Breaking News

టాప్‌ 40 సీహెచ్‌ఆర్‌వోల్లో రిలయన్స్‌ ఇరా బింద్రా 

Published on Wed, 11/18/2026 - 05:20

న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా టాప్‌ 40 హ్యూమన్‌ రిసోర్సెస్‌ ఆఫీసర్స్‌ (సీహెచ్‌ఆర్‌వో) జాబితాలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ప్రెసిడెంట్‌ (పీపుల్‌ అండ్‌ టాలెంట్‌) ఇరా బింద్రా ర్యాంకు మరింత మెరుగుపడింది. గతేడాది 28వ ర్యాంకులో ఉండగా తాజాగా 19వ ర్యాంకు దక్కించుకున్నారు. అలాగే, ఈ గ్లోబల్‌ లిస్టులో వరుసగా రెండో ఏడాది భారత్‌ నుంచి చోటు దక్కించుకున్న ఏకైక కంపెనీ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ కావడం గనార్హం. అడ్వైజరీ సేవలందించే గ్లోబల్‌ సంస్థ ఎన్‌2గ్రోత్‌ ఏటా ఈ ర్యాంకులు ఇస్తుంది.

 తమ తమ సంస్థల పనితీరు, సిబ్బంది, వర్క్‌ప్లేస్‌ సంస్కృతిని సానుకూలంగా ప్రభావితం చేసిన టాప్‌ 40 మంది చీఫ్‌ హ్యూమన్‌ రిసోర్సెస్‌ ఆఫీసర్లకు పురస్కారాలు ఇస్తుంది. ఈ ఏడాది ’స్పష్టత’ థీమ్‌ ఆధారంగా ర్యాంకులు ఇచ్చింది. అంతర్జాతీయ బిజినెస్, హ్యూమన్‌ రిసోర్సెస్‌ విభాగంలో బింద్రాకు 25 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. రిలయన్స్‌లో చేరడానికి ముందు ఆమె అమెరికాకు చెందిన మెడ్‌ట్రానిక్, జనరల్‌ ఎలక్ట్రిక్‌లో దాదాపు రెండు దశాబ్దాల పాటు సీనియర్‌ హోదాలో పని చేశారు.

Videos

వేంపల్లి నామినేషన్ కేంద్రంలో TDP గూండాలు

అనితకు షాక్... ప్రలోభాలకు టీడీపీలోకి వెళ్లిన MPTC.. తిరిగి YSRCPలో జాయిన్

దాన వీర శూరగా తారక్.. క్రేజీ టైటిల్ సెట్ చేసిన రావిపూడి...

కుల్గామ్ దాడి ఘటనకు ప్రతీకారం తీర్చుకున్న భద్రతా బలగాలు

HERO నుండి రూ.3 లక్షలకే ఎలక్ట్రిక్ కారు?

జక్కన్న మాస్టర్ ప్లాన్! మహేష్ లుక్ మామూలుగా లేదుగా!

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. లక్షకు దగ్గరగా బంగారం

డబ్బుకి అమ్ముడుపోతావా..? బండారు శ్రావణి ఇంట్లోకి దూసుకెళ్లిన టీడీపీ నేతలు

ఈ ఒక్క బైరెడ్డిని ఆపితే.. 100 బైరెడ్డిలు వస్తారు.. హౌస్ అరెస్ట్ పై బైరెడ్డి స్టాంగ్ రియాక్షన్

అమ్మా నేను చచ్చిపోతా..! జనసేన కేకే వ్యాఖ్యలపై ధరణి కృష్ణ ఎమోషనల్ రియాక్షన్

Photos

+5

బ్లాక్ డ్రెస్‌లో అదరగొడుతున్న అనిషా అంబ్రోస్..(ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ చిలుకలా మీనాక్షి చౌదరి (ఫొటోలు)

+5

కొల్లేరులో శీతాకాలంలో విడిది పక్షుల సందడి (ఫోటోలు)

+5

అనంతపురం : పులకించిన పుట్టపర్తి (ఫోటోలు)

+5

బ్లాక్ డ్రస్‌లో రచ్చ లేపుతున్న మృణాల్ ఠాకుర్ (ఫొటోలు)

+5

ఇంకా దీపావళి హ్యాంగోవర్‌లోనే మాళవిక (ఫొటోలు)

+5

'ఎర్త్ షాట్ ప్రైజ్' ఈవెంట్.. రకుల్ రెడీ అయిందిలా (ఫొటోలు)

+5

వావ్ అనేలా శార్వరి వాఘ్ (ఫొటోలు)

+5

అక్కా సిరీస్‌లో కీర్తి సురేశ్ స్టిల్స్.. (ఫోటోలు)

+5

హీరోయిన్ సమంత సీమంతం వేడుక.. (ఫోటోలు)