మాజీ సీఎం వైఎస్ జగన్ దెబ్బకు దిగొచ్చిన సర్కార్
Breaking News
వైఎస్సార్సీపీలో కీలక నియామకాలు
అల్లు అర్జున్ను అరెస్ట్ చేయడం కరెక్టే: పవన్ కల్యాణ్
ఓవరాక్షన్ చేస్తే తాట తీస్తాం.. హైదరాబాద్ సీపీ సీరియస్ వార్నింగ్
బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం
జానీ మాస్టర్‌కు బిగ్ షాక్.. నేషనల్ అవార్డ్ రద్దు
Breaking: ఇజ్రాయెల్‌పై ఇరాన్ మిస్సైళ్ల దాడి
Breaking: డొనాల్డ్ ట్రంప్‌పై కాల్పులు.. ఆస్పత్రికి తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
ప్రతిపక్ష హోదా ఇవ్వొద్దని ముందుగానే నిర్ణయించారా?.. అసెంబ్లీ స్పీకర్‌కు వైఎస్ జగన్ లేఖ
Breaking: అమెరికా అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకున్న బైడెన్
దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా కన్నుమూత
విహార యాత్రికులకోసం ప్రత్యేక ప్యాకేజీలు
Published on Thu, 09/01/2016 - 23:53
రాజమహేంద్రవరం సిటీ : విహార యాత్రలు చేయాలనుకునేవారికోసం ప్రత్యేక ప్యాకేజీలు రూపొందించినట్టు ఇండియన్ రైల్వే కేటరింగ్, టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ) డీజీఎం సంజీవయ్య తెలిపారు. రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్ వీఐపీ లాంజ్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన ఈ వివరాలు తెలిపారు. హాంకాంగ్, మకావ్, షెంజన్ పర్యటన కోసం 4 రాత్రులు, 5 పగళ్లతో అక్టోబరు 8–12 తేదీల మధ్య ప్యాకేజీ అందుబాటులో ఉంటుందన్నారు. దీనికింద ఒక్కొక్కరు రూ.73,419 చెల్లించాల్సి ఉంటుందన్నారు. అక్టోబర్ 21–24 తేదీల్లో 4 పగళ్లు, 3 రాత్రులతో గోవా ప్యాకేజ్ ఏర్పాటు చేశామన్నారు. దీనికి ఒక్కొక్కరు రూ.18,970 చెల్లించాలన్నారు. డిసెంబరు 10–14 తేదీల మ««దl్య శ్రీలంక టూర్ ఏర్పాటు చేశామన్నారు. నాలుగు రాత్రుళ్లు, 5 పగళ్లు ఉండే ఈ టూర్‌కు ఒక్కొక్కరు రూ.45,001 చెల్లించాలని వివరించారు. ఈ ప్రయాణం హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మొదలై తిరిగి అక్కడే ముగుస్తుందన్నారు. ప్రయాణ సమయంలో త్రీస్టార్ సౌకర్యాలతో అల్పాహారం, భోజనం అందిస్తామని తెలిపారు. వివరాలకు 0866 – 2752280, 97013 60632 ఫోన్ నంబర్లలో సంప్రదించవచ్చునని సంజీవయ్య వివరించారు. కార్యక్రమంలో సూపర్‌వైజర్ ప్రభాకరరావు, స్టేషన్ మేనేజర్ భమిడిపాటి సుబ్రమణ్యశాస్త్రి పాల్గొన్నారు.
#
Tags : 1