Breaking News

జోరు తగ్గిన రిటైల్

Published on Sat, 01/24/2015 - 01:19

హైదరాబాద్: దేశ వ్యాప్తంగా రిటైల్ వ్యాపారంలో జోరు తగ్గింది. నిర్మాణాల్లో జాప్యం కారణంగా ఏడు ప్రధాన నగరాల్లోని షాపింగ్ మాల్స్‌లో రిటైల్ విస్తీర్ణం 79 శాతం మేర అంటే 10 లక్షల చ.అ. తగ్గిందని అమెరికా ప్రాపర్టీ కన్సల్టెన్సీ కంపెనీ సీబీఆర్‌ఈ ఓ ప్రకటనలో పేర్కొంది. అయితే సరఫరా తగ్గటంతో ఉన్న షాపుల అద్దెలు మాత్రం స్వల్పంగా పెరిగాయని తెలిపింది. 2013లో ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, పుణే నగరాల్లో రిటైల్ విస్తీర్ణం 4.7 మిలియన్ చ.అ.గా ఉంది.

హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరులోని కొన్ని ప్రముఖ రిటైల్ ప్రాజెక్ట్‌లు గతేడాది చివరకు పూర్తి అవుతాయని భావించినప్పటికీ నిర్మాణ  పనుల్లో జాప్యం కారణంగా ఇప్పటికీ పూర్తి కాలేదని సీబీఆర్‌ఈ నివేదిక వెల్లడించింది. స్థిరాస్తి రంగంలో వృద్ధి తగ్గడం, పెద్ద మొత్తంలో నిధులు విడుదల చేయని బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, కొనుగోళ్లు మందగించడం వంటివి కారణంగా పేర్కొంది. ఇదిలా ఉంటే ఈ ఏడాది దేశంలో బ్రూక్స్ బ్రదర్స్, స్టార్‌బక్స్, మైకెల్ కోర్స్, బర్గర్ కంపెనీ తదితర జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు తమ వ్యాపారాన్ని విస్తరించేందుకు సన్నాహాలు చేస్తోందని చెప్పింది. షియోమి, పేపర్ డాల్స్, బర్టన్ తదితర కంపెనీలు దేశీయ ఆన్‌లైన్ దిగ్గజాలతో కలసి వ్యాపారం చేయటంతో ఆన్‌లైన్ రిటైల్ విస్తీర్ణం బాగా పెరిగిందని నివేదిక చెబుతోంది.
 
 

Videos

అనసూయ ఇంట మరో శుభకార్యం.. పెద్ద కుమారుడి ఉపనయన వేడుక

రామ్ చరణ్ నెక్స్ట్ మూవీ త్రివిక్రమ్ తో కాదు.. సుకుమార్ తోనే ..

అల్లు అర్జున్ లేకుండా ఆర్య 3

చంద్రబాబుకు విజయసాయి రెడ్డి అమ్ముడుపోయాడు

వార్ 2 డైరెక్టర్ పై మండిపడుతున్న Jr. NTR ఫ్యాన్స్.. కారణం అదేనా

స్కాంలకు పరాకాష్ట అమరావతి పేరుతో దోపిడీనే : వైఎస్ జగన్

ఈనాడు టాయిలెట్ పేపర్ కి ఎక్కువ.. టిష్యూ పేపర్ కి తక్కువ..

చంద్రబాబు అప్పుల చిట్టా.. ఆధారాలతో బయటపెట్టిన వైఎస్ జగన్

మన యుద్ధం చంద్రబాబు ఒక్కడితో కాదు..!

అండర్ గ్రౌండ్ లో అవినీతి తీగ

Photos

+5

HHVM మూవీ ఈవెంట్‌లో మెరిసిన హీరోయిన్ నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

Cannes 2025 : ‘సింధూరం’తో మెరిసిన ఐశ్వర్య (ఫోటోలు)

+5

ప్రసాద్ ఐమ్యాక్స్‌ : ‘రానా నాయుడు సీజన్-2’ టీజర్‌ ఈవెంట్‌ రానా సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం..భారీగా ట్రాఫిక్ జామ్ (ఫొటోలు)

+5

హనుమాన్‌‌ జయంతి .. జనసంద్రంగా కొండగట్టు అంజన్న క్షేత్రం (ఫొటోలు)

+5

విజయ్‌ సేతుపతి 'ఏస్‌' మూవీ ప్రీరిలీజ్‌ వేడుక (ఫొటోలు)

+5

'హరి హర వీరమల్లు' సాంగ్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

కాన్స్‌లో అదితి : ఆరుగజాల చీర, సింధూరంతో ముగ్ధమనోహరంగా (ఫొటోలు)

+5

కుమారుడి టాలెంట్‌ చూసి మురిసిపోతున్నడైరెక్టర్‌ సుకుమార్ భార్య (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ ఫిలిం ఫెస్టివల్‌లో అనామిక ఖన్నా బ్యాక్‌లెస్ గౌనులో జాన్వీ కపూర్‌ (ఫోటోలు)