నయీం కేసులో మరో కీలక మలుపు

Published on Wed, 11/23/2016 - 19:01

నయీం గ్యాంగులో కీలక సభ్యుడు, అతడితో కలిసి కిడ్నాపులు, మోసాలు, నేరపూరిత కుట్రలు, భూ ఆక్రమణలు, బెదిరించి డబ్బు వసూళ్లు తదితర నేరాలకు పాల్పడిన సామా సంజీవరెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. అతడిపై పీడీ యాక్టు నమోదు చేశారు. హయత్‌నగర్‌ పరిధిలోని సాహెబ్‌నగర్ ప్రాంతానికి చెందిన సంజీవరెడ్డి నయీం గ్యాంగులో కీలక సభ్యుడని, అతడితో కలిసి ఆరు నేరాల్లో ఇతడిపై కేసులు ఉన్నాయని రాచకొండ పోలీసు కమిషనరేట్ ఒక ప్రటకనటలో తెలిపింది. పహాడి షరీఫ్, ఆదిభట్ల పోలీసు స్టేషన్ల పరిధిలో ప్రధానంగా ఇతడు నేరాలు చేసినట్లు పోలీసులు తెలిపారు. 
 
అతడి పనులు ప్రజాభద్రతకు ముప్పుగా పరిణమించాయని, అతడిని కొన్నాళ్ల పాటు సమాజానికి దూరంగా ఉంచాలన్న ఉద్దేశంతో పీడీ చట్టం కింద కొంతకాలం పాటు జైల్లో ఉంచామని పోలీసులు తెలిపారు. రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో శాంతిభద్రతలను కాపాడేందుకు అతడిపై పీడీ చట్టం పెట్టాల్సిందిగా పోలీసు కమిషనర్ మహేష్ భగవత్ ఆదేశించారన్నారు. 
 
కాగా, మరోవైపు నయీం అనుచరుడు పుల్లూరి మహేష్ అనుమానాస్పద స్థితిలో మరణించాడు. నయీం ఎన్‌కౌంటర్ జరిగినప్పటి నుంచి మహేష్ పరారీలో ఉన్నాడు. ఇప్పుడు ఉన్నట్టుండి అతడి మృతదేహం కనిపించడంతో ఏమై ఉంటుందా అన్న ఆసక్తి నెలకొంది. 

Videos

బాధితులకు పరామర్శ.. దాడులు ఆపకపోతే..

జనసేనకు 5 మంత్రి పదవులు దక్కేదెవరికి..?

ముఖ్యమైన శాఖలు ఎవరెవరికి..?

కీలక చర్చలు .. వైఎస్ జగన్ ను కలిసిన YSRCP నేతలు

EVM ట్యాంపరింగ్ పై చంద్రబాబు కామెంట్స్....

టీడీపీ నేతల దాడులపై కాటసాని రామిరెడ్డి స్ట్రాంగ్ రియాక్షన్

చంద్రబాబు మంత్రివర్గం రేసులో బీజేపీ నేతలు

కాంగ్రెస్ ఓట్లు కూడా మాకే

అగ్నికుల్ కాస్మోస్ అనే స్మార్టప్ కంపెనీ సాధించిన విజయం

నీట్ గందరగోళం టెన్షన్ లో విద్యార్థులు

Photos

+5

మనం గెలిచాం: అనుష్క శర్మతో కలిసి ధనశ్రీ ఫోజులు (ఫొటోలు)

+5

Mahishivan: సీరియల్‌ నటి మహేశ్వరి కుమారుడి ఊయల ఫంక్షన్‌ (ఫోటోలు)

+5

బర్త్‌డే స్పెషల్.. 'సుందర్ పిచాయ్' సక్సెస్ జర్నీ & లవ్ స్టోరీ (ఫొటోలు)

+5

Premgi Amaren: 45 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్న కమెడియన్‌ (ఫోటోలు)

+5

పాక్‌లో ప్రముఖ ఆలయాలు (ఫొటోలు)

+5

కల నెరవేరుతున్న వేళ.. పట్టలేనంత సంతోషంలో బిగ్‌బాస్‌ బ్యూటీ (ఫోటోలు)

+5

అర్జున్‌ సర్జా కూతురి పెళ్లి.. గ్రాండ్‌గా హల్దీ సెలబ్రేషన్స్‌ (ఫోటోలు)

+5

Fish Prasadam 2024 : చేప ప్రసాదం కోసం పోటెత్తిన జనాలు (ఫొటోలు)

+5

మృగశిర కార్తె ఎఫెక్ట్ : కిక్కిరిసిన రాంనగర్ చేపల మార్కెట్‌ (ఫొటోలు)

+5

Mayank Agarwal : కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టీమిండియా క్రికెటర్ ‘మయాంక్ అగర్వాల్’ (ఫొటోలు)