amp pages | Sakshi

కాంగ్రెస్, టీడీపీలు ఏకమై...

Published on Mon, 12/07/2015 - 16:53

టీపీసీసీ నేతలతో టీటీడీపీ నాయకుల సమావేశం
 
హైదరాబాద్‌
శత్రువు శత్రువు మిత్రుడన్నట్టు... రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. దశాబ్దాల కాలంగా బద్ధశత్రువులైన రాజకీయ పార్టీలు తమ వ్యూహాలు మార్చుకుంటున్నాయి. తెలంగాణలో టీఆర్‌ఎస్‌ను ఎదుర్కొనడానికి బద్ధ శత్రువులైన కాంగ్రెస్, టీడీపీలు ఒక్కటయ్యే ప్రయత్నాలు మొదలయ్యాయి. స్థానిక సంస్థల నుంచి ఎన్నికయ్యే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కలిసి పనిచేద్దామని పరస్పరం ప్రతిపాదించాయి.
 
తెలంగాణ స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఈ నెల 2 న ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. తెలంగాణలోని 12 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా, మొత్తం స్థానాలను గెలుచుకోవాలని అధికార టీఆర్‌ఎస్ వ్యూహం పన్నుతోంది. ఇటీవల వరంగల్ లోక్‌సభ స్థానానికి జరిగిన ఉపఎన్నికలో ఘోర పరాభవం నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీలు కొత్త పొత్తులపై దృష్టి సారించాయి.
 
తాజా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కలిసి పనిచేద్దామన్న ప్రాతిపదికన కొన్ని సీట్లను గెలుచుకోవడానికి కలిసి పనిచేద్దామని టీడీపీ నేతలు కాంగ్రెస్ నాయకుల ముందు ప్రతిపాదించారు. తెలంగాణ పీసీసీ నేత ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని సోమవారం టీటీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావుతో పాటు మరికొందరు నేతలు కలిసి ఈ ప్రతిపాదన చేశారు. దీనిపై వారు కొద్దిసేపు చర్చలు జరిపినట్టు తెలిసింది. కలిసి పనిచేయడం వల్ల రంగారెడ్డి, మహబూబ్‌నగర్  స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను ఓడించవచ్చని, అందుకు ఒక అంగీకారానికి రావాలని టీడీపీ నేతలు కోరారు.
 
స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు ఈనెల 9వ తేదీతో నామినేషన్ల గడువు పూర్తవుతోంది. డిసెంబర్ 27న పోలింగ్ జరుగుతుంది. తెలంగాణలోని స్థానిక సంస్థల్లో ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, నల్లగొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల నుంచి ఒక్కో ఎమ్మెల్సీ స్థానం, కరీంనగర్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో రెండేసి స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి.
 
కాంగ్రెస్, టీడీపీలు కలిస్తే రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌లలో ఒక్కో స్థానం గెలుచుకునే అవకాశం ఉన్నందున రెండింటిలో మహబూబ్‌నగర్ స్థానంలో తమకు మద్దతునివ్వాలని టీటీడీపీ నేతలు కోరినట్టు తెలిసింది. ఇదే అంశంపై ఉత్తమ్‌కుమార్‌రెడ్డి జిల్లా నేతలను సంప్రదించగా, వారు ఈ ప్రతిపాదనను ఏకగ్రీవంగా వ్యతిరేకించారు. దాంతో ఏం చేయాలో నేతలకు పాలుపోలేదు. నామినేషన్లు దాఖలు చేయడానికి మరో రెండు రోజులు గడువు ఉన్నందున మంగళవారం మరోసారి సమావేశం కావాలన్న నిర్ణయానికి ఆ నేతలు వచ్చినట్టు తెలిసింది.

Videos

బెంగుళూరు రేవ్ పార్టీ... టీడీపీ,సోమిరెడ్డికి ఇచ్చిపడేసిన కాకాణి

తప్పుడు ఆరోపణలపై యాంకర్ శ్యామల పరువు నష్టం దావా

TG క్రేజ్ ..రవాణా శాఖకు ఒకే రోజు 40 లక్షల ఆదాయం

కాంగ్రెస్ పై హరీష్ రావు ఫైర్

వంగా గీతకు చేతులెత్తి మొక్కిన యాంకర్ శ్యామల

రేవ్ పార్టీలో యాంకర్ శ్యామల? వంగా గీత రియాక్షన్

ఎల్లో మీడియాపై యాంకర్ శ్యామల పరువు నష్టం దావా

ఈ ఫోటోలో వ్యక్తి కనబడుట లేదు: జోగి రమేష్

ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ భద్రతా చర్యలపై చర్చ

అడ్డదిడ్డంగా మాట్లాడుతున్న ప్రశాంత్ కిషోర్ ? పీకే నోట బాబు పలుకులు

Photos

+5

ఓ వైపు టెన్షన్.. మరోవైపు ఉత్సాహం: స్టేడియంలో తళుక్కుమన్న షారుఖ్ (ఫొటోలు)

+5

Tirupati Gangamma Jatara 2024: తిరుపతిలో ఘనంగా తాతయ్యగుంట గంగమ్మ జాతర (ఫొటోలు)

+5

SRH: అతడి లాగే నన్నూ ఆశీర్వదించండి: అభిషేక్‌ తల్లికి అర్ష్‌దీప్‌ రిక్వెస్ట్‌ (ఫొటోలు)

+5

రజనీకాంత్‌ మనవడి బర్త్‌డే సెలబ్రేషన్స్‌.. క్రికెట్‌ థీమ్‌తో.. (ఫోటోలు)

+5

Hakim Shajahan Marriage: హీరోయిన్‌ను పెళ్లాడిన మలయాళ హీరో.. ఎంతో సింపుల్‌గా! (ఫోటోలు)

+5

Indraja Sankar Birthday Photos: విజిల్‌ నటి బర్త్‌డే సెలబ్రేషన్స్‌.. పెళ్లి తర్వాత భర్తతో తొలిసారి (ఫోటోలు)

+5

SRH Vs PBKS Highlights Photos: సన్ రైజర్స్ vs పంజాబ్..తారలతో నిండిన ఉప్పల్ స్టేడియం (ఫోటోలు)

+5

Shobha Shetty: కొత్తింటి కల సాకారం చేసుకున్న బిగ్‌బాస్‌ బ్యూటీ.. ప్రియుడితో గృహప్రవేశం (ఫోటోలు)

+5

నటుడు చందు కన్నుమూత.. వైరలవుతున్న పెళ్లి ఫోటోలు

+5

Afghanistan Floods: అఫ్ఘాన్‌ కొట్టుకుపోయింది.. మిగిలింది శూన్యమే (ఫొటోలు)