amp pages | Sakshi

మోదీ రాక నేడే

Published on Fri, 11/25/2016 - 02:36

  • నేడు, రేపు హైదరాబాద్‌లోనే ఉండనున్న ప్రధాని
  • డీజీపీ/ఐజీపీల వార్షిక సదస్సుకు హాజరు
  • రాజకీయ పార్టీలు, ప్రముఖులతో భేటీపై అస్పష్టత
  • సాక్షి, హైదరాబాద్: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం హైదరాబాద్ రానున్నారు. చండీగఢ్ పర్యటనకు వెళ్లిన ఆయన అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో సాయంత్రం 6.35 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా సర్దార్ వల్లభ్‌భాయ్‌పటేల్ జాతీయ పోలీస్ అకాడమీకి వస్తారు. గంటసేపు విశ్రాంతి తీసుకున్న అనంతరం ఐపీఎస్‌లతో విందు సమావేశంలో పాల్గొంటారు. రాత్రి అక్కడే బస చేస్తారు. మరుసటిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు డీజీపీ/ఐజీపీల సమావేశంలో పాల్గొంటారు. తర్వాత రోడ్డు మార్గంలో శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుని.. ఢిల్లీకి బయలుదేరుతారు.

    నోట్ల రద్దు అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన నేపథ్యంలో రాష్ట్రానికి ప్రధాని రాక ఆసక్తికరంగా మారింది. అయితే ఈ పర్యటనలో రాష్ట్రానికి చెందిన ప్రముఖులను, రాజకీయ పార్టీల నేతలను కలుస్తారా, లేదా? అనే దానిపై స్పష్టత లేదు. అలాంటి వివరాలేవీ ప్రధాని పర్యటన షెడ్యూల్‌లో పొందుపర్చలేదు. అయితే తన దినచర్యలో భాగంగా ప్రధాని శనివారం తెల్లవారుజామున గంట సేపు యోగా కార్యక్రమంలో పాల్గొననుండటం గమనార్హం.
     
    పోలీసు పతకాలు ప్రదానం చేయనున్న మోదీ
    దేశానికి స్వాతంత్య్రం వచ్చిననాటి నుంచి ఏటా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల డెరైక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్/ఇన్ స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, కేంద్రీయ పోలీసు సంస్థల అధిపతులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా శుక్రవారం నుంచి రెండు రోజులపాటు హైదరాబాద్‌లోని సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ జాతీయ పోలీసు అకాడమీలో 51వ వార్షిక సదస్సు జరుగుతోంది. ఇందులో ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ పాల్గొంటున్నారు. ఇంటెలిజెన్‌‌స బ్యూరో అధికారులకు రాష్ట్రపతి పోలీసు పథకాలను, పోలీసు పథకాలను ప్రదానం చేయనున్నారు. సాధారణంగా ఈ వార్షిక సదస్సులను 2013 వరకు ఏటా ఢిల్లీలోనే నిర్వహించేవారు. 2014లో తొలిసారిగా ఢిల్లీకి వెలుపల అస్సాంలోని గువాహటిలో నిర్వహించారు. గతేడాది గుజరాత్‌లోని రాన్ ఆఫ్ కచ్‌లో జరగగా.. ఈ ఏడాది హైదరాబాద్ ఇందుకు వేదిక అయింది.
     
    ప్రధాని షెడ్యూల్ ఇదే..
    నవంబర్ 25 (శుక్రవారం)

    • సాయంత్రం 4.10: వైమానిక దళ ప్రత్యేక విమానంలో చండీగఢ్ నుంచి బయలుదేరుతారు.
    • 6.35: హైదరాబాద్‌లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటారు.
    • 7.00: రోడ్డు మార్గంలో సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ పోలీస్ అకాడమీకి చేరుకుంటారు.
    • 7 నుంచి 8 గంటల వరకు: విశ్రాంతి
    • 8 నుంచి 9 గంటల వరకు: ఐపీఎస్‌లతో కలిసి విందు భోజనం చేస్తారు.
    • అనంతరం విశ్రాంతి తీసుకుంటారు.

     
     నవంబర్ 26 (శనివారం)

    • ఉదయం 6 నుంచి 7 గంటల వరకు: అకాడమీ స్టేడియంలో జరిగే యోగా కార్యక్రమంలో పాల్గొంటారు.
    • 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకు: డీజీపీ/ఐజీపీల సమావేశంలో పాల్గొంటారు.
    • 5.05: అకాడమీ నుంచి రోడ్డు మార్గాన శంషాబాద్‌కు బయలుదేరుతారు.
    • 5.30: ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరుతారు.
    • 7.40: ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకుంటారు.

Videos

బెంగుళూరు రేవ్ పార్టీ... టీడీపీ,సోమిరెడ్డికి ఇచ్చిపడేసిన కాకాణి

తప్పుడు ఆరోపణలపై యాంకర్ శ్యామల పరువు నష్టం దావా

TG క్రేజ్ ..రవాణా శాఖకు ఒకే రోజు 40 లక్షల ఆదాయం

కాంగ్రెస్ పై హరీష్ రావు ఫైర్

వంగా గీతకు చేతులెత్తి మొక్కిన యాంకర్ శ్యామల

రేవ్ పార్టీలో యాంకర్ శ్యామల? వంగా గీత రియాక్షన్

ఎల్లో మీడియాపై యాంకర్ శ్యామల పరువు నష్టం దావా

ఈ ఫోటోలో వ్యక్తి కనబడుట లేదు: జోగి రమేష్

ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ భద్రతా చర్యలపై చర్చ

అడ్డదిడ్డంగా మాట్లాడుతున్న ప్రశాంత్ కిషోర్ ? పీకే నోట బాబు పలుకులు

Photos

+5

ఓ వైపు టెన్షన్.. మరోవైపు ఉత్సాహం: స్టేడియంలో తళుక్కుమన్న షారుఖ్ (ఫొటోలు)

+5

Tirupati Gangamma Jatara 2024: తిరుపతిలో ఘనంగా తాతయ్యగుంట గంగమ్మ జాతర (ఫొటోలు)

+5

SRH: అతడి లాగే నన్నూ ఆశీర్వదించండి: అభిషేక్‌ తల్లికి అర్ష్‌దీప్‌ రిక్వెస్ట్‌ (ఫొటోలు)

+5

రజనీకాంత్‌ మనవడి బర్త్‌డే సెలబ్రేషన్స్‌.. క్రికెట్‌ థీమ్‌తో.. (ఫోటోలు)

+5

Hakim Shajahan Marriage: హీరోయిన్‌ను పెళ్లాడిన మలయాళ హీరో.. ఎంతో సింపుల్‌గా! (ఫోటోలు)

+5

Indraja Sankar Birthday Photos: విజిల్‌ నటి బర్త్‌డే సెలబ్రేషన్స్‌.. పెళ్లి తర్వాత భర్తతో తొలిసారి (ఫోటోలు)

+5

SRH Vs PBKS Highlights Photos: సన్ రైజర్స్ vs పంజాబ్..తారలతో నిండిన ఉప్పల్ స్టేడియం (ఫోటోలు)

+5

Shobha Shetty: కొత్తింటి కల సాకారం చేసుకున్న బిగ్‌బాస్‌ బ్యూటీ.. ప్రియుడితో గృహప్రవేశం (ఫోటోలు)

+5

నటుడు చందు కన్నుమూత.. వైరలవుతున్న పెళ్లి ఫోటోలు

+5

Afghanistan Floods: అఫ్ఘాన్‌ కొట్టుకుపోయింది.. మిగిలింది శూన్యమే (ఫొటోలు)