హంతకుడి డైరీలో సంచలన విషయాలు..

Published on Sat, 06/30/2018 - 16:52

బెంగళూరు : ప్రముఖ జర్నలిస్టు గౌరీ లంకేశ్‌ హత్య కేసులో అనుమానితుడు అమోల్ కలే నుంచి స్వాధీనం చేసుకున్న డైరీలో నుంచి పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయి.   గౌరీ లంకేశే కాకుండా  మరో 36 మంది ప్రముఖులను కూడా లక్ష్యంగా చేసుకున్నట్లు డైరీలో రాసుకున్నారు. ఈ ఆపరేషన్‌ కోసం 50 మంది కరుడుగట్టిన హిందుత్వవాద షూటర్లను కూడా రిక్రూట్‌మెంట్‌ చేసుకున్నారు. ఈ విషయాలను డైరీలో కోడ్‌ భాషలో రాసుకున్నటు సిట్‌ అధికారులు వెల్లడించారు.

హిందూత్వ వాదానికి వ్యతిరేకంగా మాట్లాడిన వారే వీరి టార్గెట్‌. వీరి టార్గెట్‌లోమహారాష్ట్ర, కర్ణాటకలకు చెందిన ప్రముఖులే ఎక్కువగా ఉన్నారు. కర్ణాటకు చెందిన 10 మంది ప్రముఖులను హత్య చేయాలని డైరీలో రాసుకున్నారు. హత్యల కోసం 50 మందిని రిక్రూట్‌ చేసుకొని వారికి గన్స్‌, తుపాకీ, పెట్రోల్‌ బాంబ్‌ పేల్చడం టాంటి వాటిలో శిక్షణ కూడా ఇచ్చారని డైరీలో కోడ్‌ భాషలో రాసుకున్నారని ఓ అధికారి తెలిపారు. 

గతేడాది సెప్టెంబర్‌ 5న తన నివాసం వద్ద ఉన్న గౌరీలంకేశ్‌పై బైకుపై వచ్చిన దుండగులు విచక్షణా రహితంగా కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే చనిపోయారు. సుదీర్ఘ దర్యాప్తు తరువాత సిట్‌ అధికారులు కేసును ఛేదించి కీలక నిందితులను పట్టుకోగలిగారు. బీజాపుర జిల్లా సిందగి తాలూకాకు చెందిన పరశురామ్‌ వాగ్మారే ఈ హత్య కేసులో కీలక నిందితుడిగా తేల్చారు. మిగిలిన ముగ్గురు వ్యక్తులు గౌరి హత్యకు పథకం రూపొందించారు. గౌరీ లంకేశ్‌ హత్యకోసం వాగ్మారే రూ.3000 అడ్వాన్స్‌గా తీసుకున్నారు. హత్యకు ముందు రోజు రూ. 10,000 తీసుకున్నారని విచారణలో వాగ్మారే తెలిపారు.

Videos

హిమాచల్‌ ప్రదేశ్ లో అత్యధిక ఓటింగ్ శాతం

ముగిసిన ప్రధాని మోదీ ధ్యానం

మళ్లీ YSRCPదే.. డా. మునిబాబు గ్రౌండ్ రిపోర్ట్

ముగిసిన సీఎం జగన్ విదేశీ పర్యటన.. గన్నవరంలో ఘన స్వాగతం

మా పెన్షన్లు అడ్డుకున్న చంద్రబాబు ఇక రాకూడదు

ఫోన్ లో ఫోటోలు చూసి షాక్..బయటపడ్డ సంచలన నిజాలు

జయ జయహే తెలంగాణ గీతం ఆవిష్కరించనున్న సీఎం రేవంత్ రెడ్డి

చంద్రబాబు విదేశీ పర్యటనను గోప్యంగా ఉంచాల్సిన అవసరం ఏముంది ?

జర్ర ఆగరాదే..! చాలా స్మార్ట్‌ గురూ!

గొర్రెల పంపిణీలో 700 కోట్ల భారీ స్కాం

Photos

+5

T20 WC 2007: ధోని నమ్మకం నిలబెట్టిన వరల్డ్‌కప్‌ విజేత.. ఇప్పుడేం చేస్తున్నారో తెలుసా? (ఫోటోలు)

+5

Kiccha Sudeep Daughter Sanvi: కిచ్చా సుదీప్‌ కూతురు ఇప్పుడెలా ఉందో చూశారా? (ఫోటోలు)

+5

Dimple Hayathi Visits Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టాలీవుడ్‌ హీరోయిన్‌ డింపుల్ హయాతి (ఫొటోలు)

+5

Allari Naresh-Virupa: తొమ్మిదవ పెళ్లి రోజు.. అల్లరి నరేశ్‌ భార్యను చూశారా? (ఫోటోలు)

+5

తిరుమలలో బిగ్‌బాస్‌ సందీప్‌ 10వ పెళ్లి రోజు సెలబ్రేషన్స్‌ (ఫోటోలు)

+5

భర్తతో కలిసి క్రొయేషియా ట్రిప్‌లో బిజీగా బ్యాడ్మింటన్‌ స్టార్‌.. స్టన్నింగ్‌ లుక్స్‌ (ఫొటోలు)

+5

టీ20 వరల్డ్‌కప్‌-2024: భర్త క్రికెట్‌తో.. భార్య యాంకరింగ్‌తో బిజీ.. క్యూట్‌ కపుల్‌(ఫొటోలు)

+5

పెళ్లికి ముందే ప్రెగ్నెంట్‌ అంటూ కామెంట్స్‌.. నా భర్త అడిగేవాడన్న హీరోయిన్!(ఫొటోలు)

+5

ఈ స్టన్నింగ్‌ బ్యూటీ.. టీమిండియా స్టార్‌ భార్య! గుర్తుపట్టారా? (ఫొటోలు)

+5

ఎమ్మెల్సీ కవితకు మరో బిగ్ షాక్..