Breaking News

గూగుల్‌ వారి... డ్రీమ్‌బిన్స్‌

Published on Wed, 11/18/2026 - 04:31

గూగుల్‌ సంస్థ ‘డ్రీమ్‌బిన్స్‌’ అనే సరికొత్త ప్రయోగాత్మక అప్లికేషన్‌ను తీసుకువచ్చింది. గూగుల్‌ ల్యాబ్‌ ఈ యాప్‌ను డెవలప్‌ చేసింది. యూజర్‌లు సమాచారాన్ని వెదికే విధానాన్ని మార్చే లక్ష్యంతో దీన్ని రూపొందించారు.

→ సాధారణంగా యూజర్‌లు తమకు ఆసక్తి ఉన్న టాపిక్స్‌ గురించి సెర్చ్‌ చేస్తుంటారు. కంటెంట్‌ కోసం రకరకాల ప్లాట్‌ఫామ్‌లలోకి వెళ్లి బ్రౌజ్‌ చేస్తుంటారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని సంబంధిత టాపిక్‌పై అప్‌డేట్‌ల గురించి తెలుసుకోవడానికి పదే పదే ఇంటర్‌నెట్‌లో వెదకడం, సోషల్‌ మీడియాలో స్క్రోల్‌ చేయడానికి బదులుగా పర్సనలైజ్‌డ్‌ కంటెంట్‌ ఆటోమేటిక్‌గా తెలుసుకునేలా ‘డ్రీమ్‌బిన్స్‌’ ను డిజైన్‌ చేశారు.

→ యూజర్‌ల గూగుల్‌ ఎకౌంట్‌ నుంచి సమాచారాన్ని సేకరించడం, ఉపయోగించడం ద్వారా పర్సనలైజ్‌డ్‌ స్టోరీస్‌ను క్రియేట్‌ చేస్తుంది డ్రీమ్‌బిన్స్‌. ఎనేబుల్‌ చేయబడిన సర్వీసెస్, పర్మిషన్‌లను బట్టి ఇది జీమెయిల్, గూగుల్‌ క్యాలెండర్, గూగుల్‌ ఫొటోస్, గూగుల్‌ సెర్చ్, జెమిని, యూట్యూబ్‌ నుంచి సంబంధిత సమాచారాన్ని గ్రహిస్తుంది. యూజర్‌కు సంబంధించిన ఆసక్తులు, యాక్టివిటీస్, భవిష్యత్‌ ప్రణాళికలను అర్థం చేసుకోవడానికి ఈ సమాచారాన్ని ఉపయోగిస్తుంది. 

→ ఉదాహరణకు... సందర్శించాల్సిన ప్రదేశాల గురించి ‘ఈ ప్రదేశాలు అయితే బాగుంటుంది. ఎందుకంటే..’ అంటూ డ్రీమ్‌బిన్స్‌ సూచనలు ఇస్తుంది. రాబోయ్‌ ఈవెంట్‌లను హైలెట్‌ చేస్తుంది. పెండింగ్‌లో ఉన్న పనులను గుర్తు చేస్తుంది.

→ యూజర్‌లు ఒక్కో కథనంపై ట్యాప్‌ చేసి అదనపు సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ఆసక్తికరమైన కంటెంట్‌ను సేవ్‌ చేసుకోవచ్చు. ఆ స్టోరీస్‌ను ఇతరులతో షేర్‌ చేసుకోవచ్చు. సిఫారసులను మెరుగుపరచడంలో సహాయపడడానికి ఫీడ్‌బ్యాక్‌ను అందించవచ్చు.

→ ‘వీయో ఏఐ’ని ఉపయోగించి ఇమేజ్‌లను వీడియోలుగా మారుస్తుంది గూగుల్‌. స్టోరీస్‌లో చేర్చిన ఇమేజ్‌లను యానిమేట్‌ చేయగల సామర్థ్యం ‘డ్రీమ్‌బీన్స్‌’లోని మరో ఆసక్తికర ఫీచర్‌. సెలెక్ట్‌ చేసుకున్న స్టోరీలకు ఇమేజ్‌లను యానిమేట్‌ చేసే మరో ఆసక్తికరమైన ఫీచర్‌ కూడా ఇందులో ఉంది. నిశ్చల చిత్రాలను మూవింగ్‌ ఇమేజ్‌లుగా మార్చడానికి వియో ఏఐ–టెక్నాలజీని గూగుల్‌ ఉపయోగిస్తుంది.
తెలుగుతో పాటు 14 భాషలను ‘డ్రీమ్‌బిన్‌’ సపోర్ట్‌ చేస్తుంది.
 

→ కనెక్టెడ్‌ గూగుల్‌ సర్వీస్‌ నుంచి ఈ యాప్‌ సమాచారాన్ని ఉపయోగిస్తుంది కాబట్టి, యాక్సెస్‌ ఎనేబుల్‌కు ముందు పర్మిషన్, ప్రైవసీ సెట్టింగ్‌లను యూజర్‌లు రివ్యూ చేసుకోవాలి. ఏ ఎకౌంట్స్‌తో, సర్వీసెస్‌తో అనుసంధానించబడ్డాయె కూడా చెక్‌ చేసుకోవాలి. తమ సమాచారం ఎలా ఉపయోగపడుతుందో అర్థం చేసుకోవాలి.
పద్దెనిమిది ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయసు ఉన్న యూజరులకు ఆండ్రాయిడ్, ఐవోఎస్‌ రెండిటిలోనూ ఈ యాప్‌ అందుబాటులో ఉంది.
                                               

#

Tags : 1

Videos

వేంపల్లి నామినేషన్ కేంద్రంలో TDP గూండాలు

అనితకు షాక్... ప్రలోభాలకు టీడీపీలోకి వెళ్లిన MPTC.. తిరిగి YSRCPలో జాయిన్

దాన వీర శూరగా తారక్.. క్రేజీ టైటిల్ సెట్ చేసిన రావిపూడి...

కుల్గామ్ దాడి ఘటనకు ప్రతీకారం తీర్చుకున్న భద్రతా బలగాలు

HERO నుండి రూ.3 లక్షలకే ఎలక్ట్రిక్ కారు?

జక్కన్న మాస్టర్ ప్లాన్! మహేష్ లుక్ మామూలుగా లేదుగా!

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. లక్షకు దగ్గరగా బంగారం

డబ్బుకి అమ్ముడుపోతావా..? బండారు శ్రావణి ఇంట్లోకి దూసుకెళ్లిన టీడీపీ నేతలు

ఈ ఒక్క బైరెడ్డిని ఆపితే.. 100 బైరెడ్డిలు వస్తారు.. హౌస్ అరెస్ట్ పై బైరెడ్డి స్టాంగ్ రియాక్షన్

అమ్మా నేను చచ్చిపోతా..! జనసేన కేకే వ్యాఖ్యలపై ధరణి కృష్ణ ఎమోషనల్ రియాక్షన్

Photos

+5

బ్లాక్ డ్రెస్‌లో అదరగొడుతున్న అనిషా అంబ్రోస్..(ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ చిలుకలా మీనాక్షి చౌదరి (ఫొటోలు)

+5

కొల్లేరులో శీతాకాలంలో విడిది పక్షుల సందడి (ఫోటోలు)

+5

అనంతపురం : పులకించిన పుట్టపర్తి (ఫోటోలు)

+5

బ్లాక్ డ్రస్‌లో రచ్చ లేపుతున్న మృణాల్ ఠాకుర్ (ఫొటోలు)

+5

ఇంకా దీపావళి హ్యాంగోవర్‌లోనే మాళవిక (ఫొటోలు)

+5

'ఎర్త్ షాట్ ప్రైజ్' ఈవెంట్.. రకుల్ రెడీ అయిందిలా (ఫొటోలు)

+5

వావ్ అనేలా శార్వరి వాఘ్ (ఫొటోలు)

+5

అక్కా సిరీస్‌లో కీర్తి సురేశ్ స్టిల్స్.. (ఫోటోలు)

+5

హీరోయిన్ సమంత సీమంతం వేడుక.. (ఫోటోలు)