రక్షణ కల్పించండి

Published on Tue, 05/08/2018 - 08:02

నెల్లూరు(క్రైమ్‌): కుటుంబసభ్యుల నుంచి రక్షణ కల్పించాలని ఓ ప్రేమజంట పోలీసులను ఆశ్రయించింది. సోమవారం వారు నెల్లూరులోని జిల్లా పోలీసు కార్యాలయంలో అదనపు ఎస్పీ బి.శరత్‌బాబును కలిసి వినతిపత్రం సమర్పించారు. వివరాలిలా ఉన్నాయి. పొదలకూరు మండలం ప్రభగిరిపట్నంకు చెందిన జి.రామచంద్రయ్య రెండో కుమార్తె సుమతి నెల్లూరులోని ఓ ప్రైవేట్‌ హాస్పిటల్‌లో నర్సుగా పనిచేస్తూ నగరంలోని హరనాథపురంలో వర్కింగ్‌ ఉమెన్స్‌ హాస్టల్‌లో ఉంటోంది. ఆమెకు ఎనిమిదేళ్ల క్రితం రాపూరుకు చెందిన కారు డ్రైవర్‌ మాతయ్యతో పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారింది. ఇద్దరి కులాలు వేరు కావడంతో సుమతి కుటుంబసభ్యులు వారి ప్రేమను నిరాకరించారు. దీంతో ఈనెల రెండో తేదీన సుమతి, మాతయ్యలు రాపూరులో రిజిస్టర్‌ మ్యారేజీ చేసుకున్నారు.

 సుమతి హాస్టల్‌లో లేదన్న విషయం తెలుసుకున్న ఆమె కుటుంబసభ్యులు గాలించారు. ఫలితం లేకపోవడంతో నాలుగో నగర పోలీసులకు ఫిర్యాదు చేశారు. మాతయ్యపై అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసులు కేసు నమోదుచేసి విచారణ చేపట్టారు. ఈ నేపథ్యంలో సోమవారం ప్రేమజంట జిల్లా పోలీసు కార్యాలయానికి చేరుకుని తమకు రక్షణ కల్పించాలని ఏఎస్పీని కోరారు. తగిన చర్యలు తీసుకోవాలని ఆయన నాలుగో నగర పోలీసులను ఆదేశించి ప్రేమజంటను ఆ స్టేషన్‌కు పంపారు. ఇన్‌స్పెక్టర్‌ వి.సుధాకర్‌రెడ్డి వారితో మాట్లాడారు. ఈ సందర్భంగా సుమతి తల్లిదండ్రులు ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేయగా నిరాకరించింది. తన ఇష్ట్రపకారామే వివాహం చేసుకున్నానని పోలీసులకు తెలిపింది. దీంతో పోలీసులు ఇరుకుటుంబాల పెద్దలకు కౌన్సిలింగ్‌ చేశారు.

Videos

మరో మహిళతో రూమ్లో ఉండగా పట్టుకున్న నక్షత్ర

ఏపీ ఎన్నికల ఫలితాలు,సర్వేలపై దేవులపల్లి అమర్ కామెంట్స్

పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్.. కాసేపట్లో విచారణ

కొత్త సింబల్ పై రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం

YSRCPదే అధికారం.. విజయ్ బాబు విశ్లేషణ

వాడికి తల్లి లేదు.. చెల్లి లేదు.. రోజుకో అమ్మాయి కావాలి

తెలంగాణ కొత్త చిహ్నంపై కేటీఆర్ షాకింగ్ కామెంట్స్

సొంత అక్కను పడుకుంటావా అని అడిగాడు.. ఆడియో బయటపెట్టిన భార్య

అధికారిక రాజముద్రను ఖరారు చేసిన సీఎం రేవంత్ సర్కార్

ఏపీలో విప్లవాత్మక మార్పులు

Photos

+5

పెళ్లికి ముందే ప్రెగ్నెంట్‌ అంటూ కామెంట్స్‌.. నా భర్త అడిగేవాడన్న హీరోయిన్!(ఫొటోలు)

+5

ఈ స్టన్నింగ్‌ బ్యూటీ.. టీమిండియా స్టార్‌ భార్య! గుర్తుపట్టారా? (ఫొటోలు)

+5

ఎమ్మెల్సీ కవితకు మరో బిగ్ షాక్..

+5

టీ20 వరల్డ్‌కప్‌-2024కు ముందు భార్య అనుష్కతో కోహ్లి చక్కర్లు.. ఫొటోలు వైరల్‌

+5

హీరోయిన్‌ మూడో పెళ్లి.. తెలుగులోనూ నటించింది (ఫోటోలు)

+5

11 ఏళ్ల క్రితం విడిపోయిన స్టార్‌ కపుల్‌.. కుమారుడి కోసం (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టాలీవుడ్‌ హీరో ఆశిష్‌ (ఫొటోలు)

+5

ఎలక్షన్ కమిషన్ నిబంధనలపై పేర్ని నాని రియాక్షన్

+5

Anasuya Sengupta: 'కేన్స్‌'లో చరిత్ర సృష్టించిన భారతీయ నటి (ఫోటోలు)

+5

నేను బతికే ఉన్నా.. ఫోటోలతో క్లారిటీ ఇచ్చిన హీరోయిన్‌ (ఫొటోలు)