దళిత బహుజన సాహిత్యానికి తీరని అన్యాయం

Published on Mon, 08/22/2016 - 00:42

దళిత బహుజన సాహిత్యానికి తీరని అన్యాయం
  • l‘బహుజన సాహిత్యం రాజకీయ విముక్తి’ సదస్సులో కవులు, రచయితలు, మేధావులు ్ఠ
హన్మకొండ కల్చరల్‌ : విలువైన దళిత బహుజనుల సాహిత్యం మరింత విస్త­ృత స్థాయిలో రావాలని ఓయూ విశ్రాంతాచార్యులు, సెంటర్‌ ఫర్‌ దళిత్‌ స్టడీస్‌ డైరెక్టర్, ‘మై ఫాదర్‌ బాలయ్య’ పుస్తక రచయిత ఆచార్య వై.బీ.సత్యనారాయణ అభిప్రాయపడ్డారు. బాబాసాహెబ్‌ డాక్టర్‌ అంబేద్కర్‌ 125వ జయంతి సందర్భంగా ‘బహుజన సాహిత్యం – రాజకీయ విముక్తి’ అంశంపై బహుజన రచయితల సంఘం ఆధ్వర్యంలో హన్మకొండ కిషన్‌పురలోని మాస్టర్జీ హైస్కూల్‌లో ఆదివారం సాహిత్య సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా అన్వర్‌ అధ్యక్షతన జరిగిన మొదటి సమావేశంలో ఆచార్య వై.బీ.సత్యనారాయణ, జి.లక్ష్మీనర్సయ్య, డాక్టర్‌ పం తంగి వెంకటేశ్వర్లు, సుందర్‌రాజు పాల్గొన్నారు. సమావేశంలో సత్యనారాయణ మాట్లాడుతూ దళిత బహుజన కవులు సమానత్వాన్ని కోరుకుంటూ కుల నిర్మూలనకు బాధ్యతతో సాహిత్యాన్ని సృష్టిస్తున్నారని అన్నారు. మరోవైపు పాలకులు అన్నివర్గాల సాహిత్యాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవాలని కుట్ర పన్నుతున్నారని విమర్శించారు. 
తెలంగాణ సాహిత్యానికి అన్యాయం
సమైక్య రాష్ట్రంలో తెలంగాణ దళిత బహుజన సాహిత్యానికి తీరని అన్యాయం జరిగిందని రచయిత, పరిశోధకులు సంగిశెట్టి శ్రీనివాస్‌ అన్నా రు. మధ్యాహ్నం యాకుబ్‌ అధ్యక్షతన జరిగిన రెండవ సమావేశంలో అతిథులుగా సంగిశెట్టి శ్రీనివాస్,స్కైబాబా,నలిగంటి శరత్, తక్కెళ్ల బాలరాజు, సాయిని నరేందర్,  డాక్టర్‌ చింతం ప్రవీణ్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంగిశెట్టి శ్రీనివాస్‌ మాట్లాడారు. సాయంత్రం డాక్టర్‌ పసునూరి రవీందర్‌ అధ్యక్షతన జరిగిన ముగిం పు సమావేశంలో ఆచార్య నన్నె రామస్వామి, డాక్టర్‌ ఎర్ర శ్రీధర్‌ రాజు, డాక్టర్‌ మల్లేశ్వర్‌రావు, పి.చంద్, సూర్యపల్లి శ్రీనివాస్‌ ప్ర సంగించారు. సొన్నాయిల కృష్ణవేణి, ఎలి కట్టె శ్రీనివాస్, చింతం నాగరాజు, దానబోయిన రవి సమన్వయకర్తలుగా వ్యవహరించారు.  

#

Tags

Videos

ఎగ్జిట్ పోల్స్ పై KK రాజు రియాక్షన్

ఎగ్జిట్ పోల్స్ పై రాయదుర్గం ఎమ్మెల్యే రియాక్షన్

ఫోన్ ట్యాపింగ్ పై కోమటి రెడ్డి, హరీష్ రావు మధ్య మాటల యుద్ధం

వైఎస్సార్సీపీ విజయం ఖాయమైపోయిందని పార్టీ నేతల ధీమా

POK విదేశీ భూ భాగమని అంగీకరించిన పాకిస్థాన్ ప్రభుత్వం

ఎక్కువ రోజులు కాంగ్రెస్ అధికారంలో ఉండదు: కేసీఆర్

YSRCP న్యాయ పోరాటం

దీదీకి మోదీ చెక్ పెట్టనున్నారా..!

బీఆర్ఎస్ బాటలోనే కాంగ్రెస్.. రేవంత్ భవిష్యత్తు ప్రశ్నార్థకం..!

సల్మాన్ ఖాన్ ను చంపేందుకు తిరుగుతున్న గ్యాంగ్ స్టార్

Photos

+5

తెలంగాణ రాష్ట్ర గీతం పాడిన సింగర్‌ హారిక నారాయణ్‌ (ఫోటోలు)

+5

సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు (ఫొటోలు)

+5

త్వరలో పెళ్లి.. వెకేషన్‌లో చిల్‌ అవుతున్న సిద్దార్థ్‌- అదితి (ఫోటోలు)

+5

T20WC2024 USA vs Canada Highlights: కెనడా జట్టుపై అమెరికా సంచలన విజయం (ఫొటోలు)

+5

రెండేళ్లలో ఎన్నో ఎత్తుపళ్లాలు చూశాం.. ఇక ముందు: దీపక్‌ చహర్‌ భావోద్వేగం (ఫొటోలు)

+5

T20 WC 2007: ధోని నమ్మకం నిలబెట్టిన వరల్డ్‌కప్‌ విజేత.. ఇప్పుడేం చేస్తున్నారో తెలుసా? (ఫోటోలు)

+5

Kiccha Sudeep Daughter Sanvi: కిచ్చా సుదీప్‌ కూతురు ఇప్పుడెలా ఉందో చూశారా? (ఫోటోలు)

+5

Dimple Hayathi Visits Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టాలీవుడ్‌ హీరోయిన్‌ డింపుల్ హయాతి (ఫొటోలు)

+5

Allari Naresh-Virupa: తొమ్మిదవ పెళ్లి రోజు.. అల్లరి నరేశ్‌ భార్యను చూశారా? (ఫోటోలు)

+5

తిరుమలలో బిగ్‌బాస్‌ సందీప్‌ 10వ పెళ్లి రోజు సెలబ్రేషన్స్‌ (ఫోటోలు)