Breaking News

కాంగ్రెస్‌తో పొత్తు ఉండదు

Published on Sat, 03/29/2014 - 00:03

జోగిపేట, న్యూస్‌లైన్:  కాంగ్రెస్‌తో ఎట్టిపరిస్థితిలో పొత్తు ఉండదని టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు హరీష్‌రావు స్పష్టం చేశారు.  ఏప్రిల్ 1న జోగిపేట శివారులో నిర్వహించనున్న కేసీఆర్ బహిరంగ సభకు సంబంధించిన సభా వేదిక స్థలాన్ని శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 9 అసెంబ్లీ స్థానాలను టీఆర్‌ఎస్ గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేసారు. జహీరాబాద్, నారాయణఖేడ్, అందోల్ నియోజకవర్గాల్లో పార్టీని మరింత బలోపేతం చేయడానికి ఈ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీతో పొత్తు ప్రసక్తేలేదని, ఆ పార్టీ నాయకులు తెలంగాణ ప్రజలను తికమక పెట్టేందుకు పొత్తులు ఉంటాయంటూ చెబుతున్నారని ఆరోపించారు.

 తెలంగాణ ప్రజలు బంగారు తెలంగాణను కోరుకుంటున్నారని, ఆదిశగా టీఆర్‌ఎస్ కృషి చేయనుందన్నారు. టీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే, ఎంపీ స్థానాల అభ్యర్థుల జాబితా సిద్ధంగా ఉందన్నారు. ఎన్నికల్లో గెలిచే గుర్రాలనే గుర్తించి టికెట్లను పార్టీ అధిష్టానవర్గం ఖరారు చేస్తుందన్నారు. ఆయనతోపాటు మాజీ ఎంపి పి.మాణిక్‌రెడ్డి, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆర్.సత్యనారాయణ, అందోల్ నియోజకవర్గ టీఆర్‌ఎస్ ఇన్‌చార్జి పి.కిష్టయ్య, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షులు పి.శివశేఖర్, డాకూర్  సర్పంచ్ ఏ.శంకరయ్య, నాయకులు డిబి.నాగభూషణం, ఎల్లయ్య, అరవిందరెడ్డి, అనిల్‌గౌడ్ తదితరులు ఉన్నారు.

Videos

తోకముడిచి కాల్వ .. చర్చకు డుమ్మా

పిఠాపురం నియోజకవర్గంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ హెల్త్ సెక్రటరీ

ఆవకాయ కోసం యూరప్ నుంచి ఇండియాకు వచ్చిన విదేశీయులు

మా కుటుంబాన్ని మొత్తం రోడ్డున పడేసాడు.. రేషన్ డోర్ డెలివరీ ఆపరేటర్ ఫైర్..

కూటమి ప్రభుత్వంపై స్టీల్ ప్లాంట్ కార్మికులు తీవ్ర ఆగ్రహం

కూటమి ప్రభుత్వంపై ఎంపీ మిథున్ రెడ్డి కామెంట్స్

సిరాజ్ ను పోలీస్ కస్టడీకి ఇచ్చిన ప్రత్యేక కోర్టు

Pithapuram: పవన్ ఇలాకాలో మట్టి మాఫియా

సోనియాగాంధీ, రాహుల్ గాంధీపై ఈడీ సంచలన ఆరోపణలు

Major Encounter: భారీ ఎన్‌కౌంటర్లో 25 మంది మృతి.. మరికొందరికి గాయాలు

Photos

+5

కుమారుడి టాలెంట్‌ చూసి మురిసిపోతున్నడైరెక్టర్‌ సుకుమార్ భార్య (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ ఫిలిం ఫెస్టివల్‌లో అనామిక ఖన్నా బ్యాక్‌లెస్ గౌనులో జాన్వీ కపూర్‌ (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టాలీవుడ్ ప్రముఖులు (ఫొటోలు)

+5

‘షష్టిపూర్తి’ మూవీ హీరోయిన్‌ ఆకాంక్ష సింగ్ (ఫొటోలు)

+5

'శ్రీదేవి'ని గుర్తుచేస్తూ కేన్స్‌లో తొలిసారి మెరిసిన జాన్వీ కపూర్‌ (ఫొటోలు )

+5

మోహన్ లాల్ బర్త్‌డే ప్రత్యేకం.. ఆయన ప్రాణ స్నేహితుడు ఎవరో తెలుసా? (ఫోటోలు)

+5

ముంబైలో 'థగ్‌ లైఫ్‌' టీమ్‌.. ఓటీటీ విడుదలపై ప్రకటన (ఫోటోలు)

+5

గోవాలో స్నేహితుల‌తో ఎంజాయ్ చేస్తున్న మ‌ను భాక‌ర్ (ఫోటోలు)

+5

పెళ్లి తర్వాత లండన్‌ హనీమూన్‌లో టాలీవుడ్ నటి అభినయ (ఫోటోలు)

+5

డిగ్రీ తీసుకున్న కుమారుడు - ఆనందంలో కల్వకుంట్ల కవిత (ఫోటోలు)