విద్యాభివృద్ధికి కృషి

Published on Tue, 04/25/2017 - 17:54

మహేశ్వరం: విద్యాభివృద్దికి తమ వంతు కృషి చేస్తానని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత, ప్రాథమిక పాఠశాలలో ఎంపీ నిధులు రూ.2.50 లక్షల నిధులతో మినరల్‌ వాటర్‌ ఫిల్టర్లను ఆయన స్థానిక ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం విద్యాభివృద్ధికి కృషి చేస్తుందన్నారు. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యను అందించేందుకు సీఎం కేసీఆర్‌ పని చేస్తున్నారని తెలిపారు.

ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించేందుకు ఎంపీ నిధులను వెచ్చించి పలు అభివృద్ది కార్యక్రమాలు చేపడతానని విశ్వేశ్వర్‌రెడ్డి చెప్పారు. నేడు ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్‌ పాఠశాలలకు ధీటుగా ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో ఉచితంగా మధ్యాహ్న భోజనం, రోజూ గుడ్డు,  ఉచితంగా ఆరోగ్య పరీక్షలు, పేద ఎస్సీ, ఎస్టీ,  బీసీ, మైనార్టీ విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు, ఉచితంగా రెండు జతల యూనిఫామ్స్, పుస్తకాలు, నోట్‌ బుక్స్‌ అందిస్తున్నామని తెలిపారు.  ప్రతి ఒక్కరు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి వాటి బలోపేతానికి కృషి చేయాలని కోరారు. అంతకు ముందు ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి శారద ఒకేషనల్‌ కాలేజీలో స్పోకేన్‌ ఇంగ్లీష్‌ క్లాసులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యుడు నేనావత్‌ ఈశ్వర్‌ నాయక్, వైస్‌ ఎంపీపీ మునగపాటి స్వప్ననవీన్, సర్పంచ్‌ ఆనందం, ఉప సర్పంచ్‌ రాములు, పలువురు నాయకులు  పాల్గొన్నారు.

Videos

ఎన్నికల ఫలితాలపై ఉష శ్రీ చరణ్ కీలక వ్యాఖ్యలు

ముగిసిన లోక్ సభ ఎన్నికల ప్రచారం

5 ఏళ్ల క్రితం ఇదే రోజు.. వైయస్ జగన్ ట్వీట్

పిన్నెల్లి పిటిషన్ పై విచారణ.. సీఈసీకి హైకోర్టు ఆదేశం

ఆకట్టుకున్న వల్లభనేని వంశీ కుమార్తె భరతనాట్య ప్రదర్శన

సీఈఓ మెమోపై భారీ ట్విస్ట్

నైరుతి వచ్చేసింది.. వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి..

మరో మహిళతో రూమ్లో ఉండగా పట్టుకున్న నక్షత్ర

ఏపీ ఎన్నికల ఫలితాలు,సర్వేలపై దేవులపల్లి అమర్ కామెంట్స్

పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్.. కాసేపట్లో విచారణ

Photos

+5

Allari Naresh- Virupa: తొమ్మిదవ పెళ్లి రోజు.. అల్లరి నరేశ్‌ భార్యను చూశారా? (ఫోటోలు)

+5

తిరుమలలో బిగ్‌బాస్‌ సందీప్‌ 10వ పెళ్లి రోజు సెలబ్రేషన్స్‌ (ఫోటోలు)

+5

భర్తతో కలిసి క్రొయేషియా ట్రిప్‌లో బిజీగా బ్యాడ్మింటన్‌ స్టార్‌.. స్టన్నింగ్‌ లుక్స్‌ (ఫొటోలు)

+5

టీ20 వరల్డ్‌కప్‌-2024: భర్త క్రికెట్‌తో.. భార్య యాంకరింగ్‌తో బిజీ.. క్యూట్‌ కపుల్‌(ఫొటోలు)

+5

పెళ్లికి ముందే ప్రెగ్నెంట్‌ అంటూ కామెంట్స్‌.. నా భర్త అడిగేవాడన్న హీరోయిన్!(ఫొటోలు)

+5

ఈ స్టన్నింగ్‌ బ్యూటీ.. టీమిండియా స్టార్‌ భార్య! గుర్తుపట్టారా? (ఫొటోలు)

+5

ఎమ్మెల్సీ కవితకు మరో బిగ్ షాక్..

+5

టీ20 వరల్డ్‌కప్‌-2024కు ముందు భార్య అనుష్కతో కోహ్లి చక్కర్లు.. ఫొటోలు వైరల్‌

+5

హీరోయిన్‌ మూడో పెళ్లి.. తెలుగులోనూ నటించింది (ఫోటోలు)

+5

11 ఏళ్ల క్రితం విడిపోయిన స్టార్‌ కపుల్‌.. కుమారుడి కోసం (ఫొటోలు)