కాబోయే భార్య వేరే యువకుడితో వెళ్లిందని..

Published on Tue, 04/12/2016 - 23:21

పరిగి: తనతో నిశ్చితార్థం జరిగిన పెళ్లికూతురు మరో యువకుడితో వెళ్లిపోవటాన్ని జీర్ణించుకోలేని ఓ యువకుడు పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన పరిగి మండల పరిధిలోని ఇబ్రహింపూర్‌లో పెద్దతండాలో మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది. కుటుంబీకులు తెలిపిన వివరాలు.. ఇబ్రహింపూర్‌ తండాకు చెందిన హిర్యానాయక్ కుమారుడు నరేష్(20)కి గత నెల మహబూబ్‌నగర్ జిల్లా దౌల్తాబాద్ మండలం కాస్లాబాద్‌కు చెందిన యువతితో నెల రోజుల కిందట వివాహం నిశ్చయం కావటంతో పాటు నిశ్చితార్ధం కూడా జరిగింది. కాగా వారం రోజుల కిందట ఆ బాలిక బొంరాస్‌పేట్ మండలం కొత్తూర్‌కు చెందిన ఓ యువకుడితో కలిసి ఇంట్లోంచి వెళ్లిపోయింది.

యువతి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించగా వారు సదురు యువకుడిపై కేసు నమోదు చేసి బాలికను తీసుకు వచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. కాగా మొదట ఆ బాలికతో నిశ్చితార్ధం జరిగిన ఇబ్రహింపూర్‌ తండాకు చెందిన నరేష్‌తో పాటు వారి కుటుంభ సభ్యులకు విషయం తెలిసింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. తనతో నిశ్చితార్ధం జరిగిన అమ్మాయి వేరే యువకునితో వెళ్లిపోవటం జీర్ణించుకోలేకపోయాడు. ఇదే క్రమంలో మంగళవారం సాయంత్రం ఇంట్లో ఎవరులేని సమయంలో పరుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

#

Tags

Videos

టచ్ కూడ చెయ్యలేరు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు చైతన్య కృష్ణ మాస్ వార్నింగ్

కాసుల కోసం ప్రాణాలతో చెలగాటమాడుతున్న డాక్టర్లు

జగన్ విజయం ఖాయమంటున్న సర్వేలు..

టీడీపీ గూండాల విధ్వంసం.. వీడియోలు వైరల్

అల్లు అర్జున్ భార్య స్నేహతో కలిసి రోడ్ సైడ్ దాబాలో భోజనం

బాబూ.. ప్ట్.. నాలుగు సీట్లేనా! విజయసాయిరెడ్డి సెటైర్లు

సందీప్ వంగాకు ఒకలా భన్సాలీకి మరోలా ఇదేనా బాలీవుడ్ నీతి

చంద్రబాబుపై పునూరు గౌతమ్ రెడ్డి సెటైర్లు

ఏపీలో గెలిచేదెవరు? జడ్జ్‌మెంట్‌ డే 4th June (ఫొటోలు)

రేవంత్ ఓ జోకర్

Photos

+5

ఫ్యామిలీతో ట్రిప్‌.. పొట్టి డ్రెస్‌లో అనసూయ జలకాలాటలు (ఫోటోలు)

+5

రేవ్‌ పార్టీ.. హేమతో పాటు ఈ బ్యూటీ కూడా.. ఇంతకీ ఎవరంటే? (ఫోటోలు)

+5

Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (23-05-2024)

+5

Dinesh Karthik: ఆ నవ్వే నన్ను ముంచేసింది!.. ఎల్లప్పుడూ నా వాడే!(ఫొటోలు)

+5

పండంటి బాబుకు జన్మనిచ్చిన బుల్లితెర జంట (ఫోటోలు)

+5

హైదరాబాద్ లో విరాట్ కోహ్లీ రెస్టారెంట్ ఎలా ఉందో చూడండి (ఫొటోలు)

+5

వేలకోట్ల సామ్రాజ్యం.. చివరకు భార్య నగలు అమ్మాల్సి వచ్చింది: అనిల్ అంబానీ గురించి ఆసక్తికర విషయాలు (ఫొటోలు)

+5

Kalki 2898 AD Hyderabad Event: గ్రాండ్‌గా ప్రభాస్‌ కల్కి ఈవెంట్‌.. బుజ్జి లుక్‌ రివీల్‌ చేసిన మేకర్స్ (ఫొటోలు)

+5

హీరామండి సిరీస్‌లో అదరగొట్టిన అందాల ముద్దుగుమ్మలు (ఫోటోలు)

+5

కావ్యా మారన్‌తో ఫొటోలకు ఫోజులు.. ఈ బ్యూటీ గురించి తెలుసా? (ఫొటోలు)