మంత్రి శిద్దాను కలసిన మాగుంట

Published on Thu, 06/19/2014 - 02:38

 ఒంగోలు: రాష్ట్ర రహదారులు, భవనాలు, రవాణ  శాఖామంత్రి శిద్దా రాఘవరావును ఒంగోలు మాజీ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి బుధవారం ఉదయం ఆయన స్వగృహంలో కలిసి అభినందన తెలిపారు. ఈ సందర్భంగా ఇద్దరూ దాదాపు అర్ధగంటపాటు ప్రత్యేకంగా భేటీ అయ్యారు.  ఇటీవల ఎన్నికల కోడ్ సందర్భంగా మంజూరు చేయించిన పలు పథకాల పనులు ఆగిపోయాయని, వాటిని కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. ఇదే క్రమంలో వారిని మార్కాపురం మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, సంతనూతలపాడు మాజీ ఎమ్మెల్యే బీఎన్ విజయ్‌కుమార్, సంతనూతలపాడు టీడీపీ ఇన్‌చార్జి మన్నెం శ్రీధర్, ఒంగోలు సూపర్‌బజార్ చైర్మన్ తాతా ప్రసాద్, ఒంగోలు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అయినాబత్తిన ఘనశ్యాం తదితరులు కలిశారు.
 
 సిటీ బస్సులు నడపాలి: ఒంగోలు నగరంలో సిటీ బస్సులు నడపాలని సీపీఐ నాయకులు ఉప్పుటూరి ప్రకాశరావు, సయ్యద్‌సర్థార్ తదితరులు మంత్రి శిద్దా రాఘవరావును కలిసి విజ్ఞప్తి చేశారు. ఆటో చార్జీలు ప్రయాణికులకు పెనుభారంగా మారాయని, అందువల్ల సిటీ బస్సులు నడపాల్సిన అవసరం ఉందన్నారు. ఒంగోలు డిపో అధికారులు సిటీ బస్సులు నడపకుండా వంకలు చెబుతున్నారన్నారు.   జేఎన్‌యూఆర్‌ఎం నిధులతో సంబంధం లేకుండానే సిటీ బస్సులు నడిపేందుకు దృష్టి సారించాలని, దాంతోపాటు పలు మార్గాల్లో పల్లె వెలుగు బస్సులు నడిపేలా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. త్వరలోనే ఆర్టీసీ అధికారులతోను, రవాణాశాఖ అధికారులతో సమీక్షిస్తానని, తప్పకుండా అభివృద్ధి పనులు చేపడదామంటూ మంత్రి వారికి హామీ ఇచ్చారు.
 
 మంత్రికి అభినందనల వెల్లువ:
 మంత్రి శిద్దా రాఘవరావుకు అధికారులు, అనధికారులు పలువురు అభినందనలు తెలిపారు. ఆర్టీసీ ఆఫీసర్స్ అసోసియేషన్, ఆర్టీసీ సీఎంఈ రవికాంత్, ఆర్టీసీ నాయకులు తిరుమలేషు, పలువురు ఎక్సయిజ్ అధికారులు మంత్రిని కలిసిన వారిలో ఉన్నారు. వీరితోపాటు పలువురు జనసేన నాయకులు కూడా శిద్దాను కలిసి పుష్పగుచ్ఛం అందించి అభినందనలు తెలిపారు.

Videos

52 మందితో మోడీ క్యాబినెట్

వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలపై దాడులు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి

బండి సంజయ్ కి కేంద్ర మంత్రి పదవి

ఫిల్మ్ సిటీలో రామోజీ రావు అంత్యక్రియలు

ఓటమిపై సీదిరి అప్పలరాజు షాకింగ్ కామెంట్స్

ఫ్యాన్స్ ను డిస్సపాయింట్ చేస్తున్న శంకర్...

కేంద్రం నుండి రామ్మోహన్ రాయుడు, పెమ్మసాని ఫోన్ కాల్

డ్రాగన్ కంట్రీ కుట్రలో మాల్దీవులు..!?

పుష్ప2 Vs వేదా మూవీ బిగ్ క్లాష్..

మకాం మారుస్తున్న శ్రీలీల..

Photos

+5

Premgi Amaren: 45 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్న కమెడియన్‌ (ఫోటోలు)

+5

పాక్‌లో ప్రముఖ ఆలయాలు (ఫొటోలు)

+5

కల నెరవేరుతున్న వేళ.. పట్టలేనంత సంతోషంలో బిగ్‌బాస్‌ బ్యూటీ (ఫోటోలు)

+5

అర్జున్‌ సర్జా కూతురి పెళ్లి.. గ్రాండ్‌గా హల్దీ సెలబ్రేషన్స్‌ (ఫోటోలు)

+5

Fish Prasadam 2024 : చేప ప్రసాదం కోసం పోటెత్తిన జనాలు (ఫొటోలు)

+5

మృగశిర కార్తె ఎఫెక్ట్ : కిక్కిరిసిన రాంనగర్ చేపల మార్కెట్‌ (ఫొటోలు)

+5

Mayank Agarwal : కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టీమిండియా క్రికెటర్ ‘మయాంక్ అగర్వాల్’ (ఫొటోలు)

+5

వైఎస్‌ జగన్‌ను కలిసిన వైఎస్సార్‌సీపీ నేతలు (ఫొటోలు)

+5

ఈ హీరోయిన్‌ మనసు బంగారం.. మీరు కూడా ఒప్పుకోవాల్సిందే! (ఫోటోలు)

+5

ఫ్యామిలీతో గోవా బీచ్‌లో చిల్‌ అవుతున్న యాంకర్‌ లాస్య (ఫోటోలు)