Breaking News

గూగుల్‌ సెర్చ్‌లో టాప్ నాయకుడు ఎవరో తెలుసా?

Published on Tue, 03/28/2017 - 13:19



రాష్ట్రంలో అత్యధికంగా నెటిజన్లు ఎవరికోసం సెర్చ్ చేశారో తెలుసా.. ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురించే. పెద్దపెద్ద నాయకులందరినీ పక్కన పెట్టి మరీ జగన్ విశేషాల గురించి తెలుసుకోడానికి నెటిజన్లు ఆసక్తి చూపించారు. మరో రెండేళ్లలో రాష్ట్రంలో ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో.. గూగుల్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయని పరిశీలించగా ఈ విషయం తేలినట్లు జాతీయ మీడియా కథనాలు ప్రచురించింది.

గడిచిన 90 రోజులలో గూగుల్ ట్రెండ్స్ సమాచారాన్ని సేకరించి వాటిని సగటున చూడగా.. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌తో సమానంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాపులారిటీ పెరిగినట్లు గూగుల్ తెలిపింది. మరోవైపు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గురించి మాత్రం అసలు పెద్దగా నెటిజన్లు పట్టించుకోవడం లేదు. వాళ్లిద్దరికీ చాలా తక్కువ సంఖ్యలోనే సెర్చ్‌లు వచ్చాయట. మోదీ గురించి సెర్చ్ చేసినవారిలో సగం మంది, కేజ్రీవాల్ గురించి సెర్చ్ చేసినవారిలో మూడింట రెండొంతుల మంది ఏపీ నుంచి జగన్ కోసం సెర్చ్ చేశారు.

విజయవాడ, విశాఖపట్నం లాంటి నగరాల్లో అయితే రాష్ట్ర నాయకుల కంటే జాతీయ స్థాయి నాయకుల గురించే ఎక్కువగా సెర్చ్ చేయడం గమనార్హం. అలాగే హైదరాబాద్‌లో కూడా ఎక్కువమంది నరేంద్రమోదీ, అరవింద్ కేజ్రీవాల్ గురించి సెర్చ్ చేశారు. మరోవైపు వైఎస్ఆర్‌సీపీ ఫేస్‌బుక్ పేజీకి 10 నెలల్లోనే 3 లక్షలకు పైగా లైకులు వచ్చాయి. ఈ విషయాన్ని పార్టీ ఓ ప్రకటనలో తెలిపింది.

Videos

జేమ్స్ కామెరాన్ చేతిలో SSMB29 ప్రమోషన్స్

అమెరికాలోని పెంబ్రోక్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

అబ్బయ్య చౌదరిని చంపితే? వెయ్యి మంది అబ్బయ్య చౌదరిలు వస్తారు.. పేర్ని నాని సంచలన కామెంట్స్

తమిళనాట విజయ్ వ్యూహం.. ఎలా ఉండబోతోంది?

వాడు తేడా.. అమ్మాయిల పిచ్చి.. ధర్మ మహేష్ భార్య గౌతమి సంచలన కామెంట్స్

TDP నేత సంచలన ఆడియో.. తిరుపతి ఇంచార్జి మంత్రి జల్సాలు.. లాడ్జీల్లో సరసాలు..

మీ చేతికి రెండు కోట్లు.. పరారీలో ఉన్న ఖైదీకి పెరోల్.. అసలు సంగతి ఇదీ

మీ చేతికి రెండు కోట్లు.. పరారీలో ఉన్న ఖైదీకి పెరోల్.. అసలు సంగతి ఇదీ

పీపీపీ ప్రాజెక్టుల పేరిట ప్రజాధనాన్ని దారి మళ్లిస్తోన్న కూటమి సర్కార్

కూకట్ పల్లి బాలిక హత్య కేసులో సంచలన విషయాలు

Photos

+5

జర్మనీ : గుమ్మడికాయల ప్రదర్శన అదరహో (ఫొటోలు)

+5

విజయవాడ : ఇంద్రకీలాద్రిపై ఘనంగా వరలక్ష్మీ వత్రాలు (ఫొటోలు)

+5

జపాన్‌లో చిల్ అవుతున్న మీనాక్షి చౌదరి (ఫొటోలు)

+5

పద్మనాభస్వామి ఆలయ వేడుకలో మోహన్ లాల్ (ఫొటోలు)

+5

శ్రీవారితో అందమైన జర్నీకి ఏడాది! వరాహరూపం సింగర్‌ శ్రీలలిత (ఫొటోలు)

+5

'మన శంకరవరప్రసాద్ గారు' టైటిల్‌ గ్లింప్స్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

షారుఖ్ ఖాన్ కూతురు సుహానా ఖాన్ ట్రెండింగ్‌ ఫోటోలు చూశారా..?

+5

#HBDChiranjeevi : 70 ఏళ్ల గాడ్‌ ఫాదర్‌.. 'చిరంజీవి' బర్త్‌డే స్పెషల్‌ (ఫోటోలు)

+5

హైదరాబాద్ లో సందడి చేసిన సినీ నటి శ్రియా శరణ్ (ఫొటోలు)

+5

మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే.. ఇవి మీకు తెలుసా? (ఫొటోలు)