Breaking News

జోరుగా వైఎస్సార్ సీపీ అభ్యర్థుల ప్రచారం

Published on Fri, 03/28/2014 - 23:55

నారాయణఖేడ్, న్యూస్‌లైన్:  స్థానిక జెడ్పీటీసీ స్థానం నుంచి పోటీ చేస్తున్న వైఎస్సార్ సీపీ అభ్యర్థి మహానంద షెట్కార్‌తోపాటు ఎంపీటీసీ అభ్యర్థుల తరఫున ఆ పార్టీ నాయకులు ముమ్మర ప్రచారాన్ని చేపడుతున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం నారాయణఖేడ్ పట్టణంలోని మార్వాడిగల్లి, గౌలిగల్లిలో ముమ్మర ప్రచారం నిర్వహించారు. దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలను ఈ సందర్భంగా ఓటర్లకు వివరించారు. మహానేత వైఎస్సార్ మరణం తరువాత రాష్ట్రంలో అభివృద్ధి జరగలేదని వైఎస్సార్ సీపీ నాయకులు తెలిపారు.

 వైఎస్సార్ పథకాలు పూర్తి స్థాయిలో అమలు కావాలంటే వైఎస్సార్ సీపీకి అండగా నిలవాలని వారు కోరారు. ప్రజల సమస్యలను పరిష్కరించే విధంగా తమ పార్టీ కృషి చేస్తుందని వారు హామీ ఇచ్చారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ ప్రచారంలో వైఎస్సార్ సీపీ నాయకులు డాక్టర్ విజయ్‌కుమార్ షెట్కార్, శ్రీదేవి షెట్కార్, ఉమాదేవి, నీరజ, లక్ష్మి, ఎంపీటీసీ అభ్యర్థులు సంగమేశ్వర్, రాణి, సుధాకర్, ఫయాజ్, నరేష్ యాదవ్, సత్యనారాయణ, దత్తు, విజయ్, సంజీవ్‌రెడ్డి, సుధాకర్, తుకారాం తదితరులు పాల్గొన్నారు.

Videos

Amjad: జగన్ నెల్లూరుకు వెళ్తున్నాడంటే.. బాబుకి చెమటలు పడుతున్నాయి

వెయ్యి మందికిపైగా YSRCP నేతలకు నోటీసులిచ్చారు: అనిల్ కుమార్ యాదవ్

దయచేసి బెట్టింగ్‌ యాప్‌ల్లో ఆడకండి: ప్రకాష్‌రాజ్‌

ఎవరికి టికెట్ ఇవ్వాలన్నది పార్టీ నిర్ణయిస్తుంది :ఫిరోజ్ ఖాన్

దూసుకుపోతున్న నిసార్

హైదరాబాద్ ఫామ్ హౌజ్ లో సీజ్ చేశామంటున్న డబ్బు నాది కాదు: రాజ్ కేసిరెడ్డి

పులివెందుల ZPTC ఉపఎన్నికకు YSRCP అభ్యర్థి ఖరారు

ఎవ్వడిని వదిలిపెట్టం.. తురకా కిషోర్ అరెస్ట్ పై పేర్ని నాని వార్నింగ్

కాల్పుల విరమణకు పాకిస్థాన్ అడుక్కుంది: జైశంకర్

జగన్‌ను కలిసిన గుత్తా లక్ష్మీనారాయణ

Photos

+5

సార్.. మేడమ్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో నిత్యామీనన్.. (ఫోటోలు)

+5

'కింగ్డమ్' రిలీజ్ ప్రెస్‌మీట్.. విజయ్ ఇలా భాగ్యశ్రీ అలా (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో 'జూనియర్' హీరో కిరీటి (ఫొటోలు)

+5

30 దేశాల‍కు సునామీ టెన్షన్‌.. ప్రాణ భయంతో సురక్షిత ప్రాంతాలకు లక్షలాది ప్రజలు (ఫొటోలు)

+5

రుచికీ, ఆరోగ్యాని​కీ పేరుగాంచిన వంటకం! (ఫొటోలు)

+5

మీకు తెలియకుండానే మీ పాన్‌కార్డుతో లోన్‌! ఎలా తెలుసుకోవాలంటే..(ఫొటోలు)

+5

తేళ్లు కుట్టని పంచమి.. పోటెత్తిన భక్తజనం (ఫొటోలు)

+5

భారతదేశంలోని ప్రసిద్ధ నరసింహ పీఠాలు (ఫొటోలు)

+5

నిధి అగర్వాల్‌.. విచిత్రమైన కండీషన్‌ (ఫొటోలు)

+5

ఒక ఏడాదిలో ఎక్కువ సినిమాలు చేసిన హీరో ఎవరు..? ( ఫోటోలు )