వైద్యారోగ్యశాఖలో 2,101 పోస్టులు

Published on Sun, 06/04/2017 - 03:02

- భర్తీకి ప్రభుత్వం పచ్చజెండా
- కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిన స్టాఫ్‌ నర్సులు, పారామెడికల్‌ ఉద్యోగాలు


సాక్షి, హైదరాబాద్‌: వైద్యారోగ్యశాఖలో 2,101 పారా మెడికల్‌ పోస్టుల భర్తీకి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన వీటిని భర్తీ చేసేందుకు అనుమతిస్తూ శనివారం ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం వివిధ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న స్టాఫ్‌ నర్సులు, నర్సులు, ల్యాబ్‌ టెక్నీషియన్లు, ఫార్మసిస్టు తదితర పారామెడికల్‌ పోస్టులే కావడం గమనార్హం. వైద్య విద్య సంచాలకులు (డీఎంఈ), తెలంగాణ వైద్య విధాన పరిషత్, ప్రజారోగ్యం, కుటుంబ సంక్షేమ విభాగాల వారీగా పోస్టులను భర్తీ చేస్తారు. డీఎంఈ పరిధిలో 474, వైద్య విధాన పరిషత్‌లో 270, ప్రజారోగ్యం, కుటుంబ సంక్షేమం విభాగంలో 1,357 పోస్టులున్నాయి. శాశ్వత నియామకాలు జరిపే వరకు ఈ ఉద్యోగులు కొనసాగుతారని ఉత్తర్వులో తెలిపారు. ఇటీవల కలెక్టర్ల సమావేశంలో కొందరు కలెక్టర్ల నుంచి వచ్చిన విన్నపం మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. భర్తీ చేయబోయే పోస్టుల వివరాలు ఇవీ...

డీఎంఈ పరిధిలో...
పోస్టులు    సంఖ్య

స్టాఫ్‌ నర్సులు    279
గ్రేడ్‌–2 ల్యాబ్‌ టెక్నీషియన్లు    121
గ్రేడ్‌–2 ఫార్మసిస్టులు    74
మొత్తం    474

వైద్య విధాన పరిషత్‌ పరిధిలో..
పోస్టులు      సంఖ్య
నర్సింగ్‌    129
ల్యాబ్‌ టెక్నీషియన్లు     51
గ్రేడ్‌–2 ఫార్మసిస్టులు    48
రేడియోగ్రాఫర్లు    42
మొత్తం    270

ప్రజారోగ్యం, కుటుంబ  సంక్షేమం పరిధిలో..
పోస్టులు    సంఖ్య
స్టాఫ్‌ నర్సులు    1,109
గ్రేడ్‌–2 ల్యాబ్‌ టెక్నీషియన్లు     131
గ్రేడ్‌–2 ఫార్మసిస్టులు    100
ఎల్‌టీ మలేరియా    17
మొత్తం    1,357

Videos

52 మందితో మోడీ క్యాబినెట్

వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలపై దాడులు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి

బండి సంజయ్ కి కేంద్ర మంత్రి పదవి

ఫిల్మ్ సిటీలో రామోజీ రావు అంత్యక్రియలు

ఓటమిపై సీదిరి అప్పలరాజు షాకింగ్ కామెంట్స్

ఫ్యాన్స్ ను డిస్సపాయింట్ చేస్తున్న శంకర్...

కేంద్రం నుండి రామ్మోహన్ రాయుడు, పెమ్మసాని ఫోన్ కాల్

డ్రాగన్ కంట్రీ కుట్రలో మాల్దీవులు..!?

పుష్ప2 Vs వేదా మూవీ బిగ్ క్లాష్..

మకాం మారుస్తున్న శ్రీలీల..

Photos

+5

Premgi Amaren: 45 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్న కమెడియన్‌ (ఫోటోలు)

+5

పాక్‌లో ప్రముఖ ఆలయాలు (ఫొటోలు)

+5

కల నెరవేరుతున్న వేళ.. పట్టలేనంత సంతోషంలో బిగ్‌బాస్‌ బ్యూటీ (ఫోటోలు)

+5

అర్జున్‌ సర్జా కూతురి పెళ్లి.. గ్రాండ్‌గా హల్దీ సెలబ్రేషన్స్‌ (ఫోటోలు)

+5

Fish Prasadam 2024 : చేప ప్రసాదం కోసం పోటెత్తిన జనాలు (ఫొటోలు)

+5

మృగశిర కార్తె ఎఫెక్ట్ : కిక్కిరిసిన రాంనగర్ చేపల మార్కెట్‌ (ఫొటోలు)

+5

Mayank Agarwal : కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టీమిండియా క్రికెటర్ ‘మయాంక్ అగర్వాల్’ (ఫొటోలు)

+5

వైఎస్‌ జగన్‌ను కలిసిన వైఎస్సార్‌సీపీ నేతలు (ఫొటోలు)

+5

ఈ హీరోయిన్‌ మనసు బంగారం.. మీరు కూడా ఒప్పుకోవాల్సిందే! (ఫోటోలు)

+5

ఫ్యామిలీతో గోవా బీచ్‌లో చిల్‌ అవుతున్న యాంకర్‌ లాస్య (ఫోటోలు)