ఆరు జిల్లాల్లో కేంద్ర బృందం పర్యటన: రఘువీరారెడ్డి

Published on Wed, 11/13/2013 - 22:24

తుపాను నష్టాలను పరిశీలించేందుకు రాక...
 కేంద్ర బృందానికి తక్షణమే నివేదికలివ్వాలి: మంత్రి రఘువీరారెడ్డి


సాక్షి, హైదరాబాద్: ఆరు జిల్లాల్లో పైలీన్ తుపాను, భారీ వర్షాలవల్ల కలిగిన నష్టాలను కేంద్ర బృందానికి చూపించాలని రెవెన్యూ శాఖ మంత్రి రఘువీరారెడ్డి నిర్ణయించారు. తుపాను, వరద నష్టాలను పరిశీలించేందుకు ఈనెల 17న కేంద్ర బృందాలు రాష్ట్రానికి వస్తున్న నేపథ్యంలో వీటిని ఏఏ జిల్లాలకు పంపించాలనే అంశంపై ఉన్నతాధికారులతో రఘువీరారెడ్డి బుధవారం సమీక్షించారు. కేంద్ర బృందాలు పర్యటించే జిల్లాల్లో ఆస్తి నష్టం, ప్రాణ నష్టం, పంట నష్టాలపై ఫొటో ప్రదర్శనలు ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు.

 

ఆ బృందానికి సమర్పించేందుకు నష్టాల నివేదికలను సిద్ధం చేయాలని రెవెన్యూ అధికారులకు సూచించారు. 17న హైదరాబాద్ చేరుకునే కేంద్ర బృందం సభ్యులు 18న ఉదయం లేక్‌వ్యూ అతిథి గృహంలో ఉన్నతాధికారులతో సమావేశమవుతారు. తర్వాత వీరు మూడు బృందాలుగా విడిపోతారు. ఒక బృందం శ్రీకాకుళం, విశాఖపట్నం; రెండో బృందం గుంటూరు, ప్రకాశం; మూడో బృందం నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల పర్యటనకు అదేరోజు మధ్యాహ్నం వెళతాయి. తర్వాత ఈ మూడు బృందాలు 20వ తేదీ రాత్రికి హైదరాబాద్ చేరుకుంటాయి. 21వ తేదీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, రెవెన్యూ మంత్రి రఘువీరారెడ్డి, వివిధ శాఖల అధికారులతో కేంద్ర బృందం సమావేశమవుతుంది.
 

Videos

తిరుమలలో వైఎస్ఆర్ సీపీ నేతలు

కొందరు చిల్లర రాజకీయాల కోసం తెలంగాణ ఉద్యమాన్ని వాడుకున్నారు

ఏపీ ఎగ్జిట్ పోల్స్ పై మల్లాది విష్ణు రియాక్షన్

ఏపీ ఎగ్జిట్ పోల్స్ పై ఆర్కే రోజా రియాక్షన్

దేశవ్యాప్తంగా పెరిగిన టోల్ చార్జీలు..

తెలంగాణ భవన్ లో ఘనంగా రాష్ట్ర అవతరణ వేడుకలు

బాహుబలి వర్సెస్ బుజ్జి

హిమాలయాల్లో రజినీకాంత్..

తెలంగాణ ఆత్మగౌరవానికి పదేళ్ల పట్టాభిషేకం

భారీ ఎత్తున సెట్ నిర్మాణం.. సెట్ లో సినిమా మొత్తం..?

Photos

+5

తెలంగాణ రాష్ట్ర గీతం పాడిన సింగర్‌ హారిక నారాయణ్‌ (ఫోటోలు)

+5

సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు (ఫొటోలు)

+5

త్వరలో పెళ్లి.. వెకేషన్‌లో చిల్‌ అవుతున్న సిద్దార్థ్‌- అదితి (ఫోటోలు)

+5

T20WC2024 USA vs Canada Highlights: కెనడా జట్టుపై అమెరికా సంచలన విజయం (ఫొటోలు)

+5

రెండేళ్లలో ఎన్నో ఎత్తుపళ్లాలు చూశాం.. ఇక ముందు: దీపక్‌ చహర్‌ భావోద్వేగం (ఫొటోలు)

+5

T20 WC 2007: ధోని నమ్మకం నిలబెట్టిన వరల్డ్‌కప్‌ విజేత.. ఇప్పుడేం చేస్తున్నారో తెలుసా? (ఫోటోలు)

+5

Kiccha Sudeep Daughter Sanvi: కిచ్చా సుదీప్‌ కూతురు ఇప్పుడెలా ఉందో చూశారా? (ఫోటోలు)

+5

Dimple Hayathi Visits Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టాలీవుడ్‌ హీరోయిన్‌ డింపుల్ హయాతి (ఫొటోలు)

+5

Allari Naresh-Virupa: తొమ్మిదవ పెళ్లి రోజు.. అల్లరి నరేశ్‌ భార్యను చూశారా? (ఫోటోలు)

+5

తిరుమలలో బిగ్‌బాస్‌ సందీప్‌ 10వ పెళ్లి రోజు సెలబ్రేషన్స్‌ (ఫోటోలు)