Breaking News

మల్లన్నసాగర్‌ నిర్మాణాన్ని అడ్డుకోవద్దు

Published on Sun, 07/17/2016 - 19:40

  • టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు మురళీయాదవ్‌
  • నారాయణఖేడ్‌: రెండేళ్లలో మల్లన్నసాగర్‌ ప్రాజెక్టు నిర్మాణం పూర్తవుతుందని, ఈ విషయంలో ప్రతిపక్షాలు ఆరోపణలు సరికాదని టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు మురళీయాదవ్‌ తెలిపారు. ఆదివారం నారాయణఖేడ్‌ వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. మల్లన్నసాగర్‌ నిర్మాణం పూర్తయితే ఒక్కో నియోజకవర్గంలో లక్ష ఎకరాలు సాగులోకి వస్తాయన్నారు.

    సింగూరు ప్రాజెక్టులో సైతం నీరు నింపేలా ప్రభుత్వం ప్రణాళికలు తయారుచేసిందన్నారు. చెరువులు నిండితే రైతులకు ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని ఇతర రాష్ట్రాలు నిశితంగా గమనిస్తున్నాయని చెప్పారు. సీఎం కేసీఆర్‌.. మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ, కల్యాణలక్ష్మి, షాదీముబాకర్, మార్కెట్‌ యార్డుల నిర్మాణం, రహదారులు, విద్య, వైద్యం ఇలా అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్నట్లు తెలిపారు.

    నారాయణఖేడ్‌ నియోజకవర్గం సైతం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు. సమావేశంలో సర్పంచ్‌ అప్పారావుషెట్కార్, గొర్రెలకాపరుల సహకార సంఘం జిల్లా చైర్మన్‌ మల్‌శెట్టి యాదవ్, జెడ్పీటీసీలు నిరంజన్, రవి, టీఆర్‌ఎస్‌ నాయకులు పండరియాదవ్, మూఢ రామకృష్ణ, పురంజన్, బాసిత్, వెంకట్‌నాయక్, రవీందర్‌నాయక్‌ ఉన్నారు.

    మొక్కలు నాటిన మురళీయాదవ్‌
    నారాయణఖేడ్‌లోని చేనేత సహకార సంఘం భవనం వద్ద టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు మురళీయాదవ్, సర్పంచ్‌ అప్పారావుషెట్కార్, టీఆర్‌ఎస్‌ ఖేడ్‌ అధ్యక్షుడు ప్రభాకర్‌ మొక్కలు నాటారు.

Videos

అనంతపురం జిల్లాలో భారీ వర్షం

నందిగం సురేష్ అరెస్ట్

లిక్కర్ కేసు వెనక కుట్ర.. అడ్డంగా దొరికిన చంద్రబాబు

ఫ్యామిలీతో తిరుమలలో ఎంపీ గురుమూర్తి

పాతబస్తీ అగ్నిప్రమాద ఘటనపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి

ఎంటర్ ది డ్రాగన్.. కరోనా వచ్చేసింది

స్పిరిట్ లో కల్కి జోడి..

ఆ సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేస్తున్న రవితేజ..!

కోపముంటే నాపై తీర్చుకో.. ప్రజల్ని ఎందుకు హింసిస్తావ్.. ఎమ్మెల్యే మాధవి రెడ్డిపై ఫైర్

కూటమి సర్కార్ నిర్లక్ష్యంతో మైనింగ్ లో పని చేసే కార్మికులు రోడ్డున పడ్డారు

Photos

+5

23వ 'జీ సినీ అవార్డ్స్'.. ముంబైలో మెరిసిన స్టార్‌ హీరోయిన్స్‌ (ఫోటోలు)

+5

విజయవాడలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం (ఫొటోలు)

+5

ట్యాంక్‌ బండ్‌పై అట్టహాసంగా ప్రారంభమైన సండే ఫండే వేడుకలు (ఫొటోలు)

+5

వరంగల్ : సరస్వతీ పుష్కరాలకు పోటెత్తిన భక్తులు..(ఫొటోలు)

+5

తెలంగాణ సచివాలయంలో అందగత్తెలు

+5

అనసూయ నూతన గృహప్రవేశం.. పూజా కార్యక్రమం (ఫోటోలు)

+5

పాతబస్తీలో పెను విషాదం.. అగ్నిప్రమాద దృశ్యాలు

+5

చెల్లి పెళ్లిలో నటి హరితేజ (ఫోటోలు)

+5

ఎంగేజ్ మెంట్ పార్టీలో 'కొత్త బంగారు లోకం' హీరోయిన్ (ఫొటోలు)

+5

బిగ్ బాస్ అశ్విని బర్త్ డే పార్టీలో పల్లవి ప్రశాంత్ (ఫొటోలు)