బడా బిల్డర్‌నంటూ బిల్డప్

Published on Sat, 02/15/2014 - 09:20

 రాంగోపాల్‌పేట,న్యూస్‌లైన్: అందమైన దుస్తుల్లో వస్తాడు.. బడా బిల్డర్‌నంటూ బిల్డప్ ఇస్తాడు..లక్షల్లో స్టీల్ (ఇనుపచువ్వలు) కొనుగోలు చేస్తాడు..ఇలా రెండుమూడుసార్లు నమ్మకం కలిగించి.. కోట్లు అప్పు చేస్తాడు..చెక్కులిచ్చి తప్పించుక తిరుగుతుంటాడు.. చివరకు గట్టిగా నిలదీస్తే బెదిరి స్తాడు..సుమారు నాలుగైదు దుకాణాల్లో స్టీల్ కొనుగోలు చేసి రూ.13 కోట్ల మేర ముంచిన ఘరానా మోసగాడిని మహంకాళి పోలీసులు అరెస్టు చేసి శుక్రవారం రిమాం డ్‌కు తరలించారు.

సీఐ సత్యనారాయణ వివరాల ప్రకారం..అడ్డగుట్ట తుకారాంగేటుకు చెందిన మురారిశెట్టి లక్ష్మణ్‌గుప్తా (36) రాణిగంజ్‌లోని గంజి కాంప్లెక్స్‌లో అలంకృత స్టీల్‌ట్రేడర్స్ పేరుతో స్టీల్ సరఫరా చేసే కార్యాలయాన్ని ఏర్పాటుచేశాడు. ఆఫీసును అందంగా ముస్తాబు చేసి బడా బిల్డర్‌నని బిల్డప్ ఇచ్చుకుంటాడు. పథకం ప్రకారం తాను ఎంచుకున్న స్టీల్ డీలర్ దగ్గరకు వెళ్లి ‘తాను బడా బిల్డర్‌ను.. పెద్దపెద్ద భవనాలకు స్టీల్‌ను సరఫరా చేస్తానంటూ’ పరిచయం చేసుకుంటాడు. ఇలా ఒకేసారి పది నుంచి ఇరవై లక్షల రూపాయల స్టీల్ కొనుగోలు చేసి అంతకంటే ఎక్కువ మొత్తంలో డబ్బు చెల్లిస్తాడు. మిగతా సొమ్ము మీ దగ్గరే ఉంచుకోండని చెబుతాడు.

ఇలా ఒకటి రెండుమార్లు కొనుగోలు చేసి సదరు వ్యాపారికి నమ్మకం కలిగిస్తాడు. ఇక ఆ తర్వాత డబ్బు అందలేదంటూ కోట్లలో స్టీల్‌ను అప్పుగా తీసుకొని.. అసలు ధరకంటే తక్కువ ధరకే  గుట్టుగా వేరేవారికి విక్రయిస్తాడు. ఇలా రాణిగంజ్‌లోని దుర్గా ఎంటర్‌ప్రైజెస్, ప్రొద్దుటూరు స్టీల్స్‌తోపాటు మరో డీలర్ దగ్గర స్టీల్ కొనుగోలు చేసి సుమారు రూ.3 కోట్లమే బాకీ పడ్డాడు. దీంతోపాటు నేరెడ్‌మెట్, బాలానగర్, రాజేంద్రనగర్ తదితర పోలీస్‌స్టేషన్ల పరిధుల్లో పలువురు డీలర్లను ఇదే తరహాలో సుమారు రూ.10 కోట్ల మేర మోసం చేశాడు.

లక్ష్మణ్‌గుప్త ఇచ్చిన చెక్కులు చెల్లకపోవడంతోపాటు డీలర్లకు దొరకకుండా తప్పించుక తిరుగుతాడు. ఎవరికైనా దొరికి ప్రశ్నిస్తే వారినే బెదిరిస్తూ బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడటం ఇతని నైజం. మహంకాళి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆయనపై మూడు కేసులు నమోదు కాగా.. పోలీసులనే ముప్పుతిప్పలు పెట్టించి చివరకు పోలీసులకు చిక్కాడు. ఈమేరకు లక్ష్మణ్‌గుప్తను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

Videos

రియల్ ఎగ్జిట్ పోల్స్ ఇవే..గెలిచేది మళ్లీ జగనే

టీడీపీపై రెచ్చిపోయిన రావెల కిషోర్ బాబు

మళ్లీ సీఎం జగన్ ప్రభంజనం

జగన్ 2.0.. 4వ తేదీన రాష్ట్రంలో ఫ్యాన్ సునామీ

ఆరోగ్యశ్రీని మళ్లీ YSR తరహాలో అమలు చేస్తాం: రేవంత్

ఎగ్జిట్ పోల్స్ పై KK రాజు రియాక్షన్

ఎగ్జిట్ పోల్స్ పై రాయదుర్గం ఎమ్మెల్యే రియాక్షన్

ఫోన్ ట్యాపింగ్ పై కోమటి రెడ్డి, హరీష్ రావు మధ్య మాటల యుద్ధం

వైఎస్సార్సీపీ విజయం ఖాయమైపోయిందని పార్టీ నేతల ధీమా

POK విదేశీ భూ భాగమని అంగీకరించిన పాకిస్థాన్ ప్రభుత్వం

Photos

+5

తెలంగాణ రాష్ట్ర గీతం పాడిన సింగర్‌ హారిక నారాయణ్‌ (ఫోటోలు)

+5

సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు (ఫొటోలు)

+5

త్వరలో పెళ్లి.. వెకేషన్‌లో చిల్‌ అవుతున్న సిద్దార్థ్‌- అదితి (ఫోటోలు)

+5

T20WC2024 USA vs Canada Highlights: కెనడా జట్టుపై అమెరికా సంచలన విజయం (ఫొటోలు)

+5

రెండేళ్లలో ఎన్నో ఎత్తుపళ్లాలు చూశాం.. ఇక ముందు: దీపక్‌ చహర్‌ భావోద్వేగం (ఫొటోలు)

+5

T20 WC 2007: ధోని నమ్మకం నిలబెట్టిన వరల్డ్‌కప్‌ విజేత.. ఇప్పుడేం చేస్తున్నారో తెలుసా? (ఫోటోలు)

+5

Kiccha Sudeep Daughter Sanvi: కిచ్చా సుదీప్‌ కూతురు ఇప్పుడెలా ఉందో చూశారా? (ఫోటోలు)

+5

Dimple Hayathi Visits Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టాలీవుడ్‌ హీరోయిన్‌ డింపుల్ హయాతి (ఫొటోలు)

+5

Allari Naresh-Virupa: తొమ్మిదవ పెళ్లి రోజు.. అల్లరి నరేశ్‌ భార్యను చూశారా? (ఫోటోలు)

+5

తిరుమలలో బిగ్‌బాస్‌ సందీప్‌ 10వ పెళ్లి రోజు సెలబ్రేషన్స్‌ (ఫోటోలు)