amp pages | Sakshi

రాష్ట్రానికి శుక్ర మహాదశ

Published on Sat, 04/09/2016 - 00:49

దుర్ముఖి నామ సంవత్సరం శుభప్రదం కావాలి
రాష్ట్రస్థాయి ఉగాది వేడుకల్లో సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడి



విజయవాడ : దుర్ముఖి నామ సంవత్సరం నుంచి రాష్ట్రానికి శుక్ర మహాదశ పట్టాలని తాను భావిస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. శుక్రుడు పరిపాలనలో ఆరితేరినవాడని చెప్పారు. నగరంలోని గురునానక్ కాలనీలో శుక్రవారం జరిగిన దుర్ముఖి నామ సంవత్సర ఉగాది వేడుకల్లో ఆయన మాట్లాడారు. రాష్ట్ర స్థాయిలో  నిర్వహించిన ఈ వేడుకలకు 13 జిల్లాల నుంచి వివిధ రంగాల ప్రముఖులు హాజరయ్యారు. సాంస్కృతిక శాఖ, దేవాదాయ, ధర్మాదాయ శాఖ అట్టహాసంగా నిర్వహించిన ఈ వేడుకలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. వ్యవసాయ, ఉద్యానవన, భక్తి టీవీ పంచాంగాలను, ప్రకృతి వ్యవసాయ పితామహుడు శుబాష్ పాలేకర్ పంపిన సీడీని సీఎం ఆవిష్కరించారు. ప్రారంభోపన్యాసంలో చంద్రబాబు మాట్లాడుతూ దుర్ముఖి నామ సంవత్సరం తెలుగు ప్రజల జీవితాల్లో శుభప్రదమైన మార్పులు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో 23 మంది వివిధ రంగాల ప్రముఖులకు కళారత్న (హంస) పురస్కారాలు అందించారు. ఈ పురస్కారంలో భాగంగా రూ.50 వేల నగదు, జ్ఞాపిక అందజేశారు. మరో 53 మందికి ఉగాది పురస్కారం అందించారు. వీరికి రూ.10 వేల నగదుతో పాటు శాలువాతో సత్కరించి ప్రశంసాపత్రాలు అందజేశారు. పంచాంగ పఠనాన్ని శ్రీనివాస గార్గేయ, దీక్షితులు చేశారు.


ఈ కార్యక్రమంలో ఆరుగురు వేద పండితులను సత్కరించారు. ఆచార్య ఎన్.జి.రంగా విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు డాక్టర్ వీరయ్య, డాక్టర్ రామచంద్రరావు, డాక్టర్ సత్యనారాయణ, డాక్టర్ ప్రతిమ, డాక్టర్ మోషేలకు ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలు అందించారు. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతలుగా గాయత్రి, మురళీకృష్ణ వ్యవహరించారు. రాష్ట్ర మంత్రులు పైడిపాముల కొండలరావు, దేవినేని ఉమామహేశ్వరరావు, పల్లె రఘునాథరెడ్డి, కామినేని శ్రీనివాస్, ఎంపీలు కేశినేని శ్రీనివాస్, గల్లా జయదేవ్, ఎమ్మెల్యేలు బొండా ఉమామహేశ్వరరావు, గద్దె రామ్మోహనరావు, తంగిరాల సౌమ్య, ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి, దేవాదాయ, ధర్మాదాయ కమిషనర్ వై.వి.అనురాధ తదితరులు పాల్గొన్నారు.

 

Videos

బెంగళూరులో రేవ్ పార్టీ భగ్నం.. హైదరాబాద్ ఫామ్ హౌస్ లో నటి హేమ

రేవ్ పార్టీ పై హీరో శ్రీకాంత్ రియాక్షన్

ఏపీలో అల్లర్లపై.. డీజీపీకి సిట్ నివేదిక

జూన్ 4 తరువాత చూసుకుందాం: పెద్దిరెడ్డి

సస్పెండ్ అయి స్థానంలో కొత్త అధికారులు

"సాధించాం” అంటూ కన్నీళ్లు పెట్టుకున్న కోహ్లి, అనుష్క..

చరిత్ర సృష్టించిన హైదరాబాద్ యువ కెరటం అభిషేక్ శర్మ..

దొంగ ఓట్ల కోసం చంద్రబాబు, పురందేశ్వరి, పవన్ కళ్యాణ్ చేసిన కుట్ర..

అమెరికా పారిపోయిన అయ్యా.. కొడుకులు

ఏపీలో అల్లర్లు చేసింది వీరే..

Photos

+5

Hakim Shajahan Marriage: హీరోయిన్‌ను పెళ్లాడిన మలయాళ హీరో.. ఎంతో సింపుల్‌గా! (ఫోటోలు)

+5

Indraja Sankar Birthday Photos: విజిల్‌ నటి బర్త్‌డే సెలబ్రేషన్స్‌.. పెళ్లి తర్వాత భర్తతో తొలిసారి (ఫోటోలు)

+5

SRH Vs PBKS Highlights Photos: సన్ రైజర్స్ vs పంజాబ్..తారలతో నిండిన ఉప్పల్ స్టేడియం (ఫోటోలు)

+5

Shobha Shetty: కొత్తింటి కల సాకారం చేసుకున్న బిగ్‌బాస్‌ బ్యూటీ.. ప్రియుడితో గృహప్రవేశం (ఫోటోలు)

+5

నటుడు చందు కన్నుమూత.. వైరలవుతున్న పెళ్లి ఫోటోలు

+5

Afghanistan Floods: అఫ్ఘాన్‌ కొట్టుకుపోయింది.. మిగిలింది శూన్యమే (ఫొటోలు)

+5

ఏపీలో గెలిచేదెవరు? జడ్జ్‌మెంట్‌ డే 4th June (ఫొటోలు)

+5

చందు వైఫ్ షాకింగ్ కామెంట్స్

+5

Sangeetha Sringeri: పునీత్‌ రాజ్‌కుమార్‌ సమాధి వద్ద నటి బర్త్‌డే సెలబ్రేషన్స్‌ (ఫొటోలు)

+5

సంతోషంలో కావ్యా మారన్‌.. కేన్‌ విలియమ్సన్‌ను పలకరించి మరీ! (ఫొటోలు)