amp pages | Sakshi

అంగన్‌వాడీల వైపు చూడని చిన్నారులు !

Published on Thu, 11/20/2014 - 03:42

 నరసన్నపేట రూరల్ : స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అంగన్‌వాడీ కేంద్రాల వైపు పిల్లలు చూడడం లేదు. లబ్ధిదారుల సంఖ్య కూడా తగ్గుతుండడంతో సంబంధిత శాఖ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మూడు నుంచి ఐదు సంవత్సరాల వయసులోపు  పిల్ల లు కరువవుతున్నారు. స్త్రీ శిశు సంక్షేమ అధికారులు ఆశించిన మేరకు పిల్లల నమోదు ఉండటంలేదు. కొన్ని కేంద్రాల్లో రిజిష్టర్‌కు  పిల్లల సంఖ్యకు భారీగా తేడా ఉంటుంది. దీంతో అధికారులు, ప్రజాప్రతినిధులు తనిఖీ లకు వస్తున్నారంటే పిల్లల సేకరణకు కార్యకర్తలు అష్టకష్టాలు పడుతున్నారు. దీనికి ప్రధానంగా ప్రైవేటు పాఠశాలల్లో నర్సరీ, ఎల్‌కేజీ, యూకే జీ చదువలే కారణమని పరిశీలకులు భావిస్తున్నారు. దీన్ని గమనించిన అధికారులు ఫ్రీ స్కూల్ పిల్లల సంఖ్య పెంచాలని ఒత్తిడి చేస్తు న్నా కార్యకర్తలకు సాధ్యం కావడంలేదు. దీనికి ఉదాహరణగా నరసన్నపేట ప్రాజెక్టు పరిధిలోని పిల్లల సంఖ్యను చెప్పవచ్చు. ఈ ప్రాజెక్టు పరిధిలో నరసన్నపేట మేజరు పంచాయతీతో పాటు నరసన్నపేట, పోలాకి మండలాలు ఉన్నాయి.
 
 వీటిలో మెరుున్ కేంద్రాలు 187, మినీ కేంద్రాలు 38 ఉన్నాయి. ప్రస్తుతం 225 కేంద్రాల్లో గర్భిణులు 1275 మంది, బాలింత లు 1492 మంది, సున్నా నుంచి ఆరు నెలల వరకూ 1495 మంది పిల్లలు, అలాగే ఆరు నెలల నుంచి ఐదు సంవత్సరాల్లోపు పిల్లలు 9,414 మంది ఉన్నారు. మార్చి 2014 నాటికి గర్భిణులు 1495, బాలింతలు 1568, సున్నా నుంచి 6 నెలల పిల్లలు 1568, ఐదేళ్లలోపు వారు 10515 మంది ఉండేవారు. అరుుతే తొమ్మిది నెలలకే పిల్లల సంఖ్యలో 1100 మంది తగ్గుదల కన్పిస్తుంది. ఇంత భారీగా తగ్గుదల ఉండటంతో కార్యకర్తలు, అధికారులు ఆందోళన చెందుతున్నారు. లోపం ఎక్కడ ఉందా అని ఆరా తీస్తున్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో అన్ని సదుపాయాలు కల్పిస్తున్నా తల్లిదండ్రులు తమ పిల్లలను ఎందుకు పంపడం లేదని అధికారులు ఆలోచన చేస్తున్నారు. ఇదిలాఉంటే.. మూడు నుంచి ఐదేళ్లలోపు పిల్లలు రికార్డుల్లో ఉంటున్నారే తప్పా కేంద్రాలకు హాజరు అంతంతగానే ఉంటుంద నే విమర్శలు వస్తున్నారుు.
 
