amp pages | Sakshi

భారీగా గుట్కా ప్యాకెట్లు స్వాధీనం

Published on Thu, 10/27/2016 - 20:36

జగ్గయ్యపేట అర్బన్‌ : వరుస దాడులు జరుగుతున్నప్పటికీ గుట్కా అక్రమ వ్యాపారం జోరు తగ్గలేదు. గురువారం పట్టణంలో పట్టణ ఎస్‌ఐ–2 ఎస్‌.ప్రియకుమార్‌ జరిపిన దాడుల్లో రూ 3 లక్షలకు పైగా విలువైన గుట్కా ప్యాకెట్లు, అనుమతి లేని బ్లాక్‌ అనే సిగరెట్లు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం... ఉదయం 8.30 సమయంలో పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు బలుసుపాడు రోడ్డులోని పాత వెంకటేశ్వరస్వామి ఆలయం సమీపంలో ఆటోను తనిఖీ చేశారు. ఆటో డ్రైవరు సమాచారంతో పాత కూరగాయల మార్కెట్‌ సందులో ఉన్న గుండా కాశయ్యకు చెందిన గోడౌన్‌పై ఎస్‌ఐ తన సిబ్బంది, వీఆర్వోలు రాంబాబు, వీఆర్‌ఏ శివలతో కలిసి దాడి చేశారు. గోడౌన్‌లో ఉన్న సుమారు తొమ్మిది గుట్కా పార్సిళ్లను సీజ్‌ చేశారు. అనంతరం వాటిని స్టేషన్‌కు తరలించారు. వీటి విలువ సుమారు రూ 3 లక్షలకుపైగా ఉన్నట్లు సమాచారం. గుండా కాశయ్య, సాంబయ్యపై కేసు నమోదు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. దాడుల్లో కానిస్టేబుళ్లు కృష్ణయ్య, నాగరాజు పాల్గొన్నారు.  సీఐ వైవిఎల్‌.లచ్చునాయుడు గుట్కాలు నిలువ ఉంచిన గోడౌన్‌ను పరిశీలించారు.
 

 

Videos

బెంగుళూరు రేవ్ పార్టీ... టీడీపీ,సోమిరెడ్డికి ఇచ్చిపడేసిన కాకాణి

తప్పుడు ఆరోపణలపై యాంకర్ శ్యామల పరువు నష్టం దావా

TG క్రేజ్ ..రవాణా శాఖకు ఒకే రోజు 40 లక్షల ఆదాయం

కాంగ్రెస్ పై హరీష్ రావు ఫైర్

వంగా గీతకు చేతులెత్తి మొక్కిన యాంకర్ శ్యామల

రేవ్ పార్టీలో యాంకర్ శ్యామల? వంగా గీత రియాక్షన్

ఎల్లో మీడియాపై యాంకర్ శ్యామల పరువు నష్టం దావా

ఈ ఫోటోలో వ్యక్తి కనబడుట లేదు: జోగి రమేష్

ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ భద్రతా చర్యలపై చర్చ

అడ్డదిడ్డంగా మాట్లాడుతున్న ప్రశాంత్ కిషోర్ ? పీకే నోట బాబు పలుకులు

Photos

+5

SRH: అతడి లాగే నన్నూ ఆశీర్వదించండి: అభిషేక్‌ తల్లికి అర్ష్‌దీప్‌ రిక్వెస్ట్‌ (ఫొటోలు)

+5

రజనీకాంత్‌ మనవడి బర్త్‌డే సెలబ్రేషన్స్‌.. క్రికెట్‌ థీమ్‌తో.. (ఫోటోలు)

+5

Hakim Shajahan Marriage: హీరోయిన్‌ను పెళ్లాడిన మలయాళ హీరో.. ఎంతో సింపుల్‌గా! (ఫోటోలు)

+5

Indraja Sankar Birthday Photos: విజిల్‌ నటి బర్త్‌డే సెలబ్రేషన్స్‌.. పెళ్లి తర్వాత భర్తతో తొలిసారి (ఫోటోలు)

+5

SRH Vs PBKS Highlights Photos: సన్ రైజర్స్ vs పంజాబ్..తారలతో నిండిన ఉప్పల్ స్టేడియం (ఫోటోలు)

+5

Shobha Shetty: కొత్తింటి కల సాకారం చేసుకున్న బిగ్‌బాస్‌ బ్యూటీ.. ప్రియుడితో గృహప్రవేశం (ఫోటోలు)

+5

నటుడు చందు కన్నుమూత.. వైరలవుతున్న పెళ్లి ఫోటోలు

+5

Afghanistan Floods: అఫ్ఘాన్‌ కొట్టుకుపోయింది.. మిగిలింది శూన్యమే (ఫొటోలు)

+5

ఏపీలో గెలిచేదెవరు? జడ్జ్‌మెంట్‌ డే 4th June (ఫొటోలు)

+5

చందు వైఫ్ షాకింగ్ కామెంట్స్