Breaking News

మత సామరస్యాన్ని చాటుదాం

Published on Wed, 08/30/2017 - 22:24

– 2న గణేష్‌ నిమజ్జనం, బక్రీదు వేడుకలు
– హిందూ–ముస్లింలు శాంతియుతంగా మెలగాలి
– ఐక్యతా స్ఫూర్తితో జిల్లా కీర్తిని ఇనుమడింపజేయాలి
– శాంతి ర్యాలీలో జిల్లా కలెక్టర్, ఎస్పీ
 
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): సెస్టెంబర్‌ 2న వినాయక నిమజ్జనం, బక్రీదు వేడుకలను శాంతియుతంగా నిర్వహించి మత సామరస్యాన్ని చాటాలని జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ, ఎస్పీ గోపీనాథ్‌జట్టి సూచించారు. íహిందూ–ముస్లింలు ఐక్యతా స్ఫూర్తితో కర్నూలు జిల్లా కీర్తిని ఇనుమడింపజేయాలన్నారు. బుధవారం జమ్మిచెట్టు నుంచి తెలుగు తల్లి విగ్రహం వరకు హిందూ–ముస్లింలు భాయి భాయి నినాదాలతో శాంతి ర్యాలీ నిర్వహించారు. జమ్మిచెట్టు వద్ద అన్ని వర్గాల ప్రజలతో సమావేశమై న జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ, ఎస్పీ గోపీనాథ్‌జెట్టీ శాంతి హితోపదేశం చేసి శాంతి కపోతాలు, బెలూన్లను ఎగుర వేశారు.
 
అనంతరం ర్యాలీ చిత్తారి వీధి జంక‌్షన్, కర్నూలు వన్‌ టౌన్‌ పోలీసు స్టేషన్‌ మీదుగా పూలబజార్, గడియారం ఆసుపత్రి, పెద్దమార్కెట్, అంబేడ్కర్‌ సర్కిల్, కొండారెడ్డి బురుజు, తెలుగు తల్లి విగ్రహం వరకు సాగింది. ర్యాలీలో పాల్గొన్న హిందూ–ముస్లింలు సోదరులుగా మెలుగుతామని ప్లకార్డులు ప్రదర్శించారు. శాంతి ర్యాలీలో అడిషనల్‌ ఎస్పీలు షేక్‌ షాక్షావలి, ఐ.వెంకటేష్, డీఎస్పీ రమణామూర్తి, సీఐలు ములకన్న, నాగరాజుయాదవ్, డేగల ప్రభాకర్, కృష్ణయ్య, బి.శ్రీనివాసరావు, మహేశ్వరరెడ్డి, ఆర్‌ఐలు రంగముని, రామకృష్ణ, ముస్లిం మత పెద్దలు, గణేష్‌ కేంద్ర మహోత్సవ కమిటీసభ్యులు పాల్గొన్నారు. 
 
నిమజ్జనానికి సుంకేసుల నీరు వస్తుంది
 సెప్టెంబర్‌ 2న కర్నూలులో నిర్వహించే గణేష్‌ నిమజ్జనానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని  కలెక్టర్‌ ఎస్‌.సత్యనారాయణ వివిధ శాఖల అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్‌ తన క్యాంపు కార్యాలయంలో గణేష్‌ నిమజ్జన ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. 2వ తేదీ ఉదయంలోపు కర్నూలుకు చేరే విధంగా సుంకేసుల జలాశయం నుంచి నీటిని విడుదల చేయాలని నీటిపారుదల శాఖ ఎస్‌ఈని ఆదేశించారు. నీటి కొరత ఉన్నందున కేసీలో నీరు ముందుకు వెళ్లకుండా ఇసుక బస్తాలు, అడ్డుగోడలు ఏర్పాట్లు చేయాలన్నారు.
 
నిమజ్జనం సందర్భంగా ప్రధాన కూడళ్లలో సీసీ కెమెరాలు, లైటింగ్‌ సదుపాయం, నగరంలో పారిశుద్ధ్య పనులు, తాగు నీరు, వైద్య శిబిరాలు, విగ్రహాల నిమజ్జనానికి క్రేన్‌లు ఏర్పాటు చేయాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. సమావేశంలో నీటిపారుదల శాఖ ఎస్‌ఈ చంద్రశేఖర్‌రావు, నగరపాలక సంస్థ కమిషనర్‌ హరినాథరెడ్డి, డీఎస్‌పీ రమణమూర్తి, ఆర్‌అండ్‌బీ ఈఈ జయరామిరెడ్డి, గణేష్‌ మహోత్సవ కేంద్ర సమితి ప్రతినిధులు కిష్టన్న, బాలసుబ్రమణ్యం, సందడి సుధాకర్, కాళంగి నరసింహవర్మ తదితరులు పాల్గొన్నారు. 
 

Videos

అండర్ గ్రౌండ్ లో అవినీతి తీగ

హైదరాబాద్ శిల్పకళావేదికలో మిస్ వరల్డ్ టాలెంట్ ఫైనల్

Watch Live: వైఎస్ జగన్ కీలక ప్రెస్ మీట్

వాషింగ్టన్ డీసీలో కాల్పుల కలకలం

దీన్నే నమ్ముకొని ఉన్నాం.. మా పొట్టలు కొట్టొద్దు.. ఎండీయూ ఆపరేటర్ల ధర్నా

నా పర్మీషన్ తీసుకోవాల్సిందే!

ఢిల్లీ-శ్రీనగర్ విమానానికి తప్పిన ప్రమాదం

ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు బండారం బయటపడుతుందనే ఉరవకొండకి రాలేదు

జనసేనపై పిఠాపురం టీడీపీ నేతలు సంచలన వ్యాఖ్యలు..

ఏందిరయ్యా ఏంజేతున్నావ్

Photos

+5

HHVM మూవీ ఈవెంట్‌లో మెరిసిన హీరోయిన్ నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

Cannes 2025 : ‘సింధూరం’తో మెరిసిన ఐశ్వర్య (ఫోటోలు)

+5

ప్రసాద్ ఐమ్యాక్స్‌ : ‘రానా నాయుడు సీజన్-2’ టీజర్‌ ఈవెంట్‌ రానా సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం..భారీగా ట్రాఫిక్ జామ్ (ఫొటోలు)

+5

హనుమాన్‌‌ జయంతి .. జనసంద్రంగా కొండగట్టు అంజన్న క్షేత్రం (ఫొటోలు)

+5

విజయ్‌ సేతుపతి 'ఏస్‌' మూవీ ప్రీరిలీజ్‌ వేడుక (ఫొటోలు)

+5

'హరి హర వీరమల్లు' సాంగ్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

కాన్స్‌లో అదితి : ఆరుగజాల చీర, సింధూరంతో ముగ్ధమనోహరంగా (ఫొటోలు)

+5

కుమారుడి టాలెంట్‌ చూసి మురిసిపోతున్నడైరెక్టర్‌ సుకుమార్ భార్య (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ ఫిలిం ఫెస్టివల్‌లో అనామిక ఖన్నా బ్యాక్‌లెస్ గౌనులో జాన్వీ కపూర్‌ (ఫోటోలు)