 గ్రామీణ ప్రాంతా ల్లో కూడా కాన్మెంట్ చదువుల సంస్కృతి పెరుగుతుండడంతో అంగన్‌వాడీ కేంద్రాలకు ఆదరణ తగ్గుతోందని పలువురు భావిస్తున్నారు. అలాగే కొన్ని గ్రామాల్లో కార్యకర్తల పనితీరు సరిగ్గా లేదనే ఆరోపణలు ఉన్నారుు. వీరి పనితీరును సరిచేయాల్సిన అధికారులు కూ డా బాధ్యతగా పనిచేయడం లేదనే విమర్శలు వస్తున్నాయి. నరసన్నపేట మండలం కొల్లవానిపేట కార్యకర్త రెండేళ్లుగా విధులకు రాకపోయినా ఆ స్థానంలో ఇప్పటికీ కొత్త వారిని నియమించడంలేదు. కనీసం ఈ స్థానం ఖాళీ గా ఉన్నట్టు కూడా చెప్పడం లేదు. అలాగే మాకివలస, మడపాం, కంబకాయల్లో  కార్యకర్తల పనితీరుపై విమర్శలు ఉన్నాయి. మరో పక్క పలు గ్రామాల్లో అంగన్‌వాడీ భవనాలు శిథిలావస్థకు చేరుకున్నా మరమ్మతులకు నోచుకోలేదు. అలాగే పారిశుద్ధ్యం  క్షీణిస్తుండడంతో తల్లిదండ్రులు తమ పిల్లలు ఏమౌతారోననే భయంతో కేంద్రాలకు పంపడం లేదు.  
 

Videos

బెంగుళూరు రేవ్ పార్టీ... టీడీపీ,సోమిరెడ్డికి ఇచ్చిపడేసిన కాకాణి

తప్పుడు ఆరోపణలపై యాంకర్ శ్యామల పరువు నష్టం దావా

TG క్రేజ్ ..రవాణా శాఖకు ఒకే రోజు 40 లక్షల ఆదాయం

కాంగ్రెస్ పై హరీష్ రావు ఫైర్

వంగా గీతకు చేతులెత్తి మొక్కిన యాంకర్ శ్యామల

రేవ్ పార్టీలో యాంకర్ శ్యామల? వంగా గీత రియాక్షన్

ఎల్లో మీడియాపై యాంకర్ శ్యామల పరువు నష్టం దావా

ఈ ఫోటోలో వ్యక్తి కనబడుట లేదు: జోగి రమేష్

ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ భద్రతా చర్యలపై చర్చ

అడ్డదిడ్డంగా మాట్లాడుతున్న ప్రశాంత్ కిషోర్ ? పీకే నోట బాబు పలుకులు

Photos

+5

ఓ వైపు టెన్షన్.. మరోవైపు ఉత్సాహం: స్టేడియంలో తళుక్కుమన్న షారుఖ్ (ఫొటోలు)

+5

Tirupati Gangamma Jatara 2024: తిరుపతిలో ఘనంగా తాతయ్యగుంట గంగమ్మ జాతర (ఫొటోలు)

+5

SRH: అతడి లాగే నన్నూ ఆశీర్వదించండి: అభిషేక్‌ తల్లికి అర్ష్‌దీప్‌ రిక్వెస్ట్‌ (ఫొటోలు)

+5

రజనీకాంత్‌ మనవడి బర్త్‌డే సెలబ్రేషన్స్‌.. క్రికెట్‌ థీమ్‌తో.. (ఫోటోలు)

+5

Hakim Shajahan Marriage: హీరోయిన్‌ను పెళ్లాడిన మలయాళ హీరో.. ఎంతో సింపుల్‌గా! (ఫోటోలు)

+5

Indraja Sankar Birthday Photos: విజిల్‌ నటి బర్త్‌డే సెలబ్రేషన్స్‌.. పెళ్లి తర్వాత భర్తతో తొలిసారి (ఫోటోలు)

+5

SRH Vs PBKS Highlights Photos: సన్ రైజర్స్ vs పంజాబ్..తారలతో నిండిన ఉప్పల్ స్టేడియం (ఫోటోలు)

+5

Shobha Shetty: కొత్తింటి కల సాకారం చేసుకున్న బిగ్‌బాస్‌ బ్యూటీ.. ప్రియుడితో గృహప్రవేశం (ఫోటోలు)

+5

నటుడు చందు కన్నుమూత.. వైరలవుతున్న పెళ్లి ఫోటోలు

+5

Afghanistan Floods: అఫ్ఘాన్‌ కొట్టుకుపోయింది.. మిగిలింది శూన్యమే (ఫొటోలు)