ఎన్‌ఐఏ విచారణ.. టీడీపీలో వణుకు!

Published on Sat, 01/12/2019 - 20:16

సాక్షి, అమరావతి: ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసులో ఎన్‌ఐఏ విచారణ ప్రారంభించడం.. టీడీపీ నేతల్లో వణుకు పుట్టిస్తోంది. ఈ కేసు విచారణను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ)కు అప్పగిస్తూ విజయవాడలోని ఎన్ఐఏ కోర్టు శుక్రవారం ఆదేశించిన విషయం తెలిసిందే. దీనిపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ తాజాగా ప్రధాని మోదీకి లేఖ రాశారు. జగన్‌పై హత్యాయత్నం కేసు విచారణను ఎన్‌ఐఏకు అప్పగించడం సరైనది కాదనీ, దీనిపై ప్రభుత్వానికి పలు అభ్యంతరాలు ఉన్నాయని ఐదు పేజీల లేఖలో చం‍ద్రబాబు పేర్కొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ఎన్‌ఐఏకు ఎలా అప్పగిస్తారని కేం‍ద్రాన్ని చంద్రబాబు ప్రశ్నించారు. దాడి ఘటన విచారణను ఎన్‌ఐఏకు అప్పగిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని రీకాల్‌ చేయాలని లేఖలో ప్రధాని మోదీని కోరారు. చంద్రబాబు లేఖపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. చంద్రబాబు తీరుతో దాడి ఘటనలో నిజంగానే టీడీపీ పాత్ర ఉన్నదా అనే అనుమానం వ్యక్తమవుతోంది. జగన్‌పై హత్యాయత్నంలో టీడీపీ హస్తం ఉందని మొదటినుంచి ప్రతిపక్ష వైస్సార్‌సీపీ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఎన్‌ఐఏ విచారణలో అసలు వాస్తవాలు బయటకు వస్తాయనే భయంతోనే చంద్రబాబు విచారణకు సహరించడంలేదని వైఎస్సార్‌సీపీ నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

జగన్‌పై దాడిలో టీడీపీ పాత్ర లేకపోతే ఎన్‌ఐఏ విచారణకు ఆ పార్టీ సహకరించాలి, కానీ అందుకు భిన్నంగా టీడీపీ ప్రభుత్వం వ్యవహరిస్తుండటం పరిశీలకుల్ని విస్మయ పరుస్తోంది. ఎన్‌ఐఏ దర్యాప్తు మొదలైన నాటినుంచి టీడీపీ సర్కారు, ఏపీ పోలీసులు వ్యవహరిస్తున్న తీరు.. పలు ప్రశ్నలకు తావిస్తోంది. ఈ నేపథ్యంలో ఎన్‌ఐఏ దర్యాప్తు అనగానే చంద్రబాబు సర్కారు ఎందుకు వణికిపోతోందని, ఈ కేసులో టీడీపీ పాత్ర ఏమాత్రం లేనిపక్షంలో ఎందుకు చంద్రబాబు ప్రభుత్వం ఎన్‌ఐఏ దర్యాప్తుకు సహకరించడం లేదని వైఎస్సార్‌సీపీ నేతలు ప్రశ్నించారు. చంద్రబాబు తప్పేమీ లేనప్పడు ఎన్‌ఐఏ విచారణకు ఎందుకు అడ్డుపడుతున్నారని నిలదీస్తున్నారు.


 

Videos

ముగిసిన పోలింగ్ తీన్మార్ మల్లన్న అత్యుత్సాహం

సన్రైజర్స్ యజమానిని, కంటతడిపెట్టించిన కేకేఆర్..

MLC ఎన్నికల్లో ఘర్షణ డబ్బులు పంచుతున్న నేతలు

తెలంగాణ గేయంపై వివాదం

తెలుగు కుర్రాడు అరుదైన ఘనత.. నితీష్ రెడ్డి టీమిండియాలోకి ఎంట్రీ ..!

టీడీపీ అరాచకాలు కళ్లకు కట్టినట్టు చూపించిన పేర్నినాని

హైకోర్టులో పిన్నెల్లి అత్యవసర పిటిషన్

ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనాలు

డ్రగ్స్ కేసులో ఎంతోమంది దొరికినా సినీ పరిశ్రమ పైనే ఎందుకు టార్గెట్ ?

మిల్లర్లను భయపెట్టి టెండర్లు నిర్వహించారు

Photos

+5

Anasuya Sengupta: 'కేన్స్‌'లో చరిత్ర సృష్టించిన భారతీయ నటి (ఫోటోలు)

+5

నేను బతికే ఉన్నా.. ఫోటోలతో క్లారిటీ ఇచ్చిన హీరోయిన్‌ (ఫొటోలు)

+5

హార్దిక్‌ పాండ్యాతో విడాకులంటూ వదంతులు.. ట్రెండింగ్‌లో నటాషా(ఫొటోలు)

+5

Kavya Maran: అవధుల్లేని ఆనందం.. యెస్‌.. ఫైనల్లో సన్‌రైజర్స్‌ (ఫొటోలు)

+5

సీరియల్‌ నటి ఇంట సంబరాలు.. మళ్లీ మహాలక్ష్మి పుట్టింది! (ఫోటోలు)

+5

సచిన్ టెండూల్కర్‌‌‌‌‌‌‌‌ని కలిసిన బాక్సింగ్ క్వీన్‌‌‌‌ (ఫొటోలు)

+5

సాగని సంసారం.. రొమ్ము క్యాన్సర్‌తో పోరాటం.. తెలుగులో ఒకే ఒక్క మూవీ (ఫోటోలు)

+5

ఫ్యామిలీతో ట్రిప్‌.. పొట్టి డ్రెస్‌లో అనసూయ జలకాలాటలు (ఫోటోలు)

+5

రేవ్‌ పార్టీ.. హేమతో పాటు ఈ బ్యూటీ కూడా.. ఇంతకీ ఎవరంటే? (ఫోటోలు)

+5

Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (23-05-2024)