందల ప్రముఖుల ఫోన్లు ట్యాప్ నిజాలు ఒప్పుకున్నా ప్రణీత్ రావు

మళ్లీ జగనే.. నో డౌట్

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పై కేంద్ర ఈసీకి ఫిర్యాదు చేసిన YSRCP నేతలు

పాపం పసివాళ్లు

Photos

+5

పెళ్లికి ముందే ప్రెగ్నెంట్‌ అంటూ కామెంట్స్‌.. నా భర్త అడిగేవాడన్న హీరోయిన్!(ఫొటోలు)

+5

ఈ స్టన్నింగ్‌ బ్యూటీ.. టీమిండియా స్టార్‌ భార్య! గుర్తుపట్టారా? (ఫొటోలు)

+5

ఎమ్మెల్సీ కవితకు మరో బిగ్ షాక్..

+5

టీ20 వరల్డ్‌కప్‌-2024కు ముందు భార్య అనుష్కతో కోహ్లి చక్కర్లు.. ఫొటోలు వైరల్‌

+5

హీరోయిన్‌ మూడో పెళ్లి.. తెలుగులోనూ నటించింది (ఫోటోలు)

+5

11 ఏళ్ల క్రితం విడిపోయిన స్టార్‌ కపుల్‌.. కుమారుడి కోసం (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టాలీవుడ్‌ హీరో ఆశిష్‌ (ఫొటోలు)

+5

ఎలక్షన్ కమిషన్ నిబంధనలపై పేర్ని నాని రియాక్షన్

+5

Anasuya Sengupta: 'కేన్స్‌'లో చరిత్ర సృష్టించిన భారతీయ నటి (ఫోటోలు)

+5

నేను బతికే ఉన్నా.. ఫోటోలతో క్లారిటీ ఇచ్చిన హీరోయిన్‌ (ఫొటోలు)