Rain Alert: అరేబియా సముద్రంలో బలపడుతున్న గాలులు
Breaking News
ఒకే మాట - ఒకే బాటలా ఉండాలి: వైఎస్ జగన్
Published on Sun, 08/17/2014 - 14:43
హైదరాబాద్: అసెంబ్లీ వేదికగా ప్రభుత్వ వైఫల్యాలను గట్టిగా నిలదీయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం హైదరాబాద్లోని లోటస్ పాండ్ క్యాంప్ కార్యాలయంలో వైఎస్ జగన్ అధ్యక్షతన వైఎస్‌ఆర్‌సీపీ శాసనాసభాపక్ష సమావేశం జరిగింది. ఈ సందర్బంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ... ప్రజల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.... ప్రజా సమస్యలపై మనం ముందుండి పోరాడాల్సిన అవశ్యకతను ఆయన వివరించారు.
ప్రజాసమస్యలన్నింటినీ సభ ముందు సభ్యులు ప్రస్తావించాలని ఎమ్మెల్యేలకు జగన్ సూచించారు. సభలో మన వాదనలు బలంగా ఉండాలని అన్నారు. ప్రజలకు మరింత చేరువయ్యేలా మనమంతా వ్యవహరిద్దామని వారికి విశదీకరించారు. పార్టీలో నేతల మధ్య భిన్నాభిప్రాయాలు లేకుండా అందరిది ఒకే మాట - ఒకే బాటలా ఉండాలని కోరారు. అసెంబ్లీ సమావేశాలకు విధిగా హాజరుకావాలని ఎమ్మెల్యేలను ఆదేశించారు. అసెంబ్లీలో ప్రస్తావించే అంశాలపై సభ్యులు ముందుగా సిద్ధమై సభలో మాట్లాడాలని సూచించారు.
Tags : 1