Breaking News

చంద్రబాబు భూ పిశాచిలా వ్యవహరిస్తున్నారు

Published on Thu, 08/20/2015 - 11:44

అనంతపురం : రాజధాని భూముల విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్న వైఖరిపై   సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ గురువారం అనంతపురంలో నిప్పలు చెరిగారు. ఈ వ్యవహారంలో చంద్రబాబు భూపిశాచిలా వ్యవహరిస్తూ రైతుల భూములను లాక్కుంటున్నారని ఆరోపించారు. 

ఆంధ్రప్రదేశ్కు ఎట్టి పరిస్థితుల్లో ప్రత్యేక ప్యాకేజీని అంగీకరించమని.... ప్రత్యేక హోదానే కావాలని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఏర్పడిన కరువు, ప్రత్యేక హోదాపై ఆగస్టు 22, 23 తేదీలల్లో కడపలో రాష్ట్ర స్థాయి సభలు నిర్వహిస్తామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా కరువు మండలాలను ప్రకటించాలని ఆయన చంద్రబాబు సర్కార్ను డిమాండ్ చేశారు.

అలాగే కరువు పీడిత గ్రామాలకు నీటిని సరఫరా చేయాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు. రాయలసీమలోని కరువును జాతీయ విపత్తుగా ప్రకటించాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు పేరు చార్జీషీటులో చేర్చినందున నిష్పక్షపాతంగా విచారణ జరగాలన్నారు. దోషులు ఎంతటివారైన కఠినంగా శిక్షించాలన్నారు.

ప్రత్యేక హోదాపై ఆగస్టు 29న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టనున్న బంద్కు తాము సానుకూలంగానే ఉన్నామన్నారు. వామపక్ష పార్టీలతో చర్చించి ఆ తర్వాత సంఘీభావం ప్రకటిస్తామని కె.రామకృష్ణ చెప్పారు.

#

Tags : 1

Videos

గ్యాస్ తాగుతూ బతుకుతున్న ఓ వింత మనిషి

మాధవి రెడ్డి పై అంజాద్ బాషా ఫైర్

ఒంటరిగా ఎదుర్కోలేక.. దుష్ట కూటమిగా..!

జమ్మూకశ్మీర్ లో కొనసాగుతున్న ఉగ్రవేట

నేడు యాదగిరి గుట్ట, పోచంపల్లిలో అందాల భామల పర్యటన

శత్రు డ్రోన్లపై మన భార్గవాస్త్రం

ప్రారంభమైన సరస్వతి పుష్కరాలు

మద్యం కేసులో బాబు బేతాళ కుట్ర మరోసారి నిరూపితం

సచిన్, విరాట్ తర్వాత నంబర్-4 పొజిషన్ ఎవరిది?

ఆపరేషన్ సిందూర్ తో మరోసారి లెక్క సరిచేసిన భారత్

Photos

+5

ఈ తీపి గుర్తులు మరిచిపోలేను‌.. ఫోటోలు విడుదల చేసిన శ్రీనిధి శెట్టి (ఫొటోలు)

+5

జాతరలో నిర్లక్ష్యం గంగమ్మ జాతరకు భారీగా భక్తులు..(ఫొటోలు)

+5

వరంగల్‌ : కాకతీయ వైభవాన్ని చూసి మురిసిన విదేశీ వనితలు (ఫొటోలు)

+5

Miss World2025: రామప్ప ఆలయంలో మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు

+5

Cannes Film Festival 2025: కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో మెరిసిన అందాల తారలు.. ఫోటోలు

+5

గంగమ్మ జాతరలో కీలక ఘట్టం..విశ్వరూప దర్శనంలో గంగమ్మ (ఫొటోలు)

+5

హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి బ్యూటిఫుల్ (ఫొటోలు)

+5

అంగరంగ వైభవంగా తిరుపతి గంగమ్మ జాతర..పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

+5

దారి వెంట నీరాజనం..‘జై జగన్‌’ అంటూ నినాదాలు (ఫొటోలు)

+5

#MissWorld2025: బ్యూటీ విత్‌ ఫన్‌..‘బుట్ట బొమ్మా’ పాటకు స్టెప్పులు (ఫొటోలు)