Breaking News

కొలువు కొట్టాలె..

Published on Sun, 01/12/2014 - 04:00

మరో దిక్కులేక దరఖాస్తు చేసిన..
 నా పేరు పడిదెల వేణుగోపాల్‌రావు. మాది వీణవంక మండలం బేతిగల్. నేను హైదరాబాద్‌లో బీటెక్ (సీఎస్‌ఈ)పూర్తి చేశాను. ప్రస్తుతం ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తున్న. మాది వ్యవసాయ కుటుంబం. మా నాన్న కష్టపడి నన్ను చదివించిండు. వారి రెక్కల కష్టం చూడలేకపోతున్న. మా ఊళ్లో అందరు ఎప్పుడు సర్కారు నౌకరి చేస్తవు అంటున్నరు. అందుకే గ్రూప్స్, బ్యాంక్ ఉద్యోగాలకు హైదరాబాద్‌లో ఓ కోచింగ్ సెంటర్‌లో ఆరు నెలలు శిక్షణ తీసుకున్న. ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్న. ఇంతలో వీఆర్వో నోటిఫికేషన్ వెలువడింది. ఏదో ఒక ప్రభుత్వ ఉద్యోగం పొందాలనే కసితో వీఆర్వోకు దరఖాస్తు చేసుకున్న. నా ఫ్రెండ్స్ కూడా చాలా మంది దరఖాస్తు చేసుకున్నరు. ఇంజినీరింగ్ రంగంలో సరైన అవకాశాలు లేకపోవడంతో.. మరో దిక్కులేక వీఆర్వోకు పోటీపడుతున్న.   
 
 కలెక్టరేట్, న్యూస్‌లైన్ : జిల్లాలో వీఆర్‌వో, వీఆర్‌ఏ పోస్టులకు భారీగా దరఖాస్తులు వస్తున్నాయని ఇన్‌చార్జి కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ తెలిపారు. వీఆర్‌వోకు 72,000, వీఆర్‌ఏకు 2200 దరఖాస్తులు అందాయన్నారు. శనివారం ఉదయం హైదరాబాద్ నుంచి భూపరిపాలన ముఖ్య కమిషనర్ ఐవైఆర్.కృష్ణారావు వీఆర్‌వో, వీఆర్‌ఏ పరీక్షల నిర్వహణపై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియా కాన్ఫరెన్స్ నిర్వహించారు.
 
 ఈ సందర్భంగా ఇన్‌చార్జి కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ నెల 13 వరకు 90వేలకు పైగా దరఖాస్తులు వచ్చే అవకాశాలున్నాయని తెలిపారు. పరీక్షల నిర్వహణకు జిల్లాలో 216 కేంద్రాలను గుర్తించామని, అభ్యర్థులు పెరిగితే అదనంగా పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. దరఖాస్తుల ఫొటో పరిశీలన ఈనెల 15లోగా పూర్తి చేస్తామన్నారు. అర్హులైన వారందరూ వీఆర్‌వో, వీఆర్‌ఏ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు గ్రామాల్లో దండోరా వేయిస్తామన్నారు. ఈ పరీక్షలకు డీఆర్‌వో కృష్ణారెడ్డిని సమన్వయ అధికారిగా నియమించామని తెలిపారు.
 

Videos

శ్రీలంకలో ఘోర రోడ్డు ప్రమాదం

పుష్ప రాజ్ తో కేజీఎఫ్ 2 భామ

పాకిస్తానీ నటితో చేయను: బాలీవుడ్ హీరో

ముగిసిన వీరజవాన్ మురళీనాయక్ అంత్యక్రియలు

ప్రధాని మోదీ నివాసంలో ముగిసిన సమావేశం

బ్రహ్మోస్ క్షిపణి పనితీరు ఎలా ఉంటుందో పాక్ కు అడగండి

Ding Dong 2.O: సీఎంల జేబులు ఖాళీ

Miss World Competition: తారలు దిగివచ్చిన వేళ..!

పాక్ ను వణికించిన BRAHMOS

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కీలక ప్రకటన

Photos

+5

తిరుమల దర్శనం చేసుకున్న యాంకర్ శ్రీముఖి (ఫొటోలు)

+5

మదర్స్ డే స్పెషల్.. హీరోయిన్ ప్రణీత పిల్లల్ని చూశారా? (ఫొటోలు)

+5

డాక్టర్ బాబు నిరుపమ్‌ భార్య బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

వైభవంగా తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతర (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (మే 11-18)

+5

మిస్ వరల్డ్ 2025 ఆరంభం: స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నందిని గుప్తా (ఫొటోలు)

+5

Miss World 2025 : ఘనంగా హైదరాబాద్‌లో మిస్‌ వరల్డ్‌-2025 పోటీలు ప్రారంభం (ఫొటోలు)

+5

సీరియల్ నటి విష్ణుప్రియ ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

లండన్ లో రామ్ చరణ్.. చుట్టుముట్టిన మెగాఫ్యాన్స్ (ఫొటోలు)

+5

పాకిస్తాన్‌తో పోరులో దేశ సేవకు అమరుడైన మురళీ నాయక్‌ (ఫొటోలు)