బుద్దొచ్చింది.. మళ్లీ ఆ తప్పు చేయం

Published on Sat, 08/27/2016 - 22:17

బాబుకు ఓటేసి మోసపోయాం
పెద్దింపేట పంచాయతీ ప్రజల పశ్చాత్తాపం
 
 
పెద్దింపేట(బలిజిపేట రూరల్‌): చంద్రబాబు బురిడీ మాటలకు మోసపోయాం.. భవిష్యత్తులో మళ్ళీ ఆ తప్పు చేయం..అని పెద్దింపేట, పోలినాయుడువలస, గౌరీపురం గ్రామాల ప్రజలు స్పష్టం చేశారు. పెద్దింపేట పంచాయతీ పరిధిలోని పెద్దింపేట, గౌరీపురం, పోలినాయుడువలస గ్రామాల్లో శనివారం వైఎస్‌ఆర్‌ సీపీ నియోజకవర్గ సమన్వయ కర్త జమ్మాన ప్రసన్నకుమార్‌ ఆధ్వర్యంలో గడప గడపకు వైఎస్‌ఆర్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ చంద్రబాబు మోసపూరిత హామీలు, పాలనపై అసంతప్తి వ్యక్తం చేశారు. ఇస్తున్న పింఛన్లను తొలగించారని లక్షు్మందొర, టి.తవిటినాయుడులు తెలిపారు. బాబు వస్తే జాబు వస్తుందని చెప్పారని.. కనీసం కూలి పని దొరకటం లేదని పోలినాయుడువలస గ్రామానికి చెందిన మహిళలు గౌరమ్మ, పైడితల్లి తెలిపారు.  పెద్దింపేట ఎస్సీ కాలనీలో సమస్యలు వేధిస్తున్నా ఎవరూ పట్టించుకోవటం లేదని వెంకటరమణ, రతాలు, నరసమ్మ తెలిపారు.  ఉద్యోగం, పింఛన్లు, ఇళ్లు, రుణమాఫీ లేదని లక్ష్మి, అన్నపూర్ణ, రత్నాలు, రామలక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్లు, నీటి సదుపాయాల్లేవని ఎస్సీ కాలనీ మహిళలు ఆవేదన చెందారు. కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ సెల్‌ కార్యదర్శి గర్భాపు ఉదయభాను,  బందలుప్పి ఎంపీటీసీ యాళ్ళ ప్రతాప్‌కుమార్, ఎంఆర్‌ నగర్‌ ఎంపీటీసీ బడే రామారావు, జిల్లా కార్యవర్గ సభ్యుడు కేతిరెడ్డి రాఘవ, ఎస్టీ సెల్‌ పార్వతీపురం పట్టణ అధ్యక్షుడు వీటీ దేవీ ప్రసాద్‌ థాట్రాజ్, పార్వతీపురం పట్టణ వైఎస్సార్‌ సీపీ యూత్‌ అధ్యక్షుడు బొంగు ఉమామహేశ్వరరావు, స్థానిక నాయకులు పి.మురళీకష్ణ, పెద్దింపేట మాజీ సర్పంచ్‌ ఎం.సాంబమూర్తి, నారాయణపురం సర్పంచ్‌ ఎం.ప్రసాద్, ఎంపీటీసీ ఎం.శ్రీరామూర్తి, జి.గోపాల్, ఎం.జనార్దన్, వి.పోలినాయుడు, జి.శంకరరావు, టి.క్రిష్ణ, పకీరునాయుడు, కర్రి సింహాచలం, సూరందొర, బి.సత్యన్నారాయణ, పి.నారాయణరావు, వి.సీతారాంనాయుడు, మజ్జి సత్యంనాయుడు, కె.సత్యంనాయుడు, వి.ఉగాదినాయుడు పాల్గొన్నారు.
 

#

Tags

Videos

పూర్తి ఆధారాలతో హేమను అదుపులోకి తీసుకున్న పోలీసులు

కఠినమైన ఆంక్షల మధ్య కౌంటింగ్

ఎగ్జిట్ పోల్స్ పై కృష్ణం రాజు సంచలన వ్యాఖ్యలు

ఎమ్మెల్సీ రఘు రాజుపై అనర్హత వేటు

ఏపీలో అమ్ముడుపోయిన ఈసీ పోస్టల్ బ్యాలెట్ లో కొత్త రూల్స్

ఎలక్షన్ కౌంటింగ్ ఏర్పాట్లపై YV సుబ్బారెడ్డి

దేశవ్యాప్తంగా కౌంటింగ్ కు అన్ని ఏర్పాట్లు చేశాం

Watch Live: ఏపీ ఎన్నికల ఫలితాలపై సీఈఓ ముకేశ్ కుమార్ కీలక ప్రెస్ మీట్

లవ్ మౌళి 2.0 అని తె? ఎందుకు పెట్టారు..?

భారీ బందోబస్త్..కౌంటింగ్ కు కౌంట్ డౌన్

Photos

+5

AP: కౌంటింగ్‌కు కౌంట్‌డౌన్‌.. ఎన్నికల ఫలితాలకు సర్వం సిద్ధం (ఫొటోలు)

+5

తెలంగాణ రాష్ట్ర గీతం పాడిన సింగర్‌ హారిక నారాయణ్‌ (ఫోటోలు)

+5

సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు (ఫొటోలు)

+5

త్వరలో పెళ్లి.. వెకేషన్‌లో చిల్‌ అవుతున్న సిద్దార్థ్‌- అదితి (ఫోటోలు)

+5

T20WC2024 USA vs Canada Highlights: కెనడా జట్టుపై అమెరికా సంచలన విజయం (ఫొటోలు)

+5

రెండేళ్లలో ఎన్నో ఎత్తుపళ్లాలు చూశాం.. ఇక ముందు: దీపక్‌ చహర్‌ భావోద్వేగం (ఫొటోలు)

+5

T20 WC 2007: ధోని నమ్మకం నిలబెట్టిన వరల్డ్‌కప్‌ విజేత.. ఇప్పుడేం చేస్తున్నారో తెలుసా? (ఫోటోలు)

+5

Kiccha Sudeep Daughter Sanvi: కిచ్చా సుదీప్‌ కూతురు ఇప్పుడెలా ఉందో చూశారా? (ఫోటోలు)

+5

Dimple Hayathi Visits Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టాలీవుడ్‌ హీరోయిన్‌ డింపుల్ హయాతి (ఫొటోలు)

+5

Allari Naresh-Virupa: తొమ్మిదవ పెళ్లి రోజు.. అల్లరి నరేశ్‌ భార్యను చూశారా? (ఫోటోలు)