లెక్చరర్‌ వేధింపులు- విద్యార్థి ఆత్మహత్య

Published on Tue, 12/05/2017 - 02:57

దమ్మపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం లింగాలపల్లికి చెందిన డిగ్రీ విద్యార్థిని చాపా కృష్ణ ప్రియాంక(19) సోమవారం ఆత్మహత్య చేసుకుంది. ఆమె భద్రాచలంలో చదువుకుంటున్న ప్రైవేట్‌ డిగ్రీ కళాశాల అధ్యాపకుడు వేధించడంతో ఆత్మహత్య చేసుకుందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నా రు. లింగాలపల్లికి చెందిన చాపా సుబ్బారావు, అరుణల పెద్ద కుమార్తె కృష్ణ ప్రియాంక భద్రాచలంలోని ఒక ప్రైవేట్‌ డిగ్రీ కళాశాలలో బీకాం ద్వితీయ సంవత్సరం చదువుతోంది. తల్లి అనారోగ్యంగా ఉండటం తో శనివారం ఇంటికి వచ్చి.. ముభావంగా గడిపింది. ఆదివారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఎలుకల మందు తాగింది. తల్లిదండ్రులు సత్తుపల్లిలోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ సోమ వారం తెల్లవారుజామున మృతి చెందింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ జలకం ప్రవీణ్‌ తెలిపారు. 

విద్యార్థిని ఆత్మహత్యాయత్నం 
మధిర: యూనిట్‌ పరీక్షల్లో మాస్‌ కాపీయింగ్‌కు పాల్పడుతోందని ఉపాధ్యాయురాలు మందలించడంతో ఓ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన ఖమ్మం జిల్లా మధిరలో సోమవారం జరిగింది. ఆత్కూరుకు చెందిన బొడ్డు దివ్య తన అమ్మమ్మ ఇంటివద్ద ఉంటూ మధిరలోని టీవీఎం పాఠశాలలో టెన్త్‌ చదువుతోంది. సోమవారం దివ్య యూనిట్‌ పరీక్ష రాస్తుండగా.. ఆమె కూర్చున్న చోట స్లిప్‌ ఉండటాన్ని టీచర్‌ గుర్తించారు. స్లిప్‌ను, దివ్య సమాధాన పత్రాన్ని పరిశీలించగా.. చేతిరాత పోలి ఉండటంతో టీచర్‌ మందలించారు. మనస్తాపానికి గురైన దివ్య మధ్యాహ్నం గ్రామానికి వెళ్లి ఖాళీ పురుగు మందు డబ్బాలో నీళ్లు పోసు కుని తాగింది. టీచర్‌ జరిగిన çఘటనను హెచ్‌ఎం నారాయణ దృష్టికి తీసుకెళ్లారు. దివ్య తాతయ్య ఫ్రాన్సిస్‌కు హెచ్‌ఎం ఫోన్‌ చేసి.. సమాచారం అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం దివ్య మధిర ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.   

Videos

హిమాచల్‌ ప్రదేశ్ లో అత్యధిక ఓటింగ్ శాతం

ముగిసిన ప్రధాని మోదీ ధ్యానం

మళ్లీ YSRCPదే.. డా. మునిబాబు గ్రౌండ్ రిపోర్ట్

ముగిసిన సీఎం జగన్ విదేశీ పర్యటన.. గన్నవరంలో ఘన స్వాగతం

మా పెన్షన్లు అడ్డుకున్న చంద్రబాబు ఇక రాకూడదు

ఫోన్ లో ఫోటోలు చూసి షాక్..బయటపడ్డ సంచలన నిజాలు

జయ జయహే తెలంగాణ గీతం ఆవిష్కరించనున్న సీఎం రేవంత్ రెడ్డి

చంద్రబాబు విదేశీ పర్యటనను గోప్యంగా ఉంచాల్సిన అవసరం ఏముంది ?

జర్ర ఆగరాదే..! చాలా స్మార్ట్‌ గురూ!

గొర్రెల పంపిణీలో 700 కోట్ల భారీ స్కాం

Photos

+5

T20 WC 2007: ధోని నమ్మకం నిలబెట్టిన వరల్డ్‌కప్‌ విజేత.. ఇప్పుడేం చేస్తున్నారో తెలుసా? (ఫోటోలు)

+5

Kiccha Sudeep Daughter Sanvi: కిచ్చా సుదీప్‌ కూతురు ఇప్పుడెలా ఉందో చూశారా? (ఫోటోలు)

+5

Dimple Hayathi Visits Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టాలీవుడ్‌ హీరోయిన్‌ డింపుల్ హయాతి (ఫొటోలు)

+5

Allari Naresh-Virupa: తొమ్మిదవ పెళ్లి రోజు.. అల్లరి నరేశ్‌ భార్యను చూశారా? (ఫోటోలు)

+5

తిరుమలలో బిగ్‌బాస్‌ సందీప్‌ 10వ పెళ్లి రోజు సెలబ్రేషన్స్‌ (ఫోటోలు)

+5

భర్తతో కలిసి క్రొయేషియా ట్రిప్‌లో బిజీగా బ్యాడ్మింటన్‌ స్టార్‌.. స్టన్నింగ్‌ లుక్స్‌ (ఫొటోలు)

+5

టీ20 వరల్డ్‌కప్‌-2024: భర్త క్రికెట్‌తో.. భార్య యాంకరింగ్‌తో బిజీ.. క్యూట్‌ కపుల్‌(ఫొటోలు)

+5

పెళ్లికి ముందే ప్రెగ్నెంట్‌ అంటూ కామెంట్స్‌.. నా భర్త అడిగేవాడన్న హీరోయిన్!(ఫొటోలు)

+5

ఈ స్టన్నింగ్‌ బ్యూటీ.. టీమిండియా స్టార్‌ భార్య! గుర్తుపట్టారా? (ఫొటోలు)

+5

ఎమ్మెల్సీ కవితకు మరో బిగ్ షాక్..