బిస్లెరి వాటర్ వివాదం.. అసలు నిజం ఇదేనంటున్న సంస్థ!

Published on Mon, 11/23/2026 - 10:20

బిస్లెరి తాగునీటిలో ప్రమాదకర రసాయనాలు ఉన్నాయంటూ ఎఫ్ఎస్ఎస్ఏఐ ప్రాసిక్యూషన్‌కు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. దీనిపై సంస్థ స్పందిస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. తమ ఉత్పత్తుల నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడటం లేదని, బిస్లెరి నీరు వినియోగానికి సురక్షితమైనదేనని సంస్థ స్పష్టం చేసింది.

కంపెనీ స్పందన
అసలైన వివాదం సుమారు 14 నెలల క్రితం.. అంటే 2025 సెప్టెంబర్‌లో గోవాలోని బిస్లెరి తయారీ కేంద్రంలో ఉత్పత్తి చేసిన ఒక బ్యాచ్‌కు సంబంధించినదని బిస్లెరి ఇంటర్నేషనల్ వెల్లడించింది. 2025 సెప్టెంబర్ 30న ఎఫ్ఎస్ఎస్ఏఐ అధికారులు గోవాలోని బిస్లెరి ప్లాంట్ నుంచి మొత్తం ఆరు నీటి శాంపిల్స్ సేకరించారు. వీటిలో ఐదు నమూనాలు అన్ని నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నట్లు పరీక్షల్లో తేలింది. అయితే ఆరో శాంపిల్ లీటరు నీటికి 12 మైక్రోగ్రాముల బ్రోమేట్ ఉన్నట్లు గుర్తించారు. కాగా.. అనుమతించిన గరిష్ఠ పరిమితి 10 మైక్రోగ్రాములు మాత్రమే.

దీనిపై బిస్లెరి సంస్థ అభ్యంతరం వ్యక్తం చేస్తూ 2025 నవంబర్ 22న అప్పీల్ చేసుకుంది. అనంతరం ఎఫ్ఎస్ఎస్ఏఐ ఆ శాంపిల్ రిఫరల్ ల్యాబ్‌కు పంపించి మళ్లీ పరీక్షించగా, బ్రోమేట్ పరిమాణం అనుమతించిన పరిమితిలోనే ఉన్నట్లు తేలిందని బిస్లెరి పేర్కొంది. అయితే.. అదే పరీక్షలో పాలీన్యూక్లియర్ అరోమాటిక్ హైడ్రోకార్బన్స్ (PAHs) ఉన్నట్లు ల్యాబ్ గుర్తించిందని తెలిపింది.

రెండు పరీక్షల్లో వచ్చిన ఫలితాల మధ్య వ్యత్యాసం ఉండటంతో మరింత స్పష్టత అవసరమని బిస్లెరి భావించింది. అందుకే.. అదే నమూనాను ఎఫ్ఎస్ఎస్ఏఐ ఆమోదించిన మరో స్వతంత్ర ప్రయోగశాలలో పరీక్షించగా, బ్రోమేట్ పరిమాణం అనుమతించిన పరిమితిలోనే ఉన్నట్లు నిర్ధారణ అయిందని సంస్థ వెల్లడించింది.

నోటీసు అందలేదా?
ఈ పరీక్ష నివేదికలను 2026 ఫిబ్రవరి 2న ఎఫ్ఎస్ఎస్ఏఐ పశ్చిమ ప్రాంతీయ కార్యాలయానికి అధికారిక లేఖతో సమర్పించినట్లు తెలిపింది. అయితే.. ఆ తర్వాత ఎఫ్ఎస్ఎస్ఏఐ నుంచి తమకు ఎలాంటి సమాచారం అందలేదని, దీంతో ఈ వ్యవహారం ముగిసిపోయిందని భావించామని బిస్లెరి పేర్కొంది. అంతేకాకుండా, తాజాగా వార్తల్లో వస్తున్న నోటీసు తమకు ఈమెయిల్ ద్వారా గానీ, నేరుగా గానీ అందలేదని, ఎఫ్ఎస్ఎస్ఏఐ వెబ్‌సైట్‌లో కూడా ఆ నోటీసును గుర్తించలేకపోయామని సంస్థ తన ప్రకటనలో తెలిపింది.

ఇదీ చదవండి: తాగునీటిలో బ్రోమేట్.. కుకీస్‌లో నిషేధిత రంగులు!

తాగునీటి భద్రత తమకు అత్యంత ముఖ్యమని బిస్లెరి స్పష్టం చేసింది. తమ తయారీ ప్రక్రియలో 10 దశల నాణ్యతా తనిఖీలు నిర్వహించడంతో పాటు 90కి పైగా పరీక్షలు చేస్తామని వెల్లడించింది. FSSAIతో పూర్తిస్థాయిలో సహకరిస్తామని, ఈ సమస్యను సంబంధిత నియంత్రణ సంస్థల నిబంధనల ప్రకారం పరిష్కరించుకుంటామని తెలిపింది. ఎన్నో సంవత్సరాలుగా ప్రజల నమ్మకాన్ని సంపాదించుకున్న బ్రాండ్‌గా బిస్లెరి కొనసాగుతోందని, తమ నీరు తాగడానికి సురక్షితమైనదేనని సంస్థ పేర్కొంది.

Videos

బిస్లరీ వాటర్ తాగుతున్నారా.. అయితే అంతే సంగతి.. FSSAI షాకింగ్ ప్రకటన..

షర్మిల గారు మిమ్మల్నే అడుగుతున్న.. వీటికి సమాధానం చెప్పండి చాలు..

పాక్ చేతిలో భారత్ కు ఘోర ఓటమి...

పెళ్ళికొడుకు తరుపు వాళ్ళు ఎంత బాధ పడుతున్నారంటే.. రాంనాథ్ షాకింగ్ నిజాలు

కేవలం 1 లక్షతో 10 లక్షలు సంపాదించే ప్లాన్.!

రణబీర్, యష్ కాదు..! పార్ట్ 2లో ఆయనే హైలెట్...

కండువా కప్పుకోలేదంతే..! బాబు చిటికెయ్యగానే.. పెళ్లి ఉన్నా సరే బెంగళూరు వెళ్లిపోయింది..

పేర్ని కిట్టు ఆధ్వర్యంలో YSRCP చేరిన TDP సీనియర్ నేత

చెల్లి అడిగిందని సొంత ఆస్తి ఇచ్చాడు.. తనది కాని ఆస్తి ఎలా ఇస్తాడు?

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. లక్షకు దిగి రానున్న బంగారం..!

Photos

+5

‘భోగి’ మూవీ ప్రీ రిలీజ్... రెడ్‌ శారీలో మెరిసిన హీరోయిన్‌ డింపుల్ హయాతి (ఫోటోలు)

+5

కార్తీక సోమవారం.. శివనామస్మరణతో మార్మోగిన శివాలయాలు (ఫోటోలు)

+5

విశాఖపట్నం : కార్తీక సండే.. సందడి (ఫోటోలు)

+5

అనిరుధ్- కావ్య రిసెప్షన్‌లో సినీ, క్రీడా ప్రముఖుల సందడి.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ : కోటి దీపోత్సవంలో వైభవంగా మధుర మీనాక్షి కల్యాణం (ఫోటోలు)

+5

శర్వానంద్‌ ‘భోగి’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫోటోలు)

+5

మిర్నా తాజా ఫొటోలు..

+5

ప్రభాస్‌ బ్యూటీ.. చీరలో మెరిసి (ఫోటోలు)

+5

డేంజర్ బాయ్స్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌.. (ఫోటోలు)

+5

హై మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్.. (ఫోటోలు)