amp pages | Sakshi

పెళ్లయిన 45 రోజులకే..

Published on Fri, 06/10/2016 - 00:47

యువతి అనుమానాస్పద మృతి
భర్తే హత్య చేశాడంటున్న    బంధువులు
పోలీసుల అదుపులో   మృతురాలి భర్త

 

జగ్గయ్యపేట : తల్లి ప్రేమకు నోచుకోకున్నా అల్లారుముద్దుగా పెంచుకున్న ఒక్కగానొక్క కుమార్తెకు ఆ తండ్రి ఘనంగా వివాహం చేశాడు. కుమార్తె జీవితం బావుంటుందని రాజధాని ప్రాంతంలో అరెకరం పొలం లాంఛనంగా ఇచ్చాడు. అయితే పెళ్లయిన 45 రోజులకే ఆమె అనుమానాస్పద స్థితిలో మృతిచెందడంతో కన్నతండ్రి భోరున విలపించాడు. ఈ ఘటన బుధవారం రాత్రి జరిగింది.

 
పోలీసుల కథనం మేరకు.... పెనుగంచిప్రోలు గ్రామానికి చెందిన జిడుగు వెంకట నారాయణకు గుంటూరు జిల్లా పెద్దకూరపాడు మండలం తాళ్లూరు గ్రామానికి చెందిన మునగోటి రాణి (18)తో 45 రోజుల క్రితం వివాహమైంది. నూతన దంపతులు బుధవారం ఉదయం నల్గొండ జిల్లా మేళ్లచెరువు గ్రామంలోని బంధువుల ఇంటికి ద్విచక్రవాహనంపై వెళ్లారు. రాత్రి సమయంలో తిరిగి పెనుగంచిప్రోలు బయలుదేరారు. అయితే జగ్గయ్యపేట బైపాస్ రోడ్డులో తన ద్విచక్ర వాహనం ప్రమాదానికి గురై రాణి గాయపడిందంటూ ఆమెను తన స్నేహితుడి సాయంతో వెంకటనారాయణ ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లాడు. ఆమె అప్పటికే మృతి చెందిందని వైద్యులు చెప్పడంతో రెండు వైపుల బంధువులకు వెంకటనారాయణే సమాచారం ఇచ్చాడు. రాణి తండ్రి మునగోటి ప్రసాద్, పెదనాన్న దేవరకొండ బ్రహ్మం హుటాహుటిన ఆస్పత్రికి వచ్చి నిర్జీవంగా పడివున్న రాణిని చూసి భోరున విలపించారు. ఆమె మెడపై ఉరివేసినట్టు కమిలిన గుర్తు ఉండటంతో భర్తే హత్య చేసి ప్రమాదంగా చిత్రీకరిస్తున్నాడంటూ రాణి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ వై.వి.ఎల్.రావు, అదనపు ఎస్‌ఐ వి.వి.రావు ఆస్పత్రికి వచ్చి మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదుచేసి విచారణ చేపట్టారు. నందిగామ డీఎస్పీ ఉమా మహేశ్వరరావు గురువారం ఉదయం రాణి మృతదేహాన్ని పరిశీలించి బంధువులను అడిగి ఈ ఘటనకు సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు.

 

భర్తే హత్య చేశాడు..
ఒక్కగానొక్క కూతురువి.. తల్లి లేకపోయినప్పటికీ అల్లారుముద్దుగా పెంచుకున్నా.. సంసారం బావుంటుందని బంధువుకే ఇచ్చి పెళ్లిచేస్తే కాళ్ల పారాణి ఆరక ముందే నిండు నూరేళ్లు నిండిపోయాయా తల్లీ అంటూ రాణి తండ్రి కన్నీరుమున్నీరుగా విలపించారు. తన కుమార్తెను భర్తే హత్య చేశాడని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. రాణి భర్త వెంకట నారాయణ పోలీసుల అదుపులో ఉన్నాడు. భార్య మృతికి తానే కారణమని పోలీసుల ముందు ఒప్పుకున్నాడని    సమాచారం.

 

 

Videos

బెంగుళూరు రేవ్ పార్టీ... టీడీపీ,సోమిరెడ్డికి ఇచ్చిపడేసిన కాకాణి

తప్పుడు ఆరోపణలపై యాంకర్ శ్యామల పరువు నష్టం దావా

TG క్రేజ్ ..రవాణా శాఖకు ఒకే రోజు 40 లక్షల ఆదాయం

కాంగ్రెస్ పై హరీష్ రావు ఫైర్

వంగా గీతకు చేతులెత్తి మొక్కిన యాంకర్ శ్యామల

రేవ్ పార్టీలో యాంకర్ శ్యామల? వంగా గీత రియాక్షన్

ఎల్లో మీడియాపై యాంకర్ శ్యామల పరువు నష్టం దావా

ఈ ఫోటోలో వ్యక్తి కనబడుట లేదు: జోగి రమేష్

ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ భద్రతా చర్యలపై చర్చ

అడ్డదిడ్డంగా మాట్లాడుతున్న ప్రశాంత్ కిషోర్ ? పీకే నోట బాబు పలుకులు

Photos

+5

ఓ వైపు టెన్షన్.. మరోవైపు ఉత్సాహం: స్టేడియంలో తళుక్కుమన్న షారుఖ్ (ఫొటోలు)

+5

Tirupati Gangamma Jatara 2024: తిరుపతిలో ఘనంగా తాతయ్యగుంట గంగమ్మ జాతర (ఫొటోలు)

+5

SRH: అతడి లాగే నన్నూ ఆశీర్వదించండి: అభిషేక్‌ తల్లికి అర్ష్‌దీప్‌ రిక్వెస్ట్‌ (ఫొటోలు)

+5

రజనీకాంత్‌ మనవడి బర్త్‌డే సెలబ్రేషన్స్‌.. క్రికెట్‌ థీమ్‌తో.. (ఫోటోలు)

+5

Hakim Shajahan Marriage: హీరోయిన్‌ను పెళ్లాడిన మలయాళ హీరో.. ఎంతో సింపుల్‌గా! (ఫోటోలు)

+5

Indraja Sankar Birthday Photos: విజిల్‌ నటి బర్త్‌డే సెలబ్రేషన్స్‌.. పెళ్లి తర్వాత భర్తతో తొలిసారి (ఫోటోలు)

+5

SRH Vs PBKS Highlights Photos: సన్ రైజర్స్ vs పంజాబ్..తారలతో నిండిన ఉప్పల్ స్టేడియం (ఫోటోలు)

+5

Shobha Shetty: కొత్తింటి కల సాకారం చేసుకున్న బిగ్‌బాస్‌ బ్యూటీ.. ప్రియుడితో గృహప్రవేశం (ఫోటోలు)

+5

నటుడు చందు కన్నుమూత.. వైరలవుతున్న పెళ్లి ఫోటోలు

+5

Afghanistan Floods: అఫ్ఘాన్‌ కొట్టుకుపోయింది.. మిగిలింది శూన్యమే (ఫొటోలు)