వైద్య వృత్తికి వెళుతూ విధి వక్రించి..

Published on Wed, 09/20/2017 - 00:13

ఫిజియోథెరపిస్ట్‌ దుర్మరణం
దొమ్మేరులో ఘటన
బంధువులు, స్థానికుల ఆందోళన
7 గంటలపాటు స్తంభించిన ట్రాఫిక్‌
కొవ్వూరు రూరల్‌: కష్టాల కడలి నుంచి గట్టెక్కిస్తాడనుకున్న కొడుకు ఇంటి నుంచి బయటకు వచ్చిన నిమిషాల వ్యవధిలోనే విగతి జీవిగా మారతాడని ఆ కన్నవాళ్లు ఊహించలేదు. అష్టకష్టాలు పడి ఉన్నత చదువులు చదివించుకుని కుటుంబానికి ఆసరాగా ఉంటాడనుకున్న పెద్దకొడుకు కానరాని లోకాలకు వెళ్లడంతో వారి దుఃఖం కట్టలు తెంచుకుంది. ఆస్పత్రికి వెళ్లి రోగులకు సేవలు అందించి వస్తానమ్మా అని ఇంటి నుంచి బయలుదేరిన పావు గంటలోనే కానరాని లోకాలకు వెళ్లాడని తెలిసి ఆ తల్లి గుండె చెరువయ్యింది. గుర్తుతెలియని వాహనం మృత్యురూపంలో ఎదురుగా వచ్చి ఢీకొట్టడంతో సొంత ఊరిలోనే ఊపిరిలొదిలాడు కొవ్వూరు మండలం దొమ్మేరుకు చెందిన ఫిజియోథెరపిస్ట్‌ తూతా రమేష్‌ (25). మంగళవారం ఉదయం 10.30 గంటల ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతితో గ్రామం శోకసంద్రంగా మునిగిసోయింది. సంఘటనా ప్రాంతంలో మృతుడి కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. వివరాలిలా ఉన్నాయి.. దొమ్మేరులోని అనంతలక్ష్మి కాలనీలో నివాసముంటున్న వ్యవసాయ కూలి వెంకటరమణ, సీత దంపతులకు ఇద్దరు కుమారులు. వీరిలో పెద్ద కుమారుడు రమేష్‌ను కష్టపడి ఉన్నత చదువులు చదివించారు. గతేడాది ఫిజియోథెరపిస్ట్‌ కోర్సు పూర్తిచేసుకున్న రమేష్‌ రాజానగరం జీఎస్‌ఎల్‌ ఆస్పత్రిలో పనిచేస్తున్నాడు. రోజూ మాదిరిగా మంగళవారం ఉదయం ఇంటి నుంచి విధి నిర్వహణ నిమిత్తం రాజానగరం వెళుతుండగా దొమ్మేరు ప్రధాన సెంటర్‌లో ఎదురుగా వస్తున్న గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. భారీ వాహనాల రాకతో ప్రాణాలకు రక్షణ లేకుండా పోతుందని, తక్షణమే మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ బంధువులు, స్థానికులు మృతదేహం వద్ద టెంట్టు వేసి రాస్తారోకో చేశారు. ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకూ ఆందోళన సాగింది. దీంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ స్తంభించింది. మృతుడి బంధువులు, ఆందోళనకారులను బలవంతంగా తొలగించి రమేష్‌ మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం కొవ్వూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. 
 

Videos

తిరుమలలో వైఎస్ఆర్ సీపీ నేతలు

కొందరు చిల్లర రాజకీయాల కోసం తెలంగాణ ఉద్యమాన్ని వాడుకున్నారు

ఏపీ ఎగ్జిట్ పోల్స్ పై మల్లాది విష్ణు రియాక్షన్

ఏపీ ఎగ్జిట్ పోల్స్ పై ఆర్కే రోజా రియాక్షన్

దేశవ్యాప్తంగా పెరిగిన టోల్ చార్జీలు..

తెలంగాణ భవన్ లో ఘనంగా రాష్ట్ర అవతరణ వేడుకలు

బాహుబలి వర్సెస్ బుజ్జి

హిమాలయాల్లో రజినీకాంత్..

తెలంగాణ ఆత్మగౌరవానికి పదేళ్ల పట్టాభిషేకం

భారీ ఎత్తున సెట్ నిర్మాణం.. సెట్ లో సినిమా మొత్తం..?

Photos

+5

త్వరలో పెళ్లి.. వెకేషన్‌లో చిల్‌ అవుతున్న సిద్దార్థ్‌- అదితి (ఫోటోలు)

+5

T20WC2024 USA vs Canada Highlights: కెనడా జట్టుపై అమెరికా సంచలన విజయం (ఫొటోలు)

+5

రెండేళ్లలో ఎన్నో ఎత్తుపళ్లాలు చూశాం.. ఇక ముందు: దీపక్‌ చహర్‌ భావోద్వేగం (ఫొటోలు)

+5

T20 WC 2007: ధోని నమ్మకం నిలబెట్టిన వరల్డ్‌కప్‌ విజేత.. ఇప్పుడేం చేస్తున్నారో తెలుసా? (ఫోటోలు)

+5

Kiccha Sudeep Daughter Sanvi: కిచ్చా సుదీప్‌ కూతురు ఇప్పుడెలా ఉందో చూశారా? (ఫోటోలు)

+5

Dimple Hayathi Visits Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టాలీవుడ్‌ హీరోయిన్‌ డింపుల్ హయాతి (ఫొటోలు)

+5

Allari Naresh-Virupa: తొమ్మిదవ పెళ్లి రోజు.. అల్లరి నరేశ్‌ భార్యను చూశారా? (ఫోటోలు)

+5

తిరుమలలో బిగ్‌బాస్‌ సందీప్‌ 10వ పెళ్లి రోజు సెలబ్రేషన్స్‌ (ఫోటోలు)

+5

భర్తతో కలిసి క్రొయేషియా ట్రిప్‌లో బిజీగా బ్యాడ్మింటన్‌ స్టార్‌.. స్టన్నింగ్‌ లుక్స్‌ (ఫొటోలు)

+5

టీ20 వరల్డ్‌కప్‌-2024: భర్త క్రికెట్‌తో.. భార్య యాంకరింగ్‌తో బిజీ.. క్యూట్‌ కపుల్‌(ఫొటోలు)