ప్రియురాలు హ్యాండ్ ఇచ్చిందని రైలు ఇంజిన్ పైకి ఎక్కాడు!
Breaking News
భారీగా తగ్గనున్న బంగారం దిగుమతులు
Published on Fri, 11/20/2026 - 07:07
సుంకాల పెంపు కారణంగా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పసిడి దిగుమతులు 40 బిలియన్ డాలర్లకు తగ్గొచ్చని కేంద్ర వాణిజ్య శాఖ కార్యదర్శి రాజేశ్ అగ్రవాల్ తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో 72 బిలియన్ డాలర్ల బంగారం దిగుమతయ్యింది.
సాధారణంగా ఏటా 60 బిలియన్ డాలర్ల పసిడి దిగుమతవుతుంది కానీ సుంకాల పెంపుతో ఈసారి ఇప్పటివరకు దిగుమతులు కొంత నెమ్మదించాయని అగ్రవాల్ వివరించారు. కేంద్రం ఈ ఏడాది మే నెలలో పసిడి, వెండిపై దిగుమతి సుంకాలను 6 శాతం నుంచి 15 శాతానికి పెంచిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఏప్రిల్-అక్టోబర్ మధ్య పసిడి దిగుమతులు 40 శాతం క్షీణించి 24.78 బిలియన్ డాలర్లకు తగ్గాయి.
తగ్గుతున్న బంగారం ధరలు
బంగారం ధరలు గత కొన్ని రోజులుగా భారీగా పతనమవుతున్నాయి. కేవలం 10 రోజుల వ్యవధిలోనే తులం పసిడి రేటు 10 వేల రూపాయల కంటే ఎక్కువ తగ్గింది. వెండి రేటు కూడా రూ.2 లక్షల మార్క్ కిందికి వచ్చేసింది. రానున్న మరింత తగ్గుతాయా?, లేదా? అనేది మాత్రం ముందు ముందు తెలుస్తుంది.
Tags : 1