Breaking News

యప్ టీవీ నుంచి సరికొత్త యాప్

Published on Wed, 12/23/2015 - 17:59

ముంబై: ఇంటర్‌నెట్ ఆధారిత టీవీ స్ట్రీమింగ్ సర్వీస్ ప్రొవైడర్ యప్ టీవీ సరికొత్త యాప్ 'యప్ టీవీ బజార్'ను ప్రారంభించింది. ముంబైలోని జుహులో మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగరరావు, బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్ బుధవారం సంయుక్తంగా ఈ యాప్ను లాంచ్ చేశారు. హై క్వాలిటీ విడియోలను ఈ యాప్ ద్వారా చూడవచ్చు. విద్యా సమాచారం, షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్, మూవీ ట్రైలర్స్, తదితర సమాచారాన్ని మనం యప్ టీవీ బజార్ నుంచి పొందవచ్చు. వ్యక్తిగతంగా ఎవరైనా తాము రూపొందించిన వీడియోలను యప్ బజార్ నుంచి మార్కెట్ చేసుకునే వెసులుబాటు కూడా ఇందులో ఉంది. స్మార్ట్ టీవీ, స్మార్ట్ ఫోన్, టాబ్లెట్, కంప్యూటర్ వాడేవారు సులువుగా ఈ యాప్ ద్వారా తమకు కావల్సిన విషయాన్ని చూడవచ్చు.

కంటెండ్ డెవలపర్స్ తమ డాటాను, వీడియోల ద్వారా ఇందులో భద్రపరుచుకోవడంతో పాటు సులువుగా మార్కెటింగ్ చేసుకోవచ్చునని యప్ టీవీ వ్యవస్థాపకుడు, సీఈవో ఉదయ్ రెడ్డి తెలిపారు. గతంలో కంటెంట్ డెవలపర్లకు ఉన్న సమస్యలకు ఈ యాప్ పరిష్కారం చూపిస్తుందని ధీమావ్యక్తం చేశారు.

గవర్నర్ విద్యాసాగర్ రావు మాట్లాడుతూ.. డిజిటల్ యుగంలో పరిశ్రమలు నూతన టెక్నాలజీని వాడుతున్నాయన్నారు. వీడియో కంటెంట్ ప్లాట్ఫారం అయిన యప్ టీవీ యాప్ను అందరూ స్వాగతించాలని చెప్పారు. ఎవరైనా తమ వీడియోను ఈ యాప్ ద్వారా అందరికీ పరిచయం చేసి, మార్కెట్ చేసుకోవడం ప్రారంభించి కొత్త బిజినెస్ చేసుకునేందుకు అవకాశం లభిస్తుందన్నారు. అభిషేక్ బచ్చన్ మాట్లాడుతూ.. క్రియేటివిటీని అందరికీ పరిచయం చేసుకునేందుకు మంచి అవకాశమన్నారు. గూగుల్ ప్లే స్టోర్లో యప్ టీవీ అత్యంత ఆదరణ కలిగిన రెండో యాప్ అని, యప్ టీవీ బజార్ అందరూ విశ్వసించదగ్గ యాప్ అని అభిషేక్ బచ్చన్ అభిప్రాయపడ్డాడు.

Videos

Palamuru: ప్రభుత్వం ఇచ్చిన కొద్దిడబ్బులపైనే కన్నేసిన మోసగాడు

Rowdy Gang: గజగజ లాడుతున్న బెజవాడ

Hyderabad: దంచికొట్టిన వర్షం

Vizag: కిటికీలో నుండి వీడియోలు తీస్తూ

Big Alert: కోస్తా జిల్లాల్లో ఐదు రోజుల పాటు పడనున్న వర్షాలు

Visakhapatnam: ఆపరేషన్ కంబోడియా మరో ఇద్దరు అరెస్ట్

తెర వెనక మిగిలిపోతున్న రియల్ హీరోలు

అనంతపురం జిల్లా తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి గూండాగిరి

Ambati: పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు 2027కి పూర్తి చేస్తామని చంద్రబాబు చెప్పారు

మహానటి కంటే ఎక్కువ అంటే మీ ఇంట్లో వాళ్లేనా.. రెచ్చిపోయిన మహిళలు

Photos

+5

కుమారుడితో తొలిసారి తిరుమలలో హీరోయిన్ ప్రణీత (ఫొటోలు)

+5

'పరదా' సినిమా ప్రెస్ మీట్ (ఫొటోలు)

+5

రెడ్‌ శారీలో ‘జూనియర్‌’మూవీ ఈవెంట్‌లో మెరిసిన శ్రీలీల (ఫొటోలు)

+5

ఇండియన్ సూపర్ క్రాస్ రేసింగ్ లీగ్ సీజన్ 2 ట్రోఫీ ఆవిష్కరించిన సల్మాన్ ఖాన్ (ఫొటోలు)

+5

కరీంనగర్ లో సినీనటి అనుపమ పరమేశ్వరన్ సందడి (ఫొటోలు)

+5

‘జూనియర్‌’ మూవీ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

తప్పు సరిదిద్దుకో చంద్రబాబూ.. రేపు టైం మాది గుర్తుంచుకో (ఫొటోలు)

+5

మహబూబ్‌నగర్‌ : బోనమెత్తిన పాలమూరు ..తరలివచ్చిన మహిళలు (ఫొటోలు)

+5

పీరియడ్‌ నొప్పి తగ్గాలంటే..! (ఫొటోలు)

+5

టాలీవుడ్ హీరోయిన్ తాన్య ప్రేమ కహానీ (ఫొటోలు)