Breaking News

హక్కులతో పాటు బాధ్యతలూ ముఖ్యమే

Published on Wed, 12/11/2013 - 01:43

 కలెక్టరేట్, న్యూస్‌లైన్: మానవ హక్కులతో పాటు బాధ్యతలు కూడా ముఖ్యమేనని మానవ హక్కుల కమిషన్ సభ్యులు పెదపేరిరెడ్డి అన్నారు. హక్కుల ఉల్లంఘన గురించి మాట్లాడే వ్యక్తులు తమ బాధ్యతలను గుర్తిస్తే హక్కులను రక్షించినట్లే అన్నారు. మంగళవారం మానవ హక్కుల దినోత్సవం బషీర్‌బాగ్‌లోని నిజాం పీజీ న్యాయ కళాశాల (ఉస్మానియా విశ్వవిద్యాలయం)లో నిర్వహించారు. ఈ సందర్భంగా పెదపేరిరెడ్డి మాట్లాడుతూ 70 శాతం కేసులు మానవ హక్కుల చట్టపరిధిలో లేనివేనన్నారు. అయినప్పటికీ ఆ సమస్యల పరిష్కార దిశగా తాము కృషి చేస్తున్నామన్నారు. నేటి యువత ప్రేమంటూ జీవితాలను నాశనం చేసుకోకుండా తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలని సూచించారు. పీయూసీఎల్, న్యాయవాది జయవింధ్యాల, నిజాం న్యాయ కళాశాల ప్రిన్సిపాల్ గాలి వినోద్‌కుమార్  పాల్గొన్నారు.
 
 మానవహక్కుల పరిరక్షణ బాధ్యత అందరిదీ
 ఉస్మానియా యూనివర్సిటీ: మానవ హక్కుల పరిరక్షణ బాధ్యత సమాజంలో ప్రతి ఒక్కరిపై ఉందని వక్తలు అన్నారు. ఓయూ క్యాం పస్‌లోని కాలేజ్ ఆఫ్ టీచర్స్ ఎడ్యుకేషన్, హ్యూమన్ రైట్స్ సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం ఆంధ్ర మహిళా సభలో మానవ హక్కుల దినోత్సవం ఘనంగా జరిగింది. మంత్రి సునీతాలక్ష్మారెడ్డి, ఐపీఎస్ అధికారిణి అంజనా సిన్హా, బ్లూక్రాస్ అధినేత అక్కినేని అమల, జస్టిస్ లక్ష్మణ్‌రావు, కల్నల్ నరేందర్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థినుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.
 
 

Videos

ఏపీలో రాక్షస పాలన సాగుతోంది: మాజీ MLA రవీంద్రనాథ్ రెడ్డి

మంత్రి వ్యాఖ్యలపై FIR నమోదుకు మధ్యప్రదేశ్ హైకోర్టు ఆదేశం

మిస్ ఐర్లాండ్ జాస్మిన్ గేర్ హార్డ్ తో సాక్షి ఎక్స్ క్లూజివ్

భారత్ కు వ్యతిరేకంగా ఒక్కటైన దుష్ట కూటమి

గుంటూరులోని విద్యా భవన్ ను ముట్టడించిన ఉపాధ్యాయ సంఘాలు

తిరుపతి రుయాలో అనిల్ ను పరామర్శించిన భూమన కరుణాకర్ రెడ్డి

అనారోగ్యంతో బాధపడుతున్న వంశీ

రాజధాని పేరుతో ఒకే ప్రాంతంలో వేల కోట్లు పెట్టుబడి పెట్టడం బాధాకరం

వేలాది మంది పాక్ సైనికుల్ని ఎలా తరిమేశాయంటే?

ఎక్కడికైనా వెళ్తామ్.. ఉగ్రవాదులను అంతం చేస్తామ్

Photos

+5

డ్యాన్సింగ్‌ క్వీన్‌ 'మాధురీ దీక్షిత్‌' బర్త్‌డే.. ఈ విషయాలు తెలుసా?

+5

నిఖిల్‌ సిద్ధార్థ్ పెళ్లికి ఐదేళ్లు.. భార్యకు స్పెషల్ విషెస్ (ఫొటోలు)

+5

తెలంగాణ : సరస్వతీ నది పుష్కరాలు ప్రారంభం (ఫొటోలు)

+5

అనంతపురంలో కుండపోత వర్షం.. వరద నీటిలో ప్రజల ఇక్కట్లు (ఫొటోలు)

+5

#MissWorld2025 : బతుకమ్మలతో ముద్దుగుమ్మలకు ఆత్మీయ స్వాగతం (ఫొటోలు)

+5

ఈ తీపి గుర్తులు మరిచిపోలేను‌.. ఫోటోలు విడుదల చేసిన శ్రీనిధి శెట్టి (ఫొటోలు)

+5

జాతరలో నిర్లక్ష్యం గంగమ్మ జాతరకు భారీగా భక్తులు..(ఫొటోలు)

+5

వరంగల్‌ : కాకతీయ వైభవాన్ని చూసి మురిసిన విదేశీ వనితలు (ఫొటోలు)

+5

Miss World2025: రామప్ప ఆలయంలో మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు

+5

Cannes Film Festival 2025: కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో మెరిసిన అందాల తారలు.. ఫోటోలు