amp pages | Sakshi

అసెంబ్లీ ఎన్నికల నిలిపివేతకు హైకోర్టు నో

Published on Fri, 03/21/2014 - 03:16

ఎమ్మెల్యే దాస్ అనుబంధ పిటిషన్ కొట్టివేత
ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నికలపై ప్రధాన పిటిషన్ విచారణకు స్వీకరణ

 
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించకుండా ఆదేశాలు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. ఎన్నికల నిలుపుదల కోసం కృష్ణాజిల్లా పామర్రు ఎమ్మెల్యే డి.వై.దాస్ దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. అయితే ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణను రాజ్యాంగం విరుద్ధంగా ప్రకటించాలన్న ప్రధాన పిటిషన్‌ను మాత్రం విచారణకు స్వీకరించింది. ప్రతివాదులైన కేంద్ర ఎన్నికల కమిషన్ కార్యదర్శికి, కేంద్ర న్యాయశాఖ కార్యదర్శికి నోటీసులు జారీచేసి, పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది.
 
 ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీచేసింది. ఉమ్మడి రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించి, అపాయింటెడ్ డే తరువాత ఎమ్మెల్యేలను ఇరు రాష్ట్రాలకూ విభజించడం రాజ్యాంగ విరుద్ధమని, అందువల్ల అసెంబ్లీ ఎన్నికలను నిలుపుదల చేయాలని కోరుతూ ఎమ్మెల్యే డి.వై.దాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాన్ని గురువారం ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. ఈసీ తరఫున సీనియర్ న్యాయవాది డి.ప్రకాశ్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఎన్నికల నిర్వహణ వల్ల పిటిషనర్‌కు వ్యక్తిగత నష్టమేమీ లేదని, ఎన్నికలు నిలిపేయాల్సిన అవసరం లేదని చెప్పారు. దీంతో ధర్మాసనం.. అనుబంధ పిటిషన్‌ను కొట్టేస్తూ, భవిష్యత్తులో జరగబోయే వాటి ఆధారంగా ఎన్నికలను నిలుపుదల చేయాలని ఆదేశాలు ఇవ్వలేమని వ్యాఖ్యానించింది. ప్రధాన పిటిషన్‌ను విచారణకు స్వీకరిస్తూ ప్రతివాదులకు నోటీసులు జారీచేసింది. కౌంటర్లు దాఖలు చేయాలని  ఆదేశించింది.

Videos

బెంగళూరులో రేవ్ పార్టీ భగ్నం.. హైదరాబాద్ ఫామ్ హౌస్ లో నటి హేమ

రేవ్ పార్టీ పై హీరో శ్రీకాంత్ రియాక్షన్

ఏపీలో అల్లర్లపై.. డీజీపీకి సిట్ నివేదిక

జూన్ 4 తరువాత చూసుకుందాం: పెద్దిరెడ్డి

సస్పెండ్ అయి స్థానంలో కొత్త అధికారులు

"సాధించాం” అంటూ కన్నీళ్లు పెట్టుకున్న కోహ్లి, అనుష్క..

చరిత్ర సృష్టించిన హైదరాబాద్ యువ కెరటం అభిషేక్ శర్మ..

దొంగ ఓట్ల కోసం చంద్రబాబు, పురందేశ్వరి, పవన్ కళ్యాణ్ చేసిన కుట్ర..

అమెరికా పారిపోయిన అయ్యా.. కొడుకులు

ఏపీలో అల్లర్లు చేసింది వీరే..

Photos

+5

Hakim Shajahan Marriage: హీరోయిన్‌ను పెళ్లాడిన మలయాళ హీరో.. ఎంతో సింపుల్‌గా! (ఫోటోలు)

+5

Indraja Sankar Birthday Photos: విజిల్‌ నటి బర్త్‌డే సెలబ్రేషన్స్‌.. పెళ్లి తర్వాత భర్తతో తొలిసారి (ఫోటోలు)

+5

SRH Vs PBKS Highlights Photos: సన్ రైజర్స్ vs పంజాబ్..తారలతో నిండిన ఉప్పల్ స్టేడియం (ఫోటోలు)

+5

Shobha Shetty: కొత్తింటి కల సాకారం చేసుకున్న బిగ్‌బాస్‌ బ్యూటీ.. ప్రియుడితో గృహప్రవేశం (ఫోటోలు)

+5

నటుడు చందు కన్నుమూత.. వైరలవుతున్న పెళ్లి ఫోటోలు

+5

Afghanistan Floods: అఫ్ఘాన్‌ కొట్టుకుపోయింది.. మిగిలింది శూన్యమే (ఫొటోలు)

+5

ఏపీలో గెలిచేదెవరు? జడ్జ్‌మెంట్‌ డే 4th June (ఫొటోలు)

+5

చందు వైఫ్ షాకింగ్ కామెంట్స్

+5

Sangeetha Sringeri: పునీత్‌ రాజ్‌కుమార్‌ సమాధి వద్ద నటి బర్త్‌డే సెలబ్రేషన్స్‌ (ఫొటోలు)

+5

సంతోషంలో కావ్యా మారన్‌.. కేన్‌ విలియమ్సన్‌ను పలకరించి మరీ! (ఫొటోలు